Others

వాన...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భ్రమర డోలాకేళి పరిమళాక్షరరమ్య
గా నొప్పెగా! ఆదికవి కలాన;
బృందావనైక గోవిందాబ్దమై - పోత
న కలాన హలమరందంబు చిలికె;
సామాన్యు కడగండ్ల సద్భావ ‘నాముక్త
మాల్యదై’ - రాయలై - మసలెగాదె!
రస ‘సుగాత్రి’గ మహా ‘లయవిభాతి’గ - ‘కళా
పూర్ణోదయా’న సొంపులు వెలార్చె;
‘తరళ’, ‘విద్యున్మాల’ ‘్ధరాప్రసిద్ధ’ ప్ర
బం‘్ధభ్యుదయ’ ‘రామభద్రమ’య్యె;
‘వరలక్ష్మి’యై - తెల్గువారి వాకిట - ‘ఇంద్ర
గంటి’వారి కలాన కదలె గాదె!
ధరణీవియత్ విచిత్ర ప్రేమకున్ భాష్య
మై - ‘సి.నా.రె’ కైత నలదె గాదె!
చినుకులై - చురకల చెణుకులై - ‘కుందుర్తి’
కలములో ‘నగరమై’ గ్రాలె గాదె!
అద్భుత చిత్రమై - ఆనంద పాత్రమై
చలనచిత్రాల రాజిలెగదోయ!
తెలుగు వనముల మెరుపుల జలదమగుచు
సాహితీ ‘విశ్వనాథ’మై సాగె గాదె!
జనసమస్యా పరిషాకర శరదముగద!
వాన - అక్షరంబుల తేనె సోనగాదె!!

- డా. రామడుగు వేంకటేశ్వర శర్మ 9866944287