Others

‘మత్తు’ నివారణకు కార్యాచరణ ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి నవ నాగరిక యుగంలో మద్యపానం, మత్తు పదార్థాల వినియోగం నానాటికీ విస్తరిస్తూ ప్రజారోగ్యం పాలిట పెనుశాపంగా మారింది. కూలిపనులు చేసేవారి మొదలు, విద్యార్థులు, నడి వయస్కులు చాలామంది వీటికి బానిసలవుతున్నారు. యువతరంపై మాదకద్రవ్యాల ప్రభావం చాపకింద నీరులా విస్తరిస్తోంది. విశ్వవిద్యాలయాల్లో, కాలేజీల్లోని విద్యార్థుల వరకు మత్తు పదార్థాల వినియోగం విస్తృతం అవుతోంది. వీటి సరఫరాకు విద్యార్థులనే పావులుగాచేసి కొందరు స్వార్థపరులు భారీగా సంపాదిస్తున్నారు.
1909వ సంవత్సరంలో చైనాలోని షాంఘైలో మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సులో మాదక ద్రవ్యాల వినియోగం, ఉత్పత్తి, రవాణా, విక్రయాలను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించారు. ఇక- 1987 నుంచి మాదకద్రవ్యాల నిరోధక దినోత్సవాన్ని ఏటా జూన్ 26న నిర్వహిస్తున్నప్పటికీ ఐక్యరాజ్య సమితి లక్ష్యాలు నీరుగారిపోయాయి.
మాదక ద్రవ్య సంబంధిత రోగాలతో ప్రపంచ వ్యాప్తంగా సుమారు మూడున్నర కోట్ల మంది వైద్య సేవల కోసం అలమటిస్తున్నారని, వీరికి కొంతమేరకు వైద్యసేవలు అందుతున్నట్లు ఐక్యరాజ్య సమితి నివేదిక తేటతెల్లం చేసింది. భారత రాజ్యాంగంలోని 47వ అధికరణం ప్రజల జీవన ప్రమాణాలు, పౌష్టికాహారం, ప్రజారోగ్యం మెరుగుదల గురించి పట్టించుకోవాల్సిన కర్తవ్యంపై ష్టీకరిస్తున్నా అందుకు తగిన మన్నన లభించడం లేదు. వైద్యపరమైన కొన్ని అవసరాల్ని మినహాయించినట్లయితే, ప్రజారోగ్యానికి చెరుపుచేసే మాదకద్రవ్యాలు, మత్తుపానీయాలతో ఎందరో శారీరక, ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు.
మద్యం విక్రయాలపై వస్తున్న ఆదాయంతో ప్రభుత్వ ఖజానా నిండుతోందని, ఆ రాబడిని పలు సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం వినియోగిస్తున్నామని పాలకులు చెబుతుంటారు. మద్యం విక్రయాలను పూర్తిగా నిషేధిస్తే ప్రభుత్వ ఖజానాకు ఆదాయం భారీ ఎత్తున తగ్గుతుందన్న ప్రచారం జరుగుతోంది. గతంలో పలు ప్రభుత్వాల హయాంలో మద్యాన్ని హెచ్చు స్థాయిలో విక్రయించాలని సంబంధిత వ్యాపారులపై, ఎక్సయిజ్ శాఖ అధికారులపై వత్తిడి తీసుకువచ్చిన సందర్భాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ముఖ్యంగా పండగ దినాలు, సెలవురోజుల్లో మద్యం విక్రయాలు విచ్చిలవిడిగా సాగుతున్నాయి.
మద్యం విక్రయాల వల్ల వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వం గట్టెక్కుతుందనే వాదనలు సమర్ధనీయం కాదు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో- తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దశలవారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని వైకాపా అధినేత వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచి, అధికార పగ్గాలు చేపట్టాక కూడా ఆయన అదే హామీని ప్రస్తావించారు. ముందుగా మద్యం బెల్టుషాపులను ఎత్తివేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడిపేందుకు యోచిస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి స్టార్ హోటళ్లలో తప్ప మరెక్కడా మద్యం విక్రయించకుండా చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ ప్రకటించారు. మద్యం బెల్టుషాపుల మూసివేతకు ఇప్పటికే ఎక్సైజ్‌శాఖ అధికారులు తీవ్రంగా కసరత్తును ప్రారంభించారు. మద్యం విక్రయం వల్ల వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాన్ని కొనసాగించే ప్రయత్నం అవివేకమని, బడుగువర్గాలకు అన్ని విధాలా కీడు కలిగిస్తున్న మద్యం మహమ్మారిని అంతం చేయాలని ప్రస్తుత ఏపీ ప్రభుత్వం భావించడం ప్రశంసనీయం. క్రమేపీ మద్యం మహమ్మారిని సమూలంగా పారద్రోలే ఆలోచనను ప్రభుత్వం నిక్కచ్చిగా అమలు జరపాలని ప్రయత్నించడం హర్షదాయకమే.

-దాసరి కృష్ణారెడ్డి