Others

రాఖీ పున్నమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పురుషులకు ప్రత్యేక శక్తిని, మహిమను ఆపాదించే చందోనిబద్ధమైన ఉపాకర్మ, సంపూర్ణ గౌరవ కీర్తి ప్రతిష్ఠలు అందించే సభాదీప ఫలం, లక్ష్మీ హయగ్రీవ స్వామి జయంతి, శ్రీనివాసుడు అవతరించిన పర్వదినము, జంధ్యాల పూర్ణిమ, వైఖానస కుల గురువైన విఘనసాచార్యులవారు అవతరణ దినం, సోదర సోదరీ ప్రేమానురాగాలకి ప్రతీక అయిన రక్షాబంధన పండుగ వంటి అనేక ఉత్తమ పర్వాలను తనలో నిలుపుకొన్న శావణ పూర్ణిమకు గల ప్రాముఖ్యత, విశిష్టత ఇంతంతని చెప్పనలవి కాదు.
ఈ రక్షవలన సోదరునికి అపమృత్యుదోషాలు పూర్తిగా తొలగింపబడుతాయి. ఆయురారోగ్యాలు, ఐశ్వర్య సుఖ సిరిసంపదలు రెట్టింపు అవుతాయి. తన క్షేమాన్ని సదా వాంఛించే సోదరికి వాత్సల్య కృతజ్ఞతా చిహ్నంగా, తన సంతోషాన్ని వ్యక్తం చేసే చందాన, సోదరుడు తన శక్త్యానుసారం బహుమతులునందిస్తాడు. ఈ ఉత్సాహభరిత సంబరమే రక్షాబంధనం. ఈ రక్షాబంధనం బంగారు, వెండి, పట్టుదారాలతో నిర్దేశకమైన ముడులు వేసి ఉండాలి. ఈ తోరాన్ని పూర్ణకుంభంలో ఉంచి, పూజించి, ఆపై సోదరునికి రక్షాబంధనమ్ కట్టాలి. ఈ రక్షాబంధనం అత్యున్నత ఫలితాలను అందిస్తుంది.
ఒకసారి రాక్షసరాజైన బలిచక్రవర్తి రాజ్యానికి కావలి గాయడానికని వెళ్లిన విష్ణువు పాతాళంలోనే ఉండిపోయాడు. అపుడు మహావిష్ణువు లేని వైకుంఠంలో మహాలక్ష్మి ఉండలేకపోయంది. ఆమె ఎంతో ఆలోచించి బలిచక్రవర్తి దగ్గరకు వెళ్లి తనను సోదరిగా భావించమని కోరి బలికి రక్షరేకును కట్టిందట.దానికి మహదానంద పడిన బలి మహాలక్ష్మీదేవిని సంతోషింప చేయడానికని ఆ బలి చక్రవర్తి విష్ణువును లక్ష్మీదేవితో వైకుంఠానికి పంపాడు.
ఒకసారి వృతాసురునితో సంగ్రామం జరిపేటపుడు ఇంద్రుడు అలసిపోవడం చూసి ఇంద్రుని భార్య అయన శచీదేవి తన భర్తకు విజయం లభించాలన్న కోరికతో రక్షను కట్టిందట. దానివలనే వృతాసుర సంహారంచేసి ఇంద్రుడు విజయం సాధించాడని పురాణాలు చెప్తున్నాయ. ఇలా రక్ష కట్టడం అనేది అనాదిగా వస్తున్న ఆచారమే. సంజ్ఞాదేవి సంతానమైన యమున తన సోదరుడైన యమునికి ఒకసారి రక్షాబంధనం చేసింది. దానికి సంతోషించిన యముడు తన సోదరికి అమృతత్వాన్ని ప్రసాదించాడు. తన లాగే ఇతరులు కూడా వరాన్ని పొందే వీలును కలుగజేయుమని యమున తన సోదరుడిని ప్రార్థించగా ఆ యమధర్మరాజు శ్రావణ పూర్ణిమ నాడు ఎవరైతే సోదరి చేత రక్షాబంధనం చేయంచుకొంటారో వారికి అపమృత్యుదోషం ఉండదని వరం ఇచ్చాడట. అందువల్లే శ్రావణ పూర్ణిమ నాటి రక్షాబంధనం అత్యంత ప్రశస్తిపొందింది.ఒకసారి రాజస్తాన్‌లోని చిత్తూరు రాణి కర్ణావతి కోటను గుజరాతీ నవాబు అయిన బహదూర్‌షా ముట్టడిస్తాడు. ఆకస్మికంగా ఆమె కోటను ముట్టడించుటవలన ఆమెకు వేరే గత్యంతరం లేక ఆనాటి ఢిల్లీ చక్రవర్తి అయిన హుమయూషాకి రక్షాబంధనం పంపి, దీన్ని స్వీకరించి, తన్ని ఒక సోదరిగా భావించి, నన్ను, నా కోటను ఈ ముట్టడినుంచి రక్షించమని కోరుతుంది. కర్ణావతి కోరికను మన్నించి హుమయూన్ సైన్యంతో ఢిల్లీ నుండి వచ్చి తన శక్తియుక్తులను ఉపయోగించి బహదూర్‌షాని ఓడించి, తరిమికొడతాడు.ఈ విధంగా ఆమెను ఆమె కోటను రక్షించి ఆమెకి కోటను అప్పగిస్తాడు. ఆనాటినుండి ఢిల్లీ చక్రవర్తిని తన సోదరుడుగా భావిస్తూ గౌరవ సూచకంగా ఒక సోదరిగా ప్రతి సంవత్సరం రాఖీ పూర్ణిమ రోజున రాఖీ పంపేది.
అర్చకులు, ఆచార్యులు, రుత్విక్కులు, పరిచారికులు, యజమానులు చేసే దీక్షలకు అధికారం పొందడానికి రక్షాబంధనం చేసుకొంటుంటారు. ఈ రక్షా బంధనం అనేది సర్వమానవ సౌభాతృత్వం, సామరస్యం వ్యాప్తిచెందడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. ఈ రక్షాబంధనం ద్వారా ఒకరికొకరు తోడునీడగా ఉంటామని బాసచేసుకొన్నట్టు అవుతుంది.
సకల విద్యాదేవత అయన హయగ్రీవుని జయంతి ఈ రోజునే కనుక పూర్ణిమ నాడు వేదాధ్యయనం కూడా ప్రారంభిస్తారు. హయగ్రీవుని అనుగ్రహం కోసం హయగ్రీవ స్తోత్రాన్నీ పఠిస్తారు. ద్విజులందరూ గాయ్రతీ దేవిని ఉపాసిస్తూ తమతమ యజ్ఞోపవీతాలను మార్చుకుంటారు. కేరళదేశీయులు ఈ పున్నమినే నారికేళ పున్నమి అని ఉప్పొంగే సముద్రుని తమను చల్లగా కాపాడుమని సముద్రునికి పూజలు జరుపుతారు. వారికి ఇబ్బడిముబ్బడిగా పండే నారికేళాలను సముద్రునికి సమర్పించి పూజలు చేస్తారు. ఒరిస్సా ప్రాంతం వారు ఆవులకు ఎద్దులకు అలంకరణలు చేసి ఈ పూర్ణిమనాడు వాటిని పూజిస్తారు. కొన్ని ప్రదేశాలలలోని వారు కజరీ పూర్ణిమగా కూడా చేస్తుంటారు.
శ్రావణ పూర్ణిమనే ‘జంధ్యాల పూర్ణిమ’ కూడా. ‘‘యజ్ఞోపవీతము’’ అనే పదము ‘యజ్ఞము’ ‘ఉపవీతం’అనే రెండు పదాలను కలుపగా వచ్చిన పదం. యజ్ఞము అంటే ‘యాగము’ ‘ఉపనీతము’ అంటే ‘దారము’అనే అర్థాలు ఉన్నాయి. యాగకర్మ చేత పునీతమైన దారము అని అర్ధము. ఎడమ భుజముమీదుగా కుడి పార్శ్వమున వ్రేలాడు జందెము అని కూడా అర్ధముంది.ఈరోజు ఉపనయనమైన వారందరూ పాత యజ్ఞోపవీతాన్ని తీసేసి కొత్త వాటిని ధరిస్తారు. బ్రాహ్మణులకు ‘‘ద్విజులు’’అని పేరు, అంటే రెండు జన్మలు కలవారని అర్థము. ఉపనయనానికి ముందు ఒక జన్మ, ఉపనయనమయ్యాక మరో జన్మ. జంధ్యానే్న ‘‘యజ్ఞోపవీతం’’అని అంటారు.
ముందుగా కొత్త జంధ్యాన్ని వేసుకుని ఆ తర్వాత పాత జంధ్యాన్ని తీసేయాలి. జంధ్యం 96 బెత్తలుండాలి. మూడు పోగులుండాలి. నాభివరకే ఉండాలి. నాభికి క్రింద ఉంటే తపస్సు, కీర్తి క్షీణిస్తే నాభికి పైన ఉంటే ఆయుష్షు నశిస్తుంది. ఆవగింజంత లావు మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ లావు ఉంటే కీర్తి నశిస్తుంది. మరీ పల్చగా ఉంటే ధన హాని కలుగుతుంది. ఉపనయనాన్ని ఎనిమిది సంవత్సరాల వయస్సు దాటిన బాలురకు పనె్నండు సంవత్సరాల వయస్సులోపు బాలురకు ఉపనయనం చేయాలనేది నియమం.
దేశభక్తిని, దైవభక్తిని పెంచే శ్రావణ పూర్ణిమ స్నేహసౌరభాలను వెదజల్లడానికి, భాతృప్రేమ పెరగడానికి చిహ్నంగా మారింది. కనుక భారతీయులందరూ ఈ రాఖీపున్నమిని ఆనందోత్సావాలతో జరుపుకోవాలని కోరుకుంటూ

- లక్ష్మీ ప్రియాంక