Others

నాకు నచ్చిన పాట ( సంగమం.. అనురాగ సంగమం..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శోభన్‌బాబు, లక్ష్మి, చంద్రకళ ముఖ్య పాత్రధారులుగా నటించిన కోడెనాగు చిత్రంలోని ‘సంగమం- అనురాగసంగమం/ ఆనంద సంగమం/ భావరాగ తాళ మధుర సంగమం’ అన్న పాటంటే చాలా ఇష్టం. ఈ పాట రేడియోలోగానీ, టెలివిజన్‌లోగానీ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఆత్రేయగారి సాహిత్యానికి పెండ్యాల మధుర బాణీ కలగలిపి పాటను చిరంజీవి చేసింది. ఘంటసాల, పి సుశీల మృదుమధురంగా ఆలపించారు. ప్రేమకి మరణంలేదని, ప్రేమికులను విడదీసే శక్తి ఎక్కడా లేదని చిత్రంలో అద్భుతంగా చెప్పారు. కులమతాలకు, జాతి బేధాలకు విరుద్ధంగా ప్రేమజంట ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఈ చిత్రంలో అద్భుతంగా చిత్రీకరించారు. నాగరాజు, జూలీల ప్రేమకథలో అనేక భావోద్వేగాలు ఉంటాయి. తనని అవమానించిన యువతిపై తన ప్రేమను చాటి చెప్పడానికి, చేసిన తప్పుకు శిక్షగా తనను తాను శిక్షించుకుంటాడు ప్రేమికుడు. పదిమందికి ఆదర్శంగా ఉండటానికి తన మనస్సులోని భావాలను పాటరూపంలో పరవశించి పాడుతాడు. అన్నిటినీ అందరినీ వదలి తమ ప్రేమకోసం వారువురూ ప్రాణాలు అర్పించి చిరంజీవులవుతారు. మరణం లేని అమరులువారు. ఆ ఐక్యమే యుగయుగాలుగా వారి ప్రేమను ఈ భూమిపై నిలుపుతుంది. ఈ పాటలో ప్రతీ అక్షరం ఆత్రేయ పొందికగా తన కలం నుండి జాలువార్చారు. సుందర దృశ్యాల మధ్య రసవత్తరంగా చిత్రీకరించారు. ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.

-చోడవరపు విజయ్‌కుమార్, హైదరాబాద్