Others

ఆరాధన (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యన్టీఆర్, వాణిశ్రీ కాంబినేషన్‌లో 1976 మార్చి 12న విడుదలైన సినిమా -ఆరాధన. నిరక్షరాస్యుడైన గోపి, విద్యాధికురాలైన రాధల మధ్య నడిచే ప్రేమ కథ. పల్లెటూరికి చెందిన గోపి గాయకుడు. తన మధుర కంఠం, పల్లెటూరి అమాయకత్వంతో రాధను ఆకర్షిస్తాడు. వాళ్ల ప్రేమకు ఎలాంటి అవాంతరాలు ఎదురయ్యాయి, ఇద్దరూ ఒక్కటయ్యారా? అన్నదే అసలు కథ. దర్శకుడు బీవీ ప్రసాద్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎ పుండరీకాక్షయ్య నిర్మాత. అద్భుతమైన పాటల్ని సినారె, దారశథి అందిస్తే, వాటికి ప్రాణం పోశారు సాలూరి హనుమంతరావు. ఆకట్టుకునే సంభాషణల్ని గొల్లపూడి మారుతీరావు అందిస్తే, హిందీ చలనచిత్ర రచయిత, రామాయణం సీరియల్ నిర్మాత రామానందసాగర్ కథను సమకూర్చారు.
భూతల స్వర్గంలాంటి కాశ్మీరు లోయలో గోపి, రాధల మధ్య ప్రేమ చిగురిస్తుంది. రాధను దేవతలా ఆరాధిస్తుంటాడు గోపి. చెల్లెలి వివాహం కోసం పట్నంచేరి, రాధ సాయంతో మంచి గాయకుడు, నటుడిగా ఎదుగుతాడు. రాధ బావ సుధాకర్. మరదలిని సొంతం చేసుకోవడం కోసం అసూయా ద్వేషాలతో ప్రవర్తిస్తుంటాడు. ప్రేమికుల నడుమ విఘాతాలు కలిగించినా, చివరకు ప్రేమే జయిస్తుంది. కథ సుఖాంతమవుతుంది. ఆరాధన చిత్రంలో వాణిశ్రీ నటన అమోఘం. యన్టీఆర్ నటనకు హద్దులుండవు. వేణువులోనే ప్రేమభావాలు పలికిస్తూ ఆడియన్స్‌ని ముగ్ధమనోహరులను చేసేశాడు. నేపథ్య గానంతో హిందీ గాయకుడు మహమ్మద్ రఫీ, ఎస్ జానకి కథకు ప్రాణం పోశారు. యన్టీఆర్ ప్రయోగాలు చేయటంలో దిట్ట. అప్పటికి ఘంటసాల పరమపదించారు. ఎస్పీ బాలు రైజింగ్‌లో ఉన్నారు. ఆ టైంలో మహ్మద్ రఫీ చేత పాటలు పాడించటం ఒక ప్రత్యేకం. ఈస్టుమన్ కలర్‌లో ఆర్టిస్టుల కాస్ట్యూమ్స్, బ్యాక్‌గ్రౌండ్‌లో కాశ్మీరు అందాలు అద్భుతంగా ఉంటాయి. సినిమాలో పెట్టిన ఏడు పాటలూ ఆణిముత్యాలే. ‘నామది నిన్ను పిలిచింది గానమై వేణుగానమై’, ‘గడసరి బుల్లోడా’, ‘నేడే తెలిసింది ఈనాడే తెలిసింది’, ‘లైలాప్రేమకథ’, ‘నీకేలా ఇంత నిరాశ’, ‘ఓ ప్రియతమా..’లాంటి పాటలతో డెబ్భై దశకంలో గొప్ప సంచలనం సృష్టించిన సినిమా ఆరాధన. గుమ్మడి, జగ్గయ్య, మాడా, విజయలలిత, ఎస్ వరలక్ష్మి ఇతర పాత్రలు పోషించారు. ఏనాటికీ వనె్న తగ్గని సినిమా.

-ఎల్ శ్రీనివాసరావు, అద్దంకి