Others

జో అచ్యుతానంద జో జో ముకుందా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జో అచ్యుతానందా జో జో ముకుందా
రారా పరమానందా రామగోవిందా
అంటూ ప్రతి తల్లీ తన బిడ్డడికి జోల పాట పాడుతుంది. అపుడు ఆమె శ్రీకృష్ణుడే తన కడుపున పుట్టాడని ఎంతో తన్మయత్వంతో పాడుతుంది. ఈ పాట పాడడానికి సంగీతం రానక్కర్లేదు. బాణీలు నేర్చుకోనక్కర్లేదు. కేవలం కృష్ణుడి మీద ఉన్న ప్రేమతో భక్తితో మధురాతిమధరంగా తన తనయుడే కృష్ణడన్న భావంతో ప్రతి తల్లీ పాడుకోవడం మన తెలుగింట అనుచానంగా వస్తుంటుంది.
అంతేకాదు పాపడికి నీళ్లుపోసేటపుడు
లాలనుచు పాడరమ్మా
ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా
పాదమున చక్రమమ్మా
ఈ బిడ్డ వేదాంత వేద్యుడమ్మా
వేణునాదంబుతో
ఈ బిడ్డ వేదములు పాడునమ్మా
అని ఇద్దరు ఆడవాళ్లు పాడుతూ అపుడే పుట్టిన శిశువులకు స్నానాలు చేయిస్తుంటారు
మనసా వాచా కర్మణా నీవే ఏ పనిచేసినా ఆ పని పరమేశ్వరుడిని అర్పించి చేయి ఆయా పనులన్నీ నాకే చెందుతాయి. నేను కర్తకర్మక్రియనౌతాను. నీవు నిమిత్తమాత్రునిగా ఉండిపోతావు. దేహం రాలిపోయాక నీవు నా సన్నిధికి వస్తావు అని ఆనాడు కృష్ణుడు కర్మయోగాన్ని అర్జునుడికి బోధించినట్లు పండితులు చెప్పుకున్నా పామర జనం కూడా ఆ భారత భాగవత రామాయణాదులు విని విని వారు వారి పూర్వతరాల నుంచి వౌఖికంగా పాటలను పద్యాలను నేర్చుకున్నారు అని అనడం కన్నా వారి శరీరంలో, తనువులో , మనస్సులో జీర్ణం చేసుకొన్నారు.
ఎవరూ ఎవరికీ నేర్పించక్కర్లేదు. చెప్పనక్కర్లేదు.. అనుకోకుండానే వారి నోట కృష్ణా గోవిందా మురారి అంటూ పాటలు వస్తూనే ఉంటాయి. అదే భారతీయంలోని గొప్పతనం.
ఈ విజ్ఞాన సంపదను చూసి తన్మయత్వం చెందాడు కనుకనే బిరుదురాజు రామరాజుగారు జానపద విజ్ఞానాన్ని గ్రంథస్తం చేయాలనుకొన్నారు. నిజమే ఎంత తవ్వి తీసినా తరిగిపోనీ గనులెన్నో ఈ జానపద గేయాల్లో పాటల్లో ప్రవహిస్తూనే ఉంటాయి.
కస్తూరి రంగ రంగా - నాయన్న -
కావేటి రంగ రంగా
శ్రీరంగ రంగరంగా - నినుబాసి -
యెట్లునే మరచుందురా
కంసుణ్ణి సంహరింపా - సద్గురుడు -
అవతారమెత్తెనపుడూ
దేవకీ గర్భముననూ -
కృష్ణావ -తారమై జన్మించెనూ
యేడు రాత్రులు చెరిచీ-
ఒకరాత్రి - యేక రాత్రిగ జేసెను
ఆదివారము పూటనూ -
అష్టమీ - దినమందు జన్మించెనూ
తలతోను జన్మమెత్తె -
తనకు బహు మోసంబు వచ్చుననుచు
ఎదురుకాళ్లను బుట్టెను - .....
అంటూ కృష్ణజననాన్ని తిరుగలి విసురుతూనో, రోళ్లల్లో దంచుతూనే పాటలు పాడుకునేవారు స్ర్తిలు.
కంసుని లాంటి లోకపీడకులు ద్వాపరయుగంలో పెచ్చుమీరారు. వారి ఆగడాలు మితిమీరి పోయాయి. వారందరూ కూడా బ్రహ్మాదులను పూజించి తపస్సులు చేసి వరాలు పొంది వర గర్వంతో విర్రవీగుతూ సాధువులను సజ్జనులను పీడించి ఆనందించేవారు.
అదిగో అపుడే శ్రీమహావిష్ణువు మాయలకేమాయగా ఉన్న మహా విష్ణువు శ్రీకృష్ణుడుగా పుట్టాడు. శ్రీరాముడిలాగా నేను మానవుడిని అని చెప్పలేదు. నేనే భగవానుడిని. ఇదిగో మీరీ దారిగుండా నడిస్తే మంచిమార్గంలో ఉంటారు. సద్గతులు కలుగుతాయి. చెడుదారిన నడిస్తే అన్నీ దారులు నావే ఆ మార్గంలోనే నేను వచ్చి మిమ్ము తుదముట్టిస్తాను. జాగ్రత్త అనేట్లుగా పుట్టీపుట్టకగానే ఎనెన్నో వింతలు మాయలు విచిత్రాలు చిత్రాలు ఎన్నో చేసి చూపించాడు. పాలు తాగే వయస్సునుంచి పూతనాదులు సంహరిస్తూ వచ్చాడు. చిట్ట చివరకు పాండవ పక్షపాతి అని పేరువచ్చినా ధర్మం వైపు నిలబడుతాను నేను, నా భక్తుల కోసం నేను చేసిన బాసను కూడా పక్కన బెడుతాను అని ఆయుధం పట్టనని చెప్పి తన ప్రియభక్తుని పైకి శరవర్షం కురిపించే భీష్ముని అంతం చేస్తానంటూ రథచక్రాన్ని తీసుకొని భీష్మునిపైకి కుప్పించి ఎగిసె... నంటూ పోతనామాత్యుడు ఉదరంలోనే 14 భువనాలను ఉంచుకున్న ఆ కృష్ణుడు భీష్ముని పైకి రథచక్రం పై దూకుతున్నపుడు ఆ భువనాలు కళావిళా పడ్డాయ. కుండలాలు కాంతి ఆకసాన్ని తాకింది అంటూ భక్త పరాధీనత గురించి బహుచక్కగా చెబుతారు. అంతటి భక్త పరాధీనత ఉన్న ఆ శ్రీకృష్ణుని తలుచుకుని ప్రతి యేడు కృష్ణాష్టమి నాడు తమ తమ ఇండ్లల్లోని పసిపిల్లలకు కృష్ణుని వేషం కట్టి తల్లులంతా యశోదమ్మలు అవుతారు. ఆ తరువాత నాడు ఉట్టి కొట్టిన కృష్ణయ్యను తలుచుకుంటూ దేవాలయాల్లో నాలుగు రోడ్ల కూడలిలోను ఉట్లు కట్టి వాటిని నేటి కృష్ణుల చేత కొట్టించుకునే ఆట ఆడి పాడుతుంటారు. ఆహా ఏమి ఆ ఆనందం చూసి తీరవలసిందే కానీ అక్షరాలతో వర్ణించవీలులేనిది. కృష్ణాష్టమి నాడు ప్రతి ఇంటా గోపాలుడే ఎక్కడ చూసినా కృష్ణుని దివ్యరూపాలే కనిపిస్తుంటాయి. కనుక పెద్దలు పిన్నలు అనే తేడాల్లేకుండా అందరం హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే అని భజనం చేద్దాం రండి...

- చివుకుల రామమోహన్