Others

విన్నావ యశోదమ్మా! (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘విన్నావ యశోదమ్మా/ మీ చిన్ని కృష్ణుడు చేసినట్టి అల్లరి చిల్లరి పనులు.. విన్నావ యశోదమ్మా’ అంటూ మాయాబజార్ సినిమా కోసం పింగళి నాగేంద్రరావు రాసిన పాట నాకు చాలా ఇష్టం. పాటకు తగిన కమనీయ స్వరాలు అందించారు ఘంటసాల మాస్టారు. అంతే శ్రావ్యంగా పాడింది పి లీల బృందం. నిజానికి ఈ పాట సినిమా కథకు అవసరం లేదు. లేకున్నా ఇబ్బందీ లేదు. కాకపోతే దర్శకుడు కెవి రెడ్డి సృష్టించిన సందర్భం ఆయన ప్రతిభాపాటవాలను తేటతెల్లం చేస్తుంది. శ్రీకృష్ణుని చిన్ననాటి ముచ్చట్లు, కృష్ణుని ఎదుటే అంతర్నాటకంగా ప్రదర్శించడమనే తెలివైన చమత్కార సందర్భాన్ని సృష్టించాడు దర్శకుడు. యాదవ కుటుంబమంతా మైమరచి చూస్తూంటే, చిత్రంలో పాండవుల ప్రస్తావన చూపకుండానే అప్పుడప్పుడూ ప్రస్తావిస్తూ, ఈ పాట చివర్లో ద్రౌపతి వస్త్రాపహరణ ఘట్టాన్ని గుదిగుచ్చి, కృష్ణుడు కోపంగా చూస్తూ అభయహస్తాన్ని చూపించే దృశ్యాన్ని అద్భుతం చేసి చూపించారు. అవసరం లేని పాట సందర్భం ఎంత బలంగా సృష్టించారన్నది చూస్తే కెవి రెడ్డి ఊహాశక్తి బలమెంతో అర్థమవుతుంది.
తిలంగ్ రాగంలో పాట మొదలవుతుంది. ‘కాలి గజ్జెల సందడి చేయక’ అన్న దగ్గర చారుకేశి రాగాన్ని అందుకొని.. ‘్భమలందరొక యుక్తిని పన్ని’ దగ్గర పీలూ రాగాన్ని స్పృశించారు ఘంటసాల మాస్టారు. ‘కాళింది మడుగున విషమును కలిపె’ దగ్గర శంకరాభరణం స్వరాలపై జానపద ధోరణిలో పాటను నడిపిస్తూ అంతర్నాటకానికి అతికేటట్లు చేశారు. బాలకృష్ణునిగా నటి పుష్పవల్లి కుమారుడు బాబ్జీ కనిపిస్తాడు. యన్టీఆర్, సంధ్య, సావిత్రి, గుమ్మడి, ఛాయాదేవి, నాగభూషణం తదితరుల సమక్షంలో పాట సాగుతుంది. ‘విన్నావటమ్మా! ఓ యశోదా గోపిక రమణుల కల్లలు’ అని బాలకృష్ణుడు అంటుంటే తిలకిస్తున్న రుక్మిణి పాత్రధారిణి సంధ్య నవ్విన ముసిముసి నవ్వు మధురాతి మధురం. శశిరేఖగా నటించిన సావిత్రి చిన్న పిల్లలా ఉత్సాహంగా రుక్మిణిని కుదపటం హానియిచ్చే దృశ్యం.

-పీవీఎస్పీ రావు, అద్దంకి