Others

భరత్ అను నేను (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతేడాది పొలిటికల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన -్భరత్ అను నేను సినిమా నాకు చాలా ఇష్టం. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన చిత్రంలో మహేష్‌బాబు, కైరా అద్వానీ, ప్రకాష్‌రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఒక విద్యార్థి అనుకోకుండా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాల్సి వస్తు -రాష్ట్రంలో ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చాడు అన్న సందేశంతో సాగే కథ అద్భుతంగా ఉంటుంది. సమాజంలో ప్రతి ఒక్కరికీ భయంతో కూడిన బాధ్యత ఉండాలన్న కానె్సప్ట్‌ను తెరకెక్కించిన విధానం బావుంటుంది. అంతకుముందు దర్శకుడు కొరటాల శివ అదే మహేష్‌బాబుతో ‘దత్తత’ కానె్సప్ట్‌పై శ్రీమంతుడు చిత్రాన్ని తెరకెక్కించి హిట్టందుకున్నాడు. ఈ చిత్రంలోనూ ఓ ముఖ్యమంత్రిగా ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తూనే, భయంతో కూడిన బాధ్యతను తెలియజెప్పే విధానం ఆసక్తికరంగా సాగుతుంది. సినిమా మొత్తంమీద సమాజానికి క్రమశిక్షణ అనేది అలవాటు చేస్తే -ఆ సమాజం స్వరూపం ఎంత అద్భుతంగా మారిపోగలదన్న అంశాన్ని చూపించారు. ముఖ్యమంత్రి పిఎ వసుమతి పాత్రలో కైరా అద్వాని మెప్పించారు. పార్టీ అధ్యక్షుడి మాటకు తలూపకుండా, తనదైన రాజకీయ శైలితో వ్యవహరిస్తూ పార్టీలో తలెత్తిన అసమ్మతిని ఉక్కుపాదంతో తొక్కేయడమన్నది నిజాయితీ కలిగిన ముఖ్యమంత్రికే సాధ్యమన్న రీతిలో మహేష్‌బాబు పెర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినిమా రేంజ్‌ను పైకిలేపిన ‘వచ్చాడయ్యే సామి’ అన్న పాట మరో హైలెట్. పొలిటికల్ యాక్షన్ డ్రామా అయినప్పటికీ సీరియస్‌నెస్‌తో ఆడియన్స్‌కి బోర్ కొట్టకుండా -ఐ డోన్ట్ నో, ఇదే కలలా వచ్చిందే, ఓ వసుమతి పాటలు మంచి రీలీఫ్‌నిస్తాయి. సినిమాలో కామెడీ శాతాన్ని కూడా కాస్త పెంచివుంటే -సినిమా మరో రేంజ్‌లో ఉండేదేమో. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాలో సాంకేతికవర్గం కిందకొచ్చే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్‌కు ఎక్కువ మార్కులు వేయొచ్చు. ఏదేమైనా సందేశాత్మకంగా సాగే సినిమా -్భరత్ అను నేను అంటే నాకు చాలా ఇష్టం.

-సన్ని.కె, ఫిర్జాదిగూడ