Others

కనకధారాస్తవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేదరికంతో పరితపిస్తున్న ఇల్లాలిని చూసి జాలిచెంది ఆదిశంకరాచార్యులు ‘కనకధారాస్తవము’ను ఆశువుగా చెప్తూ
‘సరసిజ నిలయే సరోజహస్తే ధవళ తమాం శుక గంధమాల్య శోభౌ,
భగవతి హరివల్లభౌ, మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం’
అని లక్ష్మీదేవిని స్తోత్రంచేశారు. సువర్ణామలకవర్షమును వర్ణిపజేసి ఇల్లాలి దారిద్య్ర బాధను బాపిన కరుణామయి, భక్తపరాధీన, జగన్మాత శ్రీమహాలక్ష్మి.
‘‘ఈశానాం జగతోస్య వేంకటపతే ద్విష్ణోః పరాం ప్రేయసీం
తద్వక్షల నిత్యవాసి రసికాం తక్షాంతి సంవర్థనీమ్
పద్మాలంకృత పాణి పల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రీయమ్
వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరమ్’’
(శ్రీవేంకటేశ ప్రపత్తిః)
‘శ్రీ’ అంటే పంచేంద్రియాలు. భగవత్ క్షేత్ర దర్శనసంపద కన్ను. వినే సంపద చెవి. భగవదర్పిత సుగంధాన్ని ఆఘ్రాణించే సంపద నాసిక. గుణాలను గానం చేసే సంపద నోరు. భగవత్ మహిమలను నిరంతరం చింతించే సంపద మనస్సు. ఈ ఐదు సంపదలు మానవ దేహంలో శిరస్సులో కేంద్రీకృతమై ఉన్నాయి. అదే మూల పదార్థం. అక్కడ వున్న సహస్రారచక్రంలో, కుండలినీ యోగశక్తి ప్రస్ఫుటమవుతుంది. సహస్రారాంతర్గత చంద్రమండలంలో ప్రవేశించగానే అమృతధారలు వర్షిస్తాయి. ఇదే జీవ బ్రహ్మైక్యస్థితి. ఆ స్థితి ప్రసాదించే శక్తి వరలక్ష్మీమాత.
‘వ’కారం జ్ఞానశక్తి వాచకం. ‘ఇ’కారం ఇచ్ఛాశక్తి వాచకం. ‘కట’ అంటే కురిపించేది అని అర్థం. కనుక పంచేంద్రియాలతో శ్రీమంతమైన శ్రీగిరి శిఖర నివాసియై, సాత్వికేంద్రియాలన్న లక్ష్మీ సంపదకు రమణులై జ్ఞాన ఇచ్ఛాశక్తులను నిండుగా ప్రవహింపచేసి నిద్రాణమైన శక్తిని ప్రకటింపజేసి ఉద్ధరించి, భక్తులకు ఇష్టార్థాలను ప్రసాదించువానిగా, ఈశుడైన వేంకటేశుని, శక్తివంతునిగా చేసింది శ్రీమహాలక్ష్మి. కనుకనే, సమస్త లోకములకు తల్లివైన ఓ మహాలక్ష్మీ దేవి, శ్రీవిష్ణుమూర్తి అయిన శ్రీవేంకటాచలపతికి, మిక్కిలి ప్రియమైన దానివై, అతని విశాలవక్షస్థలమున వసించి విహరిస్తూ అతనికి సహనశక్తిని, భక్తుల పాపాలను పోగొట్టే శక్తిని, పెంపొందించే జగన్మాత శ్రీ మహాలక్ష్మి, నీకు నమస్కరించుచున్నామని, శ్రీవేంకటేశ సుప్రభాత ప్రపత్తిలో శ్రీలక్ష్మీదేవిని ప్రస్తావించి ప్రార్థించారు. ఇది ఈ రోజు మనం జరుపుకునే వరలక్ష్మీ పూజకు స్ఫూర్తినిస్తుంది.