Others

ఆశించింది లభించాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుడు అన్నింటికీ అతీతుడు. సర్వసృష్టి కర్త భర్త ఆయనే. ఆయనే లయకారుడు. కానీ ఈ సృష్టిలో ఏ ప్రాణి కర్మసారం ఏఫలం అందివ్వాలో దానినే అందిస్తాడు. ఆ అందించడంలో మన తన అనేభేదాలు ఉండవు. ప్రాణులు పాపభీతి లేకుండా పనిచేస్తే అటువంటి ఫలితానే్న భగవంతుడు ఇస్తాడు.
చేసుకొన్నవాడికి చేసుకొన్నంత అన్నట్టు ఏ పని చేస్తే ఆ ఫలితం తప్పక అనుభవింపచేసేవాడు భగవంతుడు. ఆయన ఇవ్వాలనుకొంటే ఎవరు వద్దన్నా ఫలితం వచ్చి చేరుతుంది. భగవంతుడు ఇవ్వక్కరేదు అనుకొంటే ఆముదం పూసుకొన్నా అంటుకొనదు. ఎవరి అర్హతలను బట్టి వారికేది ప్రసాదించాలో ఎప్పుడు ప్రసాదించాలో బాగా తెలిసినవాడు.
ఆర్భాటం చేసే పూజలను స్వీకరిస్తాడు. మనసులో చేసే నిశ్శబ్ధంగా చేసే పూజలనుకూడా భగవంతుడు స్వీకరిస్తాడు. కానీ ఎవరు ఏమి ఇచ్చారని కాక వారికేమి ఇవ్వాలో దానినే మాత్రమే ఇచ్చే భగవంతుడిని నమ్మేవాళ్లు, నమ్మని వాళ్లు ఉంటారు. తనన్ను నమ్మడం లేదని వారికి శుభఫలితాలు ఇవ్వకుండా ఉండడు. తననే నమ్ముకున్నాడు కనుక పాపం చేసినా శిక్ష నుంచి తప్పించేస్తా అనీ అనడు. కర్మానుసారం ఫలితాలు ఇస్తాడు వావివరసులు చూడని వాడే పరమాత్మ.
ఈలోకంలో క్షణ భంగురమైన ఐశ్వర్యం కోసం ఆరాటం అనవసరమని ప్రబోధించువారు కూడా ప్రలోభాలకు లొంగిపోతుంటారు. భగవంతుడు భక్తవత్సలుడని కరుణాసముద్రుడని నిండు మనసుతో విశ్వసించే వారు కూడా అపుడప్పుడు అన్యా యపు పనులు చేసేస్తుంటారు. కొందరు అది అలా జరిగి పోయంది నేను కావాలని చేయలేదు సుమా అంటుంటారు.
ఎవరు చూడకపోయనా, చూసినా భగవంతుడు మాత్రం నిశితంగా సహస్రాక్షుడై చూస్తూనే ఉంటాడు. అందుకే ఓ భక్తుడు అంటాడు. నీవే లేని చోటు ఏది నీకు దాచిపెట్టి నేను చేయడానికి కనుక నీవే అన్నింటికీ కర్తవు.నేను కేవలం నీ చేతిలో ఒక పరికరాన్ని మాత్రమే. నీవు ఎలా ఆడిస్తే నేను అట్లా ఆడుతుంటాను.
నిజమే ఈ పద్ధతి చాలా మేలైనది. సర్వమూ భగవంతునికి అర్పించి నేను నిమిత్తమాత్రుడినని భావించి పరమాత్మను సేవిస్తే కర్మ అంటుకోదు. ఫలితమూ చుట్టుకోదు. అందుకే పెద్దలు ప్రతి పనీ ఈశ్వరార్పణం చేయ అంటారు. చేయంచేవాడు భగవంతుడే ఫలితం అనుభవించే వాడు భగ వంతుడే అంటే భగవంతుడు కానిది ఏదీ లేనపుడు నేను, నువ్వు, అది, ఇది అన్నవి ఎక్కడుంటాయ. అందుకని ఇలా భావించే భక్తులు ఇలా భావి స్తుంటారు. తాము చేసిందానికి అనుకూలంగానే ఫలితముంటుందని అనుకోవాలి తప్ప ప్రతికూల ఫలితాలను ఆశించవలసిన అవసరమే ఉండకూడదు. సత్కార్యాలకు మేలైన ఫలితాలు దుశ్చర్యలకు అందుకు తగిన విధంగా ఫలితాలుంటాయి తప్ప అందుకు భిన్నంగా ఉండబోవు. విత్తనాన్ని బట్టి చెట్టు ఉంటుంది తప్ప వేరుగా ఉండదు కదా!
ఏతావాతా తేలింది ఏమంటే మనం ఏం కోరుకుంటామో దాన్ని అమలు జరపాలి. మంచిని కోరుకుండే పుణ్యకార్యాలే చేయాలి. మనలను అందరూ గౌరవించాలి అనుకొంటే మనం అందరినీ గౌరవించాలి.

- చోడిశెట్టి శ్రీనివాసరావు