Others

నేర్చుకోవలసిన ధర్మాచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్త సంరక్షణార్థం, లోక కళ్యాణార్థం ఎనె్నన్నో మహిమలు చూపే మహావిష్ణువు కోసం ఒకానొక కాలంలో పృశ్నిసుతపుడు అనే దంపతులు ఇరువురు తపస్సు చేసారు. విష్ణువు వారికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. వాళ్లు ‘నీవే మాకు పుత్రుడివై జన్మించు’ అని అర్థించారు. మాకు లభించిన ఏ జన్మలో నైనా నీవే మాకు పుత్రుడివై పుట్టుతూ మా పుణ్యపాపనాశనం తర్వాత నీ సాయుజ్యాన్ని మాకివ్వలసిందని ప్రార్థించారు. అందుకే ఆ జన్మలో ఆయన వాళ్ళకు పుత్రుడై పుట్టాడు. ఆ తర్వాత జన్మలో వాళ్ళు అదితి కశ్యపులై పుడితే వాళ్లకు వామనుడై జన్మించాడు. మూడవ జన్మలో వాళ్ళు దేవకీ వసుదేవులైతే దేవకీదేవి అష్టమ గర్భంగా అష్టమినాడు ఆయన కృష్ణుడై అవతరించాడు.
ఆ కృష్ణుడే నందనందుడై యశోదానందనులను అలరించాడు. వారికి ఎన్నో మహిమలు చూపాడు. ఆ కృష్ణుడే దేవకీవసుదేవులను చెరనుంచి విడిపించడమే కాదు వారికి ఇక జన్మలేకుండా చేశాడు.
పసికందుగా ఉన్నప్పటినుంచి ఏడేండ్లు దాటకుండానే సమస్త లీలలు ఆయన చూపాడు. పూతనను చంపాడు. శకటాసురుణ్ణి సంహరించాడు. వత్సాసుర, బకాసురులను వధించాడు. ఆఘాసురుణ్ణి చంపా డు. కాళీయమర్థనం చేశాడు. చివరకు పెరిగి పెద్దవాడు అవుతూ చిటికెనవేలుతో గోవర్థన పర్వతానె్నత్తి, గోవర్థణోద్ధరణం చేశాడు. కుబ్జను అపరూప సౌందర్యవతిని చేశాడు. గోపభామలకు అసలుతత్వ్తన్ని ఎరుకపర్చాడు. కుచేలునితో స్నేహం చేసి స్నేహం విలువను చెప్పాడు. పాండవులతో రక్తసంబంధాన్ని పెటు టకుని బంధుప్రీతి ని తెలియచేశాడు. తన వారైనా సరే ధర్మాన్ని తప్పకూడదనే చెప్పడానికే భారతయుద్ధంలో పాల్గొని ధర్మసంస్థాపన చేశాడు కృష్ణుడు. చేయని పని లేదు. చెప్పని, ఆచరించని నీతిలేదు. అందుకే మనమంతా కృష్ణుని బాటలో నడిచి అన్యాయాన్ని మదమణిచి సన్మార్గంలో ధర్మపరాయణుల మవుదాం.
ఈ ధర్మపరాయణులే కృష్ణుని స్మరిస్తూ కృష్ణజననాన్ని పురస్కరించుకుని ఉత్తరాదిలోని గోకులం, బృందావనం, మధురలలో, పశ్చిమాన ద్వారకలో, తూర్పున పూరీలో, దక్షిణాదిన, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో విభిన్న సంస్కృతులు సంప్రదాయాలను బట్టి జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు.

సీ. కాళీయు పడగపై ఁ గాలుపెట్టియు నాట్య
మాడుచు గర్వంబునణచినావు
శిశుపాలు శిరము ఛేదించితివి వాడి
సదర్శన చక్రమదియు వదలి;
దుష్టుల దునుమాడి శిష్టుల ఁ గావంగఁ
బుడమిపై ఁ బుట్టిన పూజ్యుడీవు
యజభోక్తవెయైన నతిశయంబుగ నాడు
వెన్నఁ బాలుపెరుగుల్ వెతకినావు
చిత్రవౌ లీలావిచిత్రముల్ గనుగొన
శక్యమా !చూడ మాసాటివార్కి
తే.గీ. మధురమైనట్టినీనామ మహిమఁ గూర్చి
పొగడతరవౌనె నీవె మా జగతి వయ్య
నిన్నుఁ గృష్ణేతి ఁ బల్కిన నిత్య శుభము
లవియు మా యిండ్లఁ జేరునేయదువిభూష!
భావం: శ్రీకృష్ణా!పరంధామా!స్వామీ! కాళీయ మర్దనం చేసి అతని గర్వాన్ని పూర్తిగా అణచివేసినావు. వాడియైన సుదర్శన చక్రంతో శిశుపాలుని వధించినావు. అతని తల్లి సాత్వకికి ఇచ్చిన మాట ప్రకారం నూరు తప్పులు దాకా క్షమించిన పైన అతని శిరమును గూల్చినావుసుమీ. నీశక్తి సామర్థ్యాలను ప్రదర్శించావు. దుష్టశిక్షణ, శిష్టరక్షణకు నీ అవతరించిన పుణ్యమూర్తివి నీవయ్య. మా వంటి అల్పులు నీ లీలా విచిత్రాలను తెలుసుకోవడం అసాధ్యం. మధురాతి మధురమైన నీనామ మహిమను పొగడడం సులభతరమా కృష్ణా!

- లక్ష్మీ ప్రియాంక