Others

యన్‌టిఆర్.. రాజమార్గం ( ఆనాటి హృదయాల..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మాకు దొడ్డిమార్గంగుండా వెళ్లే అలవాటు చిన్నప్పట్నించీ లేదు. ఇపుడు నేర్చుకోమంటారా? మీ బోడి సలహా అవసరంలేదు. రాజమార్గం గుండానే వెళదాం!’ అన్నారు, ఆర్డరు జారీ చేస్తున్నట్లుగా యన్‌టిఆర్..

యన్‌టి రామారావు అప్పటికి చీఫ్ మినిస్టరాఫ్ ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నారు. యన్‌టిఆర్ సోదరుడు నందమూరి త్రివిక్రమరావు ద్వితీయ కుమారుడు హరీన్ చక్రవర్తి వివాహం నిశ్చయమైంది. లగ్నాలు పెట్టుకున్నారు. పెళ్లినాటికి యన్‌టిఆర్ వస్తారా? రారా? అని తెగ టెన్షన్ పడుతున్నారు త్రివిక్రమరావు. ఏ సమాచారం స్పష్టంగా తెలియడం లేదు. సరిగ్గా అదే సమయంలో యన్‌టిఆర్ ఆంధ్ర దేశమంతా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.
పెళ్లిరోజు రానే వచ్చింది.
తెనాలిలో పెళ్ళి.
అనూరాధ టింబర్ ఎస్టేట్స్ ప్రాంగణంలో ఓ అందమైన కల్యాణ మంటపం నిర్మించి, రంగురంగుల విద్యుద్దీపాలంకరణతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
సాయంత్రానికి పెద్దాయన వచ్చారు.
మందీ మార్బలం.. పెళ్లికొచ్చిన బంధుమిత్రులందరూ పెద్దాయన్ని చూడ్డానికి వెళ్లిపోయారు. తీరా అన్నగారు వచ్చిన తరవాత తమ్ముడుగారు కూడా అక్కడే వుండాలి కదా-చిన్నాయన కూడా పెద్దాయన దగ్గరికే వెళ్లారు. పెళ్లితంతు జరుగుతోంది. అదే సమయంలో పెద్దవాళ్లు ప్రోటోకాల్స్ పాటించటం కోసం యన్‌టిఆర్ దగ్గరికి వెళ్లడం వలన కల్యాణ మంటపంలో అజమాయిషీ చేసేవారు ఎవరూ లేకపోయారు. ఆకతాయి కుర్రాళ్లు రెచ్చిపోయారు. అమ్మాయిల్ని ఏడిపించడం మొదలుపెట్టారు. కాస్సేపు సహనం వహించిన అమ్మాయిలు ఎదురుతిరిగారు. చిలికి చిలికి గాలివానైంది. దాంతో పెద్దగొడవ... కర్రల్తో తలలు పగులగొట్టుకున్నారు. కల్యాణ మంటపం వరకు అలంకరించిన విద్యుద్దీపాలను ధ్వంసం చేశారు.
కొన్నివేల ట్యూబులైట్లు ముక్కలైపోయి, రాజమార్గం (రోడ్డునుంచి వచ్చేదారి) నిండా గాజుపెంకులు, రాళ్లు, రప్పలతో నిండిపోయింది. ఆ సమయంలో బాలయ్య కూడా అక్కడేవున్నారు. తన ఫ్యాన్స్ పేరుమీద జరిగిన భీభత్సం ఇది- నిజానికి వారు అల్లరిమూక- బాలయ్య ఫ్యాన్స్ కాదని తర్వాత తెలిసింది.
ముహూర్తం సమయం ముంచుకొచ్చేస్తుంది. పెళ్లి పందిరిలో పెళ్లివారు టెన్షను పడుతున్నారు. నేను ఇరువర్గాల వారికీ చెందినవాడిని.. నేనూ లక్ష్మణ్ పెద్దాయన్ని తీసుకురావడానికి వెళ్లాం. లక్ష్మణ్ అంటే యన్‌టిఆర్‌కి దూరపు బంధువు ప్లస్ కేమరామన్. జరిగింది విని అన్నగారు అగ్గిమీద గుగ్గిలం అయిపోతున్నారు.
‘మమ్మల్ని ఎలా రమ్మంటారు?’ సూటిగా ప్రశ్నించారు యన్‌టిఆర్. అర్థమైంది. కల్యాణ మంటపానికి వెళ్లే రాజమార్గం ధ్వంసమైంది కదా దొడ్డిదారిన ఎలా రమ్మంటారు అని ఆయన ఉద్దేశ్యం.
‘వెనుకనుంచి ఓ మార్గముంది. అది కల్యాణ మంటపానికి చేరుతుంది!’ అని చెప్పేడు లక్ష్మణ్.
ఆయనకేసి బుసలుకొడుతున్నట్టు చూశారు.
‘మాకు దొడ్డిమార్గంగుండా వెళ్లే అలవాటు చిన్నప్పట్నించీ లేదు. ఇపుడు నేర్చుకోమంటారా? మీ బోడి సలహా అవసరంలేదు. రాజమార్గం గుండానే వెళదాం!’ అన్నారు, ఆర్డరు జారీ చేస్తున్నట్లుగా.
‘అలా వెళ్ళడం వలన కాదు...’
‘పోతుందండీ.. కారు పోతుంది. లేదా ప్రాణాలుపోతాయ్. పరువు తక్కువ పనులు చేయమంటారా. కమాన్- ముహూర్తం సమయం దాటిపోతుంది!’ అంటూ ఆయన కారెక్కేశారు. దార్లో ఎటువంటి గొడవలు జరగలేదు. అప్పటికే పోలీసులు వలయంలా చుట్టుముట్టేశారు.

-ఇమంది రామారావు 9010133844