Others

మంచుపూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడేమి ఒరిగిందని వేడుకలు?
ఏమి సాధించామని సంబురాలు?
వేయాల్సిన అడుగులు ఎన్నో...
వీడాల్సిన చిక్కుముడులు ఇంకెనె్నన్నో...

కల్లోల కుంపట్లు చల్లారనే లేదు
ఉగ్రకుట్రలు భగ్నమవనే లేదు
శత్రువు తోకముడవనే లేదు
ఆక్రమిత కాశ్మీరం దుష్ట ‘చెర’వీడనే లేదు

బలగాల బందూకుల నడుమ
నిరంకుశ విధానాలు రుద్దితే
ఏళ్లనాటి రావణకాష్టం చల్లారేనా?
ఉన్మాద విధ్వంసాలు సద్దుమణిగేనా?

జనామోదం కొరవడిన
ఏ పాలనైనా సజావుగా సాగదు
ఏ చట్టమైనా సమర్ధమై నిలువదు

ఇప్పటికైనా.. స్థానిక జన హృదయాల గెలువ
అడుగులు వెయ్యాలి
అభద్రతల చీకట్లో మగ్గుతున్న
కశ్మీరీల బతుకులకు భరోసానివ్వాలి

నిరాశ నిస్పృహలల్లో కుంగుతున్న
అభాగ్యుల్లో కొత్త ఆశలు పాదుకొల్పాలి
యావత్ భారత జాతి అండగా ఉంటుందన్న
నిండు విశ్వాసాల ఊపిరిలూదాలి

అప్పుడే కల్లోల కాశ్మీరాన...
స్వేచ్ఛా స్వాతంత్య్రాలు వెల్లివిరిసేది
మంచుపూల వనం మళ్ళీ గుబాలించేది
జీవితాలు జీవనదులై ప్రవహించేది
భరతమాత సిగన
కశ్మీర కలికితురాయి తళుకులీనేది

-కోడిగూడి తిరుపతి 95739 29493