Others
అనర్ఘ సాహితీరత్నం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ ప్రాచీన ఆధునిక తెలుగు సాహిత్య మేళవింపుతో ప్రతిభావంతమైన రచయితగా అర్ధ శతాబ్ది పైగా అరుదైన సాహితీమూర్తిగా సాహిత్యాన్ని ప్రభావితం చేశారు. కవి, విమర్శకుడు, కథకుడు, నవలా రచయిత, వ్యాఖ్యాత, సంస్కృతాంధ్ర భాషాపండితుడు అయిన శ్రీకాంతశర్మ, తండ్రి హనుమచ్చాస్ర్తీ సంప్రదాయ వారసత్వంతో సంస్కృత భాషావేత్తగా, ఆధునిక సాహిత్యాన్ని వచన కవితా, అనుభూతి అభ్యుదయవాదంవైపు మలుపుతిప్పారు. కృష్ణశాస్ర్తీ, తిలక్ అభ్యుదయ కవితా యుగ యువ ప్రభావంతో ఆకాశవాణి, పత్రికా రంగాలలో క్రమేపీ సాహితీ ప్రస్థానంలో అపురూపమైన కవిగా, రచయితగా భావకవితా సామాజిక ప్రయోజనాలను సాధించే భావాలు, శైలితో వివిధ ప్రక్రియలలో తెలుగును సుసంపన్నం చేశారు. శిలామురళి, అనుభూతి గీతాలు, ఆలాపన, సుపర్ణ వంటి కవిత్వ రచనలు, తూర్పున వాలిన సూర్యుడు, శవపూజ, క్షణికం నవలలు, సాహిత్య పరిచయం, అలనాటి నాటకాలు, ఆలోచన, సంచలనమ్, తెలుగు కవుల అపరాధాలు, సాహిత్య విమర్శలు శ్రీకాంతశర్మ ప్రతిభకు మచ్చుతునకలు. మాతృభాషాభిమానంతో వివిధ సాహితీ ప్రక్రియలు కొనసాగించి హాలగాథా సప్తశతి నుంచి 104 అద్భుత ప్రాచీన గాథలకు కథారూపంగా వ్యాఖ్య, వేంకటాధ్వరి సంస్కృత చంపూ ప్రబంధానికి విశ్వగుణాదర్శంగా తెలుగు వ్యాఖ్య వంటి రచనలతో చిరస్మరణీయత సాధించారు.
1970-2000 సంవత్సరాల మధ్య తెలుగు సాహిత్యంలో లబ్దప్రతిష్ఠులైన మేధావులెందరో శ్రీకాంతశర్మకు ఆత్మీయ బంధువర్గంలో సన్నిహితులుగా పాత కొత్తల మేలి కలయికగా ప్రభావితం పొందినవారే. ఇంట్లో, పత్రికా కార్యాలయం, ఆకాశవాణి కేంద్రం - ఇలా ఎక్కడవున్నా సాహితీ వ్యాసంగం తప్ప ఆయనకు మరో ధ్యాస లేదు. ఎన్నడూ బిరుదుల కోసం తాపత్రయ పడలేదు. పురస్కారాల కోసం పరుగులు తీయలేదు. ఆకాశవాణి ప్రతిష్ఠను జాతీయ స్థాయికి తన ప్రతిభా సంపత్తితో తీసుకువెళ్లారు. పత్రికా రంగాన్ని అద్వితీయంగా సాహితీవేత్తగా తెలుగు భాషకు, ఆధునిక భావాలకు జీవం అందించారు. తన వృత్త్ధిర్మాన్ని అత్యంత అరుదైన జీవన సాహితీ ప్రవృత్తితో నిర్వర్తించారు. తిరువన్నామలైలో చలంతో శ్రీకాంతశర్మ ఇంటర్వ్యూ, తెలుగు సాహిత్యానికి అనర్ఘ జీవన సందేశాన్ని అందించింది. అలాంటివి ఎన్నో వున్నాయి. మాతృభాషా మాధుర్య ఔన్నత్యాన్ని తేటతెలుగు పదాలతో పాఠశాలలో బాలబాలికలు పాడుకునే అద్భుత గేయాలు ఎన్నో రచించారు. ఒకపక్క అనుభూతివాద కవిత్వంతో, కవితామతల్లిని ఆరాధిస్తూనే రేడియో పత్రికా రంగాలలో దశాబ్దాల విధి నిర్వహణలో ఎందరో యువ సాహితీవేత్తలకు, కళాకారులకు, సాహితీ ప్రముఖులకు ఆత్మీయ సేవలు అందించారు. మార్గదర్శకులయ్యారు. చమత్కార హాస్య సంభాషణలతో అందరినీ అలరించే నిష్కల్మష కవితా హృదయులైన సుప్రసిద్ధ కవిని, రచయితను తెలుగు జాతి కోల్పోవటం దురదృష్టకర ఆశనిపాతం. ఆ లోటు భర్తీ కాదు.