Others

సమయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాత్రి ఒంటిగంట తర్వాత
నీడల్ని నిజాల్ని చూసి
జాగిలం ఆగి ఆగి
గొంతెత్తి మొరుగుతున్నది

ఉమ్మడి కుటుంబాల్లో
కొత్త దాంపత్య దేహాలు
పునరుత్పత్తి ప్రక్రియలో
దోహదకారు చల్లకవ్వం ధ్వని

ఆకలితో చంటిపిల్ల
ఏడ్చీ ఏడ్వకముందే
ప్రేమనంతా రంగరించి
సేపులచ్చిన తల్లి స్తన్యాన్ని
ఒడుపుగా అందించినప్పుడు
పాలు తాగుతున్న అత్యద్భుత చిన్మయ శబ్దం

రాత్రి దీపం లే కాంతిలో
గోడమీద వాలిన పురుగులను
ఒక్కటొక్కటిగా కై నీడలో దాక్కొని
ఇష్టంగా గుటకేస్తున్న బల్లి

ఇంటి మొప్పలు లాంటి
కిటికీలను తెరిచినా
ఏమారుస్తున్న వేడిగాలి

దగ్గరి మార్కెట్‌కు
అరొక్క కూరగాయలు పండు
పాలు ధాన్యం అమ్ముకోవడానికి
సిద్ధం అవుతున్న రైతు

యాభై కిలోమీటర్ల దూరం
పట్టణ లేబర్ అడ్డాకు పోవడానికి
తన కుటుంబానికి
అన్నంకూర వండి సద్ది కట్టుకొని
తయారవుతున్న కూలితల్లి
కడు విషాద సన్నివేశం

పుస్తకాల మధ్య మంచంపై
ఈ పక్కా ఆ పక్కా బొర్రినా
ఎంతకూ నిద్ర పట్టని
చీకటి దారిలో కందిలి లాంటి
కవి వంటి మనిషిన్నూ -

ప్రపంచానికి పక్షులకు రెక్కల్ని తొడిగే
రామ్‌ములక పండు
సూర్యుడ్ని ప్రసవించడానికి
తూర్పు పురిటినొప్పులు పడుతుంది.

- జూకంటి జగన్నాథం