Others

హాట్ అవతార్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాట్ భామ శ్రద్ధదాస్‌కు టాలీవుడ్ కలిసిరాలేదు. వొళ్ళు దాచుకోకుండా ఎన్నిరకాల కష్టపడినా -కమర్షియల్ బ్రేక్ కనుచూపుమేరలో కనిపించటం లేదు. ఇక బాలీవుడ్ నుంచి నరుక్కొద్దామనుకున్న తరుణంలో -‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ అడల్డ్ కామెడీ అచ్చిరావడంతో ‘అడల్డ్’ ఛాన్స్‌లు అమ్మడి ఇంటిముందు క్యూగట్టాయి. కెరీర్ బోటు స్టడీగా లేనప్పుడు -దొరికిన గడ్డిపూచతోనే సాగరాన్ని ఈదే ఆలోచనతో లేటెస్ట్‌గా ఓ హాట్ ఫొటోషూట్ చేసింది. తనేంటో, తన దగ్గరున్న టాలెంట్ ఏంటో -పట్టించుకోని వాళ్లకు తెలిసొచ్చేలా ఫొటో షూట్, అనుసంధానంగా మేకింగ్ వీడియోతో రెచ్చిపోయిందట. అయితే, వీడియో చూసిన సినీజనం మాత్రం లొట్టలేయడం మానేసి -అవకాశాల కోసం మరీ ఇంత బరితెగించాలా? అంటూ పెదవి విరుస్తున్నారు. ఎవరేమనుకుంటే ఆమెకేంటి? ఈ దెబ్బకు బాలీవుడ్‌లో శ్రద్ధదాస్ ‘ఆ తరహా’ హాట్ ఛాన్స్‌లు
వెతుక్కుంటూ రావడం ఖాయమని అంటున్నవాళ్లూ ఉన్నారు. చూద్దాం..
కెరియర్ గ్రాఫ్‌ని శ్రద్ధ ఏ రేంజ్‌కు తీసుకెళ్తుందో!