Others

ఇలా బిడ్డను కని.. అలా పరీక్ష హాలుకి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పడతికి పంతం రావాలేగానీ, బ్రహ్మరుద్రాదులు కూడా ఆమెను ఆపలేరు. నిండు చూలాలుగానే బీహార్‌కు చెందిన ముజఫ్ఫర్‌పూర్ వాస్తవ్యురాలు శ్రీమతి రంజుకుమారి బిరుూ్యడీ పరీక్షరాసి తీరాలనుకుంది. గానీ పరీక్షనాడు ప్రొద్దునే్న (13వ తేదీ) పరీక్ష హాలుకు బయలుదేరే ప్రయత్నంలో వుండగానే నొప్పులొచ్చాయి. ప్రయివేటు ఆసుపత్రికి పట్టుకుపోయారు కుటుంబ సభ్యులు. పండంటి బిడ్డను కన్నది. అది ఆమెకు రెండో బిడ్డ.
‘‘పదండి.. పరీక్ష హాలుకు పోయి తీరాలి’’ అంటూ గొడవ చేసింది. ఛాన్సు పోతే మళ్లీ చాలా కాలం ఆగాలి అంటూ మారం చేసింది. చేసేది లేక ప్రసవం అయిన గంటన్నరలోపునే ఆమెని అంబులెన్సులో పరీక్షా కేంద్రానికి హుటాహుటీ తీసుకుపోయారు. హాలు టికెట్ చెక్‌చేసిన ఎగ్జామ్ అథారిటీస్ అవాక్కయిపోయారు.
‘‘అమ్మా! నువ్వు యింకా పురిటాలువి. కనుక, యిక్కడే రుూ అంబులెన్సులోనే కూర్చొని పేపరు రాయి’’ అంటూ స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు. ఇన్‌విజిలేటర్ ఒకడు బయట కూర్చున్నాడు. ఆమె పరీక్ష రాసింది. ‘‘బిరుూ్యడీ అయితే నేను నా పిల్లల్ని పెంచడంలోనూ, చదివించడంలోనూ కూడా కృతకృత్యురాల్నవుతాను’’ అంటూ, నడ్డి కట్టు బిగించకుంటూ ప్రశ్నాపత్రానికి జవాబులు రాసింది. అరగంట ఆలస్యం అయింది. పైగా అంబులెన్సు కూడా దిగలేదు. ఐనా పరీక్షాధికారిణి జాలిగుండెగల మరో స్ర్తి కనుక సాహించి పరీక్ష రాయనిచ్చింది. ఆమె పేరు మమతారాణి. సార్థక నామధేయురాలేనన్నారంతా!

-వీరాజీ