Others

నాకు నచ్చిన చిత్రం..మానవుడు - దానవుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమాను ఓ కొత్త ఒరవడిలోకి నడిపించిన చాలా సినిమాల్లో -మానవుడు దానవుడు కూడా ఒకటి. ఒక మనిషి రెండు జీవితాలను అనుభవిస్తూ పగలు ప్రాణం పోసే వైద్యుడిగా (వేణు), చీకటిన ప్రాణం తీసే కిరాతకుడిగా (జగన్) శోభన్‌బాబు పోషించిన పాత్రలు అద్భుతం అనే చెప్పాలి. ఈ చిత్రం చూసినప్పుడే మైండ్‌లో రిజిస్టరైపోయింది. నాలుగు దశాబ్దాల పైచిలుకు కాలం గడిచినా, మర్చిపోలేనంత ముద్రవేసింది. అదే -మానవుడు దానవుడు. చంద్రశేఖరరెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రంలో శోభన్‌బాబు, శారద ముఖ్యపాత్రలు. సత్యనారాయణ విలన్‌గా, రాజబాబు కథానాయకుడి వయస్కుడి పాత్రలో రాణించారు. మోదుకూరి జాన్సన్ మాటలు, సినారే పాటలు అందించారు. ఇది ‘జకిల్ ఎండ్ మిస్టర్ హైడ్’ ఆంగ్ల నవలకు అనువాదంగా చెప్పుకున్నా, భారతీయుల జీవన శైలికి, ఆంధ్రుల సాంస్కృతిక వైభవానికి అద్దంపట్టేలా దర్శకుడు ప్రతిభావంతంగా తీర్చిదిద్దాడు. మానవుడు దానవుడుగా మారటానికి సమాజం కారణమైనా, ఆ సమాజంలోనే దానవత్వాన్ని మానవత్వంతో జయించి మనిషిలో మరుగుపడిన దైవత్వాన్ని నిద్రలేపగల మహనీయులు ఉన్నారన్న విశ్వ సందేశం ప్రేక్షకులకు ఈ చిత్రం అందించింది. అప్పట్లోనే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఓ సెనే్సషన్ అయతే, సంగీత దర్శకుడు అశ్వత్థామ కట్టిన బాణీలు ఇప్పటికి శ్రోతలను వెంటాడుతూనే ఉంటాయ. పచ్చని మన కాపురం/ పాల వెలుగై... అన్న పాట సుశీల గొంతు నుంచి వింటుంటే -సన్నివేశం అలా కళ్లముందు కనిపిస్తున్నట్టే అనిపిస్తుంది. సి నారాయణ రెడ్డి రచించిన అణువు అణువున వెలసిన దేవ.. పాట అర్థవంతంగా సాగుతుంది. చిత్రంలో శోభన్‌బాబు సోదరిగా కృష్ణకుమారి అద్భుత నటన ప్రదర్శించింది. మంచి చెడులు రాశులూ పోసినట్టు వేరువేరుగా వుండవని, అవి మనలోనే దాగివున్నాయని, సాధనతో సంస్కారాన్ని పెంచుకోవాలని, మంచితనంలో మించాలని, దానవుడు- మానవుడు చిత్రం ప్రేక్షకులకు ప్రబోధించింది.

-విఆర్ రావు, హైదరాబాద్