Others

సృ స్థి ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాశపు కొసల్ని పట్టుకు వ్రేలాడుతున్న
దిగంతాలకు
ఓరగట్టుగా నా బాహువులెత్తినప్పుడు
కిరణ వ్యాకరణమై నా గుండెలమీద
పరుగెడుతున్న ప్రొద్దుటెండ వ్యాసం
ఒళ్ళంతా వ్యాపించింది...
ఈ పరిణహ పరిణామమంతా
మబ్బు విడుదల చేసిననదినై ప్రవహించటానికే;

నది
కేవలం నీటి వాలు ఉరుకు కాదు
కార్యోద్పిష్టమైన కర్తవ్య పరాకాష్ఠ
కడలి కడుపునిండే కఠోర దీక్ష
మధ్యకాలమంతా మానవతా సంబంధంగా
పిలుస్తున్న పొలాల్లోకి
పసిడి మువ్వపుటలన్ని మ్రోగిస్తూ
పసిపాపలా పరుగెత్తే పంట కాల్వ
గట్లమీద జ్ఞాపకాన్ని రేపుతుంది
వయఃప్రవాహాన్ని మలుపు కొలతల్లో చేరుస్తుంది
ఇంకా ఉంది

- సాంధ్య శ్రీ 8106897404