Others

కడుపుకోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలలుగన్న ఆశ కలత చెందింది
అది పట్టాల మీద
మరణంతో మాట్లాడుతున్నది
ఆగిన జీవిక శ్వాస
నేలను నెత్తుటితో అలికిన దేహం మీద
అదృశ్య గాయాలను చూస్తున్నది

రోదిస్తూ రోదిస్తూ
గాయపడ్డది ఇల్లు
భారం తట్టుకోలేక
ఎప్పుడో కలపబడిన అన్నం ముద్దలా
వెతలను సావధానంగా గడ్డ కట్టుకుంటుంది

ఆ గదిలో వౌనం
తగలబడిపోతున్న ఈత మొద్దుని చూపిస్తుంది
పగిలిన ఇటుకల పొడి
పాలిపోయన అంతరంగాన్ని ఆవిష్కరించింది
గాలిలో కలిసిన దుమ్ములా
ఆలోచనలన్నీ అంతర్థానమయ్యాయ

గుండె పగిలిన జ్ఞాపకం
చెల్లాచెదురైన అక్షరాలు
రాలిపడ్డ వెన్నుపూసలు
కాగితంపై కన్నీటి గీతలను గీసిపోయాయ

అసంగత దారి
నిర్లక్ష్యపు సంతకం
నిగ్గదేరే మొగ్గలను మసిబొగ్గులను చేసి
పట్టుకొచ్చే మార్కుల కాగడా
కడుపు కోతలతో ఏ ప్రభను వెలిగించినట్టు?
ఎవరి ఊపిరిని నిలబెట్టినట్లు?

- నక్క హరికృష్ణ