Others

ఖర్చు తగ్గిద్దామా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు అబ్బాయిలతో పాటు అమ్మాయిలూ సమానంగా సంపాదిస్తున్నారు. అయితే పొదుపు చేయడంలో, ఖర్చుల్ని అదుపు చేయడంలో, ఖర్చుల్ని అదుపు చేయడంలో వెనకుండి పోతున్నారు. దానికి కారణాలు ఎన్నున్నా.. సరిదిద్దుకుని పొదుపు చేసేలా అడుగులు వేస్తే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోవచ్చు.
* జీతం అందుకున్న మొదటి నెల నుంచే.. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముందుగా ఖర్చులను నాలుగు రకాలుగా విభజించుకోవాలి. అత్యవసరాలు, అవసరాలు, సౌకర్యాలు, విలాసాల కోసం వేరు చేసుకోవాలి.
* జీతం నుంచి కనీసం ఇరవై శాతమైనా అత్యవసరాల కోసం ఆదా చేయాలి. అనుకోకుండా ఎదురయ్యే ప్రమాదాలు, అనారోగ్యాలు వంటివాటిని అత్యవసరాలుగా గుర్తించాలి.
* ఇక అవసరాలకు ఓ నలభై శాతం కేటాయించుకోవాలి. కనీసం ముప్ఫై శాతం భవిష్యత్తు కోసం దాచాలి.
* విలాసాల కోసం అయితే విడిగా పొదుపు చేసుకుని వాడుకోవాలి. మిగిలిన ముప్ఫై శాతం డబ్బుని వివిధ రూపాల్లో పెట్టుబడిగా, రాబడి పథకాల్లో మదుపు చేయాలి.
* రోజువారీ ఖర్చులు హద్దు దాటకూడదంటే చిన్న ఖర్చే అయినా సరే.. రాసిపెట్టుకోవాలి. ఇలా రాయడం వల్ల నెల్లో దేనికి ఎంత ఖర్చు అవుతుందో అవగాహన ఉంటుంది. మనకు తెలియకుండా ఎక్కడ ఎక్కువ ఖర్చులు చేస్తున్నామో సమీక్షించుకోవచ్చు. అప్పుడే వాటిని తగ్గించుకోవచ్చు.
* జీతం అందుకుంటున్నాం కాబట్టి ఎంత ఖర్చు చేయవచ్చు అనే పద్ధతి వద్దు. జీతం ఖాతాతో పాటు మరో పొదుపు ఖాతాను తెరవాలి. జీతం వచ్చాక అవసరాలన్నింటినీ లెక్కేసి కొంత మొత్తాన్ని కేటాయించి మిగిలిన డబ్బుని ఆ పొదుపు ఖాతాకి బదిలీ చేయాలి. దానికి ఆన్‌లైన్, ఏటీఎమ్ కార్డు రెండూ వాడకూడదు. దీనివల్ల అందులో ఉండే డబ్బు ఆదా అవుతుంది.
* క్రెడిట్ కార్డులు అవసరమైతే తప్ప వాడకూడదు. మీరెంతలోపు ఖర్చు పెట్టాలనుకుంటున్నారో ఆ మొత్తాన్ని మాత్రం నగదు రూపంలో తీసుకెళ్లి షాపింగు చేయడం వల్ల వృథా ఖర్చు కాదు. *