Others

మాటలు పాటలే.. సినిమాకు ప్రాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక సినిమా విజయం సాధిస్తే తీసిన దర్శకుడినో, చేసిన హీరోనో మెచ్చుకుంటారు. కాని, వాళ్లకు ఆ చాన్స్ ఇచ్చే కథకుడు మాత్రం అజ్ఞాతంలో ఉన్నట్టే ఉంటాడు. అలాగే ఆ కథను తగిన సంభాషణలు అందించి చిత్రానికి ఓ గొప్పదనాన్ని తీసుకొచ్చేవారు, చెప్పాల్సిన కథను సింపుల్‌గా ఓ పాటతో చెప్పేవారు వీళ్లు మాత్రం తక్కువ ఆదరణ నోచుకుంటారు.

ప్రేక్షకులకు వినోదాన్ని పంచేటటువంటి సినిమాను తెరకెక్కించాలంటే ఆ సినిమా నిర్మాణం వెనుక కానీ, సక్సెస్ వెనుక గానీ ఏ ఒక్కరి పూర్తి కష్టం, బాధ్యతలుండవు. హీరో, హీరోయిన్లు, నటీనటులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్స్, విలన్ పాత్రలు వీరందరి బాధ్యతలు ఉంటాయి. మరి వీరందరూ తెరమీద కనిపించే పాత్రలు, పాత్రల్లోని వ్యక్తులు. వీరే కాకుండా 24 ఫ్రేమ్స్ బాధ్యతలు తీసుకోవాలి. ఒకరినొకరు మ్యూచువల్ అండర్‌స్టాండింగ్స్‌తో, అడ్జస్ట్‌మెంట్స్‌తో పనిచెయ్యాల్సి వుంటుంది. మొదటగా కథను ఎంచుకోవాలి. ఆ తరువాత కథను దర్శకులకు వివరించాలి. ఆ కథను తీయటానికి దర్శకునికి ఓకే అయితే ఆ పాత్రలకు తగినట్లు, కథకు తగినట్లు హీరోహీరోయిన్లతో కూర్చొని కథను ఆసాంతం వివరించాలి. ఇక నిర్మాతను కూడా ఒక్కోసారి వెతుక్కోవాల్సి ఉంటుంది. పెద్ద సినిమాలయితే నిర్మాతలు క్యూకడతారు. అదీకూడా పెద్ద హీరోలతో తీస్తే అప్పటికే పెద్ద హీరోలకు క్రేజ్ ఉంటుంది. ఇక మాటల మాంత్రికులు కూడా ఖచ్చితమయిన అవసరం వీళ్ళది. ఎందుకంటె ప్రతీ సినిమా సక్సెస్ కాకపోవచ్చు. కానీ ప్రతీ సినిమాలోని మాటలు మాత్రం బాగుంటాయి. అవి సెంటిమెంట్‌కు సంబంధించినవే కావచ్చు, రౌద్రానికి సంబంధించినవే కావచ్చు. ఇంకా ఏవయినా కావచ్చు. కొన్ని సినిమాలను అందులో ఉన్న డైలాగ్స్‌తోనే అభిమానులు గుర్తుపెట్టుకునే అలవాటు ఉంది ప్రేక్షకులకు. కొన్ని డైలాగ్స్‌ని సాధారణంగా అందరూ వాడుతుంటారు. ఇవన్నీ ప్రతీ ఒక్కరికి ఊతపదాల్లాగా అలవాటయిపోతాయి. మాటలు మరచిపోలేని ఎన్నో సినిమాలు చరిత్రలో మిగిలిపోయాయి, మిగిలిపోతాయి. కామెడీ పాత్రలనయితే జీవించేలా పంచ్ డైలాగ్స్‌తో ఓలలాడించాలి. మాటలే పాత్రలకు ప్రాణం పోస్తాయి.
ఇక సాహిత్యం విషయానికి వచ్చినట్లయితే ఒక్కో సినిమాలో కథ వ్రాసి, దర్శకత్వం వహిస్తూనే మాటలు కూడా వ్రాసే త్రీ ఇన్ వన్ దర్శకులుంటారు. సొంతగా కథ వ్రాసి దర్శకత్వం వహిస్తే దర్శకులకు చాలా సులువుగా ఉంటుంది. ఎందుకంటె పాత్రలను ఆ కథలో పరకాయప్రవేశం చేయించగల్గుతాడు దర్శకుడు. అదే కథ వేరేవారు వ్రాసి, దర్శకత్వం ఒకరు చేసినట్లయితే కాస్త అనుకున్నంతగా రాకపోవచ్చు. దర్శకుడు కథలో లీనమైపోవాలి. లేదా దర్శకునికి అప్పుడప్పుడు కథకుడు సినిమా తీసే విధానంలో సహాయం చేయాల్సి రావచ్చు. ఏదేమయినా ఇంతవరకు బాగానే ఉంటుంది. ఇక పాటలు సినిమాకు హైలైట్ అవుతాయి ఒక్కోసారి. కావాలి కూడా. ఎందుకంటె సంగీత బాణీలు, పాటలతో ఎక్కువ సినిమాలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. కథకుడు చెప్పిన కథను దర్శకుడు ఎలా తీస్తాడో, అంతకన్నా చాలా కష్టం. ఎందుకంటె ఒక్కో సందర్భాన్నిబట్టి పాటలు రాయాల్సి వుంటుంది. అవి డ్యూయట్స్ కావచ్చు, విరహ గీతాలు, కావచ్చు, ఐటమ్ సాంగ్స్ కావచ్చు, టైటిల్ సాంగ్స్ కావచ్చు, ట్రాజెడీ సాంగ్స్ కావచ్చు. ఆ సమయంలో జరుగుతున్నటువంటి సీన్‌నుబట్టి పాటలు ఉండాలి. ఒక్కోసారి రెండున్న గంటలపాటు నిడివి ఉండే సినిమాను ఐదు నిమిషాల్లో ఒక పల్లవి, రెండు చరణాల్లో చెప్పాల్సి ఉంటుంది. అంటే గేయ రచయిత ఎంత అవలోకనం చేసుకోవాలో, అది ఎంత కష్టమో ఒకసారి ఆలోచించాలి. ఆ పాటలోని ఒక్క పదం కాస్త అటూ ఇటు అయినా కూడా ఆ పాట ఒక్కటే కాదు, సినిమా మొత్తం రివర్సయిపోతుంది. రెండున్నర గంటలపాటు సాగే కథను ఒక్క పాటలో చెప్పాలంటే ఆ గేయ రచయిత ఎంత ఎక్సర్సయిజ్ చేయాలో ఊహకు అందని విషయం. ఆ పాటలోని పదాలు, అల్లికలు ఒక దానితోఒకటి అంతగా మ్యాచ్‌కావాలి. ఒకప్పుడయితే ప్రతీ పాటలో గొప్ప సాహిత్యం ఉండేది. అలాంటి పాటల్లో కేవలం ఒక్క తెలుగు పదాలు మాత్రమే ఉండేవి. అటువంటి తెలుగు పదాలతోనే గేయ రచయితలు ఆటలాడుకునేవారు. ఇక అటువంటి సాహిత్యం రానురాను చాలా సులువుగా మారిపోయింది. మార్పురావడం కూడా ఒక విషయంలో మంచిదే. ఎందుకంటె అప్పుడున్నటువంటి ఇప్పుడు పాటలు రాసినట్లయితే సంగీత ప్రియులకు ఏమాత్రం అర్ధంకాకపోయేవి. దాంతో అస్సలు పాటలే బాగోలేవనే నిర్ణయానికి అభిమానులు వచ్చేవారు. కానీ ఇప్పుడు ఒక లవ్ సాంగ్ (డ్యూయట్) రాయాలంటే అందుబాటులో సగానికి పైగా ఆంగ్ల పదాలు, వాక్యాలు మాత్రమే కాకుండా ఇతర భాషల పదాలుకూడా వచ్చి చేరుతున్నాయి. చేరుతున్నాయనేకంటె సందర్భాన్నిబట్టి గేయరచయితలే చేరుస్తున్నారంటే బాగుంటుందేమో. ఏదేమయినా అలా చేర్చాల్సిన అవసరం ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి ఖచ్చితంగా ఉంది. అదొక అవసరం, ఫ్యాషన్ అయిపోయింది. 50%నుంచి 60% చిత్రాల్లోని డ్యూయట్‌లలో విపరీతంగా ఇలాంటి పదాలు/ పరభాషా పదాలు ఉండటం రివాజయిపోయింది.
ఇక ఇదంతా ఒకెత్తయితే గేయ రచయితలను దర్శకులు తమ కథనుబట్టి తాము చెప్పిన విధంగా పాటలు రాయాలనేవారు కొందరు ఉంటారు. ఒక్కోసారి దర్శకులు, సంగీత దర్శకులు, గేయ రచయితలు పాటలకోసం ఎన్నోసార్లు సిట్టింగ్స్‌చేయాల్సి వస్తుంది. అయితే ఇందులో కూడా కొంతమంది సంగీత దర్శకులు ట్యూన్ ఇచ్చి పాటలు వ్రాయించుకునేవారుంటారు. కొంతమంది సంగీత దర్శకులు గేయ రచయితలు వ్రాసిన పాటలకు, అలాంటి పదాలను మార్చకుండా ట్యూన్ కట్టేవారు కూడా లేకపోలేదు. దర్శకులు, సంగీత దర్శకులిద్దరూ కూడా తాము అనుకున్న అర్థం వచ్చేంతవరకు వ్రాయిస్తూనే వుంటారు. కొంతమంది దర్శకులయితే ఒక లైన్ చెప్పేసి వ్రాయించుకుంటారు. ఒక్కోసారి గేయరచయిత ఇలాంటి పరిస్థితులు వచ్చినపుడు కాస్త ఇబ్బందిగానే ఫీలవుతుంటారు. కానీ తాను వ్రాసినటువంటి పాటలు, ఆ పాటలతో ఆ సినిమా గనుక హిట్టయినట్లయితే తనకు కూడా ఎక్కడలేనటువంటి అభిమానులు, పేరు వస్తుందని అంతకంటె ఎక్కువగా కష్టపడతారు. అసలు ఏ భాషలో లేనటువంటి ప్రాస మన తెలుగులో ఉండటం ఒక అదృష్టం. ఒక్క పదానికి ఎన్నో అర్థాలు, సమాధానార్థాలు, నానార్థాలు, వ్యతిరేకార్థ పదాలు ఉండటంతో ప్రక్క ప్రక్కగా వస్తున్నటువంటి పదాల అల్లికతోనే గొప్పగొప్ప పదాలు, పల్లవులు, చరణాలు వ్రాయడానికి వీలుగా ఉండటం గొప్ప భాగ్యంగా భావించవచ్చు. ఒక్క వాక్యంలో వచ్చే అర్థాన్నంతటినీ ఒకే ఒక్క చిన్న రెండు, మూడు అక్షరాలున్నటువంటి పదాలతో ఫుల్‌ఫిల్ చేయవచ్చు. అంతటి గొప్పది తెలుగు భాష. తెలుగు భాషకున్నటువంటి ఔన్నత్యం, గొప్పతనం. పాటలు కథకు, కొన్ని సన్నివేశాలకు, సందర్భాలకు మొత్తం సినిమాకు కూడా ప్రాణంపోస్తాయని ఖచ్చితంగా చెప్పడంలో అతిశయోక్తిలేదని నిక్కచ్చిగా చెప్పవచ్చు. తెలుగు సాహిత్యాన్ని అనుభవిస్తే అదొక తీయని అనుభూతి. పదాల కలయిక, వాక్యాల కూర్పు, అల్లికలు గుండెను హత్తుకుంటాయి. అవి విరహగీతాలు కావచ్చు, డ్యూయట్లు కావచ్చు, ఐటమ్‌సాంగ్స్ కావచ్చు. ఒకటని కాదు ఏ రకమయిన పాటయినా సరే ఎంతో శ్రావ్యంగా, మృదువుగా చెవులను తాకే ఎద లోతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇక ఆ పాటలోని పదాలు మనసును మరవనీయవు.

-శ్రీనివాస్ పర్వతాల 9014916532