Others

పశ్చాత్తాపం.. పరమాత్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణకథలు వింటున్న కొలదీ వినాలనే అనిపిస్తుంది. ఓసారి చిన్ని కృష్ణుడు తన స్నేహితులతో కలసి వెన్నదొంగతనానికి వెళ్లాడు. ఓ ఇంట్లో దేవుని చిత్ర పటాలు కనిపించాయి. వాటి నిండా గంధం బొట్లు, కుంకుమబొట్లు పెట్టి ఉన్నాయి. ఎంతో ఆడంబరంగా పూజాగదిని వారు అలంకరించుకొని ఉన్నారు. ఆహా ఈ ఇంటి వారికెంత భక్తో కదా కృష్ణా అన్నారంతా. అవునౌను అని అందరూ అన్నారు. కానీ మనుష్యుల మనసులను తెలిసిన కృష్ణయ్య అవుననాలి కదా.
కొందరు అతిగా మడులని, దడులని చెబుతూ అత్యంతాచారాన్ని పాటిస్తుంటారు. కానీ వారిలో ఇసుమంతైనా భక్త్భివం ఉండదు. మంచితనం మచ్చుకైనా కానరాదు. అటువంటి వారిలో ఉండేది ఆడంబరమే. భగవంతుడు మెచ్చేది అహంకారం లేని మచ్చలేని మనసునే కదా.
అందుకే వారికి బుద్ధి చెప్పాలనుకొన్నాడు భగవంతుడైన కృష్ణుడు.
అంతకుముందు రోజు కృష్ణుడు ఆయన స్నేహితులు వచ్చి వెన్న తింటున్నారని ఆ ఇంటివారు ఎత్తుగా ఉట్లు కట్టి మరీ వెన్న, పెరుగు దాచుకున్నారు.
రోళ్లు, తిరుగళ్లలాంటివి వేసుకొని పిల్లలంతా ఒకరిపై ఒకరు ఎక్కి మరీ ఆ ఉట్లు దించి అందులో దాచుకొన్న వెన్న పెరుగు అంతా తినేశారు. ఆ ఆ ఇంటి నుంచి పోబోతుంటే ఆ ఇంటి ఇల్లాలు వీరిని చూశేసింది. పట్టుకోండి పట్టుకోండి మన వెన్న అంతా తినేస్తున్నారు ఈ దుండగులు అంటూ అందరినీ నిద్రనుంచి లేపేసింది. పైగా కర్ర నొక దాన్ని తీసుకొని పిల్లలపైకి వెళ్లింది.
వెంటనే కృష్ణుడి దొరికినట్లుగా దగ్గరగా వచ్చి ‘ఓ పడతీ! వీళ్లంతా ఎవరు? నీకు నా కన్నా వేల్పులు ఇంకెవరు దొరుకుతారు?’ అంటూ ఆ దేవుని గదిలో దూరి ఆ దేవుని పటాలకంతా తాను తింటున్న వెన్ననంతా పులిమాడు.
ఆ ఇల్లాలు మ్రాన్పడి చూస్తోంది. ఏమిటీ విచిత్రం. నాకన్నా దేవుళ్ళు ఎవరున్నారు అంటున్నాడీ యశోదా తనయుడు. తాను దేవుడా! అంటూ ఒక్క క్షణం ఆలోచించింది. నిజమే పిల్లలకన్నా దేవుళ్లు ఎవరుంటారు. ఆ పిల్లలందరినీ పిలిచి నేనే వెన్న మీగడలను పెట్టి ఉంటే వారంతా ఎంత సంతోషించేవారు. వారుసంతోషిస్తే దేవుడు సంతోషించినట్టే కదా అని అనుకొందా ఇల్లాలు. పశ్చాత్తాపంతో పిల్లలూ దేవుళ్లు అంటూ పాడుకుంటూ ఓ నందనందనా యశోదా తనయా రా రా కన్నయ్యా! అంటూ వారినంతా పిలిచింది. వారంతాశ్చర్యానందాలతో మరిలారు. కృష్ణయ్య చిన్నగా నవ్వుకుంటున్నాడు.

- ఆర్. సుశీల