Others

పంచప్రాణాలే పంచబేరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలియుగం దైవం వేంకటేశ్వరుడు. ఈ వేంకటనాథుని దర్శించని వారు ఎవరూ ఉండరు. గోవిందా అని ఆర్తితో పిలిస్తే చాలు పరుగెత్తుకుని వచ్చి ఆపదలను తీర్చి ఆపద్బాంధవుడుగా పేరిన్నకగన్నవాడు వేంకటేశ్వరుడు. స్వామి కలియుగంలో మానవులందరితో చక్కగా మాట్లాడేవాడని అంటారు. కాని కలిప్రభావం ఎక్కువౌతున్న తరుణంలో పరమాత్మ అయిన పరంధాముడు విగ్రహరూపి యై స్వరాన్ని రక్షిస్తూ నిల్చున్నాడు.
తిరుమలను సందర్శించని వారికి కష్టాలు కడగండ్లు తీరిపోతాయి. సంవత్సరానికి ఒక్కసారైనా స్వామిని దర్శించుకోవాలని తమ ఇలవేల్పు తమను రక్షించాలని కోరుకుంటూ దేశంలోని మారుమూల ప్రాంతాల నుంచే కాదు ప్రపంచంలోని అన్ని దేశాలవారు తండోపతండాలుగా ప్రతిరోజు తరలివస్తునే ఉంటారు. అట్లా వచ్చినవారు పూర్వంలో స్వామిని ఏవిధంగా కొలుచుకునేవారో, సేవించారో, ఎలా దర్శించుకున్నారో ఇలాంటి సంగతులన్నీ నెమరేసుకొని అత్యంత ఆనందంతో తిరుమల కొండపైన స్వామి తలుచుకుంటూ యాత్రీకులు, భక్తులు తన్మయం చెందుతారు. స్వామితో తాద్యాత్మం చెందుతారు. అట్లాంటి ఆ స్వామి అనేక మహిమలను చూపే ఆ స్వామి నిత్యం ఎన్నో కల్యాణాలను, మరెన్నో సేవలను అందుకుంటూ నిత్యానందంతో తన్ను దర్శించడానికి వచ్చిన భక్తులను కాపాడుతూ ఉంటాడు. ఆ స్వామికి తిరుమల ఆలయంలో పంచబేరాలున్నాయి. ఆ పంచబేర ప్రాశస్త్యాన్ని తెలుసుకొందాం.
ప్రాచీనకాలంలో స్వయవ్యక్త స్వామికే అంటే దివ్య అర్చామూర్తియై ఉన్న స్వామివారికే పూజలు చేసేవారు. రానురాను కాలంలో మార్పులకు అనుగుణంలో స్వామి వారిచెంత వెండితో స్వామి వారి రూపును చేయించారు. ఈ స్వామికే శ్రీ భోగ శ్రీనివాసమూర్తి అన్నారు. ఈ మూర్తినే కౌతుక బేరంగా పిలుస్తారు. బేరము అంటే విగ్రహరూపి అయిన భగవంతుడే. ఈ కౌతుకబేరం క్రీ.శ.614లోసంవత్సరంలో చేశారని పురాణాలు చెబుతాయి. ఆ తరువాత క్రీ.శ.1339లో స్వామివారు ఉత్సవ బేరంగా మలయప్పస్వామిని ప్రతిష్ఠించారు. ఈ మలయప్ప స్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా భక్తులకు దర్శనం ఇస్తారు. సత్యమలయప్పస్వామిగా భక్తులు పిలుస్తుంటారు. స్నపన బేరం గా ఉగ్రశ్రీనివాస మూర్తిగా ఆరాధనలు జరుగుతాయి. ఇక ఐదవ మూర్తి అంటే బలిబేరం శ్రీకొలుపు శ్రీనివాసమూర్తికి ఆరాధనలు జరుగుతాయి. 1. ధ్రువబేరం విష్ణువు మూల విరాట్ 2. కౌతుక బేరం పురుష భోగ శ్రీనివాసమూర్తి, 3. ఉత్సవబేరం సత్య మలయప్పస్వామి, 4. స్నపన బేరం అచ్యుత , ఉగ్రశ్రీనివాసమూర్తి 5.బలిబేరం అనిరుద్ధ కొలువు శ్రీనివాసమూర్తి ఈ పంచమూర్తులు విష్ణువు యొక్క మహారూపాలైన విష్ణువు, మహావిష్ణు, సదావిష్ణు వ్యాపి నారాయణులకు సంకేతంగా పండితులు భావిస్తారు. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చాస్వరూపాలుగా కూడా చెబుతారు.
ధ్రువం తే గ్రామ రక్షార్థ మర్చనార్థం తు కౌతుకమ్
స్నానార్థం స్నాపనం ప్రక్తముత్సవార్థమథౌత్సవమ్
బల్యర్థం బలిబేరం చ పంచబేరాన్ ప్రకల్పయేత్
అని విష్ణ్వర్చనా నవనీతం అనే వైఖానస సంహిత తెలియజేస్తుంది. మనిషి పంచప్రాణాలు ఎలా ఉంటాయో అదేవిధంగా స్వామి దగ్గర పంచబేరాలు ఉన్నాయని అంటారు.

- చివుకుల రామ మోహన్