Others

ధైర్యంతో దూరం నిరాశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి ఆశానిరాశల మధ్య జీవిస్తూ ఉంటాడు. ప్రతి మనిషి ఆశాజీవే. గొప్ప సంపన్నుడైనా, బీదరికంలో బతుకుతున్నా సరే ఏదో ఒక ఆశ మనిషికి ఉంటుంది. ఆశను సాధించాలన్న లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నాలు సాగిస్తారు.
కాని ఒక్కోసారి అనుకొన్నవి అన్నీ జరగవు. అపుడే నిరాశ బయలుదేరుతుంది. నిరాశ ఆవరించినపుడు మనిషి చాలా ధైర్యంగా ఉండాలి. ధైర్యంతోనే నిరాశను ఎదుర్కోవచ్చు. శ్రీరాముడు ధర్మపత్నికి కూడా ఓసారి నిరాశ ఆవరించింది. ఈ నిరాశ ఎవరినైనా ఆవరిస్తుంది. ధైర్యస్థులకు కూడా ఒకసారి నిరాశ అనుభవంలోకి వస్తుంటుంది. కాని వారి మనోధైర్యంతో దానిని ఎదుర్కొని అనుకొన్న లక్ష్యాన్ని చేరుతారు.
సీతమ్మవారికి అశోకవనంలో రావణుని చెరలో ఉన్నపుడు రాముడు ఎంతకీ తన జాడ తెలుసుకొని రావడంలేదు అనిపించింది. పైగా రావణుడు రోజు హింసించడం అతడి గొప్పతనాలను వినాల్సిరావడం ఇవన్నీ సహించలేక ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్య చేసుకొందాం అనుకొంటుంది. తాను కూర్చున్న చెట్టుకే తన జడతోనే ఉరివేసుకొందాం అని కూడా అనుకొంటుంది. కాని అపుడు ఆంజనేయస్వామి వచ్చి ఆమెకు స్వస్థత కలిగించుతాడు. ఆమె ఆ యత్నం నుంచి తప్పుకుని తిరిగి బతికుంటే బలుసాకైనా దొరుకుతుంది. కాలచక్రం తిరుగుతూ ఉన్నపుడు కష్టాలు పోయి సుఖాలు తప్పక వస్తాయి అనే ఆశను తనలో మళ్లీ చిగురింప చేసుకొంటుంది.
సీతమ్మవారికే ఓదార్పు సందేశాన్ని ఇచ్చిన ఆంజనేయునికి ఓసారి దుఃఖం కలిగింది. నిరాశ కమ్ముకుంది. రావణుని లంకలో ప్రవేశించాడు. అన్నీ భవనాలు,తోటలు ఏదీ వదలకుండా చూసేశాడు. కానీ సీతమ్మ వారి జాడ మాత్రం తెలియలేదు. రామునికి ఏమి జవాబు చెప్పాలా సీతమ్మ వారి జాడ తెలియలేదు అని చెపితే రాముడు దుఃఖం పొందుతాడు. రామునితో ఉన్న లక్ష్మణుడూ విచారం వ్యక్తం చేస్తాడు. వీరిద్దరి వల్లా అయోధ్య అంతా దుఃఖం పొందుతుంది. ఇదంతా నావల్లనే కదా. మరి నేను అసలు రాముని దగ్గరకే పోకుండా ప్రాణాలను వదిలేస్తే నేను ఇంకా వస్తానని అనుకొంటూ కాలం గడుపుతారు వాళ్లు అనీ కూడా హనుమంతుడు నిరాశలో అనుకొంటాడు.
కానీ ఆత్మస్థైర్యం ఉన్న హనుమంతుడు కనుక వెనువెంటనే తనలో ప్రవేశించిన నిరాశను దూరం చేసుకొన్నాడు. భగవంతుడు ఉన్నాడు. ఇంతమంది ఉండగా రాముడు నాకే తన అంగుళీయకాన్ని ఇచ్చిసీతమ్మను వెదుకు అన్నాడంటే సీతమ్మ తప్పక దర్శనమిస్తుంది. నేను ఇంతకుముందు సరిగా చూసి ఉండను. అయినా రామయ్య లేకుండా సీతమ్మ హంసతూలికలపైన పట్టుపరుపుల పైనా పడుకుంటుందా? అని తనలో తాను విత్కరించుకుని తిరిగి సీతమ్మ అనే్వషణ ఆరంభించాడు. చివరకు అశోకవనంలో సీతమ్మ వారిని చూశాడు. ఆమెకు స్వస్థత కలిగించే మాటలు చెప్పాడు. రావణుని దగ్గరకు వెళ్లి రాక్షసుడైన రావణునికి ఉపదేశం చేశాడు. రాక్షసులందరికీ సీతమ్మను విడిచిపెట్టకపోతే ముప్పు తప్పదు అన్న సంకేతాన్ని ఇచ్చాడు. రాముడు అండ ఎంత భద్రమో రాముని ఆగ్రహం అంత భయంకరంగా ఉంటుందని వారికి చవిచూపించాడు. ఆ తరువాత మళ్లీ సీతమ్మను చూసుకొని ఆమె ఆశీర్వాదం తీసుకొని రాముని దర్శించి సీతమ్మ వివరం తెలిపాడు.వారిని ఆనందదాయకులను చేశాడు. అందుకే నిరాశ ఎపుడూ పడకూడదు. ఏ కార్యమన్నా జరగకపోయినా నిరాశ పడకుండా భగవంతుడు మార్గం చూపిస్తాడు అన్నవిశ్వాసంతో బ్రతుకుతూ చేతనైనంతపనులు చేస్తూ ఉంటే తప్పక భగవంతుని కృప వల్ల మనం కృతార్థులం

- చివుకుల రామమోహన్