Others

కాశ్మీరం రశ్మిమంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయతు జయతు కాశ్మీరం
జయోస్తు భారత గళ మణిహారం
ఇదే స్వతంత్ర భారతం.. ఘన స్వతంత్ర భారతం
మన స్వతంత్ర భారతం.. ‘నమో’ తెచ్చిన నవతరం
ఈనాడు మన కాశ్మీరం.. అయింది రశ్మిమంతం
ప్రజాన్నభుక్కులు పరాన్న భుక్కులు
బజారుపాలయ్యారు, బేజారవుతున్నారు
ఇన్నాళ్ళూ దోచుకున్న కాశ్మీరం
కలగా, అందని ఫలంగా మారింది
***
తరతరాల సంకెలలను తటాలున త్రెంచుకుంది-
కన్నుమూసి తెరిచేలోపే--
కన్నతల్లి ఒడిలో చేరింది-
కావలసినది కానే అయింది-
నూతన కాశ్మీరం.. కన్ను తెరచింది
ఒళ్ళు విరచింది.. ఉల్లాసంతో ఊగింది-
భుక్త్భిక్తులు భోగరాజులు
చొక్కాలు చించుకున్నారు
గొంతులూ చించుకున్నారు.
ఎవరు యేం చేసినా న్యాయం గెలవక తప్పలేదు
ఉక్కు సంకల్పంతో ‘నమో’ వెనక్కు తగ్గలేదు
చతురమతి అమిత్‌షాకు ఎదురే లేదు.
కుంకుమ పువ్వు కాశ్మీరమా!
కుంకుమ రేఖలు విచ్చుకున్నాయి
సంకట దినాలు తరలిపోయాయి.
ఇంకెవ్వరూ నిన్ను తాకలేరు
జయతు జయతు కాశ్మీరం
జయోస్తు భారత గళ మణిహారం

-ఉమాపతి బి.శర్మ