Others

ప్రేమానుబంధ చిహ్నమిది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రావణపూర్ణిమనే రాఖీపౌర్ణమి. ఈ రోజును జంధ్యాల పూర్ణిమగా కూడా పిలుస్తారు. గాయత్రీఉపాసకులకు పండుగ ఈ దినం. భారతదేశంలో జరుపుకునే పెద్దపండుగుల్లో శ్రావణ పూర్ణిమ ఒకటి.
పూర్వకాలంలో అనుకొన్న పనికి దీక్ష వహించి ఒకరికొకరు తోడుగా రక్షించుకుంటాము అని చెప్పుకుని దానికి గుర్తుగా ఎర్రటి సూత్రాన్ని మణికట్టుకు కట్టుకునేవారు. అదే క్రమపరిణామంలో రక్షాబంధనం అయింది. నేడు అక్కచెల్లెళ్లు, అన్నదమ్ముళ్లు ఒకరికిమరొకరు తోడుగా ఉంటామని బాసచేసుకొంటూ రక్షాబం ధనం కట్టుకుంటున్నారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి చిహ్నంగా నేటి రక్షాబంధన్ శ్రావణ పూర్ణిమ పండుగ సాక్షాత్కరిస్తుంది. అన్నాచెల్లెళ్ల వాత్సల్యానుబంధాల్ని మరింతపెంచేదే ఈ రక్షాబంధనం. అన్నదమ్ములమధ్య అక్కచెల్లెళ్ల మధ్య ప్రేమానురాగాలు పెంచే ఈ రక్షాబంధన్‌ను అందరూ జరుపుకోవడం సనాతనమే. రక్షకట్టించుకోవడం వల్ల సోదరునికి అపమృత్యుదోషాలు పూర్తిగా తొలగింపబడుతాయి. ఆయురారోగ్యాలు, ఐశ్వర్య సుఖ సిరిసంపదలు రెట్టింపు అవుతాయని పురాణాలు చెప్తున్నాయ.
ఓసారి దేవతలకు, రాక్షసులకు జరిగిన యుద్ధంలో ఇంద్రుడు శక్తికోల్పోవడం చూచిన అతని సతీమణి భగవంతుణ్ణి ప్రార్థించి ఓ తోరాన్ని తీసుకొని ఇంద్రుని కుడిచేతికి కట్టి ఇక విజయం మీకే లభిస్తుంది అని ప్రోత్సహించిందట. ఆ శచీదేవి ఆ రక్షనుకట్టిన రోజుకూడా ఈ శ్రావణ పూర్ణిమగా చెప్తారు. ఇక అప్పట్నుంచి విజయం చేకూరాలని అందరూ ఈ రక్ష కట్టించుకునేవారట. ఆ రక్షకట్టించుకోవడమే రాను రాను రక్షాబంధన్‌గా మారిందని పెద్దలంటారు
ఇతిహాసంలో కూడా దీన్ని ధ్రువపరిచే సంఘటన ఒకటి కనిపిస్తుంది. ఓసారిమనదేశాన్ని ఎలాగైనా కబళించాలనుకొన్న అలెగ్జాండర్ దండయాత్రకు వచ్చాడు. అతణ్ణి పౌరుషవంతుడు, గొప్పవాడు, ధార్మికుడైన పురుషోత్తముడు ఎదుర్కొన్నాడు. పురుషోత్తముని శక్తిసామర్థ్యాలు తెలుసుకొన్న అలెగ్జాండరు సతీమణి తనకు పతిభిక్ష పెట్టమని తన్ను చెల్లెలుగా భావించమని తన పసుప కుంకుమలను నిలుపమని రక్షాబంధన్‌ను పురుషోత్తమునికి పంపింది. దాన్ని చూచిన పురుషోత్తముడు అలెగ్జాండరు తన తోబుట్టువు భర్తగా భావించి సంహరించకుండా తిరిగి ఆయన దేశానికి ఆయన్ను పంపించివేశాడు.
ఈ రక్షాబంధన రోజు భిన్నత్వంలో ఏకత్వం కనిపించే భారతదేశం అఖండంగా ఆనందంగా కనిపిస్తుంది. ప్రతి స్ర్తి తన తోబుట్టువుకు రక్షకట్టి తన్ను రక్షించడానికి ముందుకు వచ్చి ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండమని కోరుకుంటుంది. సోదరునిగా భావించే ఏ పురుషునికైనా స్ర్తి ఈ రాఖీని కట్టి తనతనుంచి రక్షను కోరుకోవచ్చు. ఇలా కులమత రహితంగా జరుపుకునే ఈ రక్షాబంధన్ మానవుల్లో సహృదయతకు నాంది పలుకుతుంది. సౌభాతృత్వానికి, స్నేహానికి చిహ్నంగా నిలిచే ఈ రక్షాబంధన్ పండుగ అందరం జరుపుకుందాం. అఖండ భారతదేశ కీర్తిని ఇను మడింపచేద్దాం.

- చివుకుల రామమోహన్