Others

సంతృప్తితోనే అదుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి కోరికల పుట్ట. అసలేమీ కోరికలు లేవు అనుకొంటూనే ఒక కోరిక తీరిన తర్వాత మరోకోరిక పుట్టించుకుంటూ ఉంటాడు. కనుకనే కోరికలకు అంతు లేదు అంటారు. కాని కోరికలు పుడితే ఫర్వాలేదు కానీ వాటిని సాధించుకొని తీరాలి అనే వ్యసనం పట్టుకున్నట్లయతే మనిషిలో స్వార్థం పెరుగుతుంది.
కోరికలు తీర్చుకోవడానికి పక్కదారులు అనుకోకుండానే తొక్కేస్తుంటాడు. ఆ కోరికలు తీరిన తర్వాత సంతోషం కాదు కానీ దుఃఖం మాత్రం తప్పక వస్తుంది. అందుకే అవసరానికి మించిన కోరికలు, పట్టపగ్గాలు లేని కోరికలు మనిషిని అధఃపాతాళానికి తొక్కేస్తాయ.
కోరికలకు కళ్ళెం వేయగలిగే శక్తి అంటే నిగ్రహం అన్నమాట. నిగ్రహం లేని వ్యక్తి జీవితం తెగిన గాలిపటంలా అస్తవ్యస్తంగా ఉంటుంది. కోరికలను నిగ్రహించుకోవటానికి తమకు ఉన్నదానితోనే తృప్తిపడటం అలవాటు చేసుకోవాలి. దీనికి ఇంద్రియాలన్నీ తమ అదుపులో ఉండాలి. అట్లా ఉన్నపుడే కోరికలను అదుపులో ఉంచుకోవటానికి సాధ్యమవుతుంది. మనిషి ఉన్నదానితో తృప్తి పడాలి. తృప్తి పడకపోతే కోరికలు విజృంభిస్తాయ. ఉన్నదానితో తృప్తిపడడమే కోరికలను అదుపులో ఉంచగలిగిన చక్కని సాధనం.
నీళ్ళలో ఉండే చేప చిన్న మాంసపు ముక్కకు ఆశపడి గాలంలో చిక్కి మరణిస్తుంది. అలాగే ఆశ పుట్టిన మనుజుడు నాశనం కాక తప్పదని ఓ శతకకారుడు వివరించాడు. కోరికలకు మూలం ఆశ. చిన్న ఆశ దానితోపాటు తృప్తి ఉండితీరాలి. లేకపోతే చేపపిల్ల గాలానికి చిక్కినట్లు మనిషి కోరిక అనే గాలానికి చిక్కి నూరేళ్ల వయసును సర్వనాశనం చేసుకొంటాడు.
కొందరు కోరికలను తీర్చుకోవడానికి డబ్బు లేదా హోదా ఉంటే చాలు అనుకొంటారు. కానీ ఆ హోదాతోనో, లేక డబ్బు ఉందనో కోరికలు అన్యాయ మార్గంలో తీర్చుకుందామనుకొంటే చిత్ర గుప్తుడు చిత్రమైన కళ్లతో చూస్తూనే ఉంటాడు. వెంటనే తగిన శిక్ష వేస్తాడు. మంచి పేరుతో, మంచి నడవడితో ఉండేవాళ్లు క్షణికానందాన్నిచ్చే కోరికల కోసం పెడదోవ పడుతారు. నవ్వుల పాలు అవుతారు. ఎక్కువ డబ్బు ఉండాలనో, లేక హోదా కావాలనో, లేక అందరికన్నా గొప్పగా ఉండాలనో ఇలాంటి కోరికలు మొదలు చిన్నవిగా కనిపిస్తాయ. రాను రాను శ్రుతి మించి రాగాన పడుతాయ. మనిషిని ఆకోరిక నెపంతో కిందకు దిగజారుస్తాయ.
త్రేతాయుగంగలోని రామాయణాన్ని చూసినపుడు రావణుడు సీతమ్మ వారిని పొందాలనే కోరిక వల్లనే తన వంశంతో సహా సర్వనాశనం అయపోయాడు. మహాభారతం లో పాండవులను గెలవాలన్న ఆశతో దుర్యోధనుడు దుష్టచతుష్టయాన్ని తన చుట్టూరా పెట్టుకున్నాడు. తన ఆశ, కోరికా మంచిది కాదని తెలిసినా ధర్మమార్గంలో వెళ్లేవాళ్లను అనేక కష్టాలు పెట్టి మరీ తాను విజయం సాధించడానికి అధర్మాన్ని ఆశ్రయంచాడు. కాని చివరకు బంధు మిత్రులతో సహా సర్వ నాశనానికి కారణ మయ్యాడు. కనుక కోరికలనేవాటిని దూరంగా తోసేయాలి.

-పి లక్ష్మీసుజాత, అద్దంకి