Others

అమెరికాలో తెలుగు పుస్తకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసక్తికరంగా ఉంది కదూ? ఆనందించ వలసిన విషయం కూడా కదూ?? ఇది ఎట్లా సంభవించిందంటే భారతదేశం పట్ల ప్రపంచంలో ఉన్న గౌరవంవల్ల అని చెప్పాలి. భారతదేశంలో వేల సంవత్సరాలుగా పురాతన సంస్కృతి, తత్త్వ చింతన, ధార్మిక బోధ, అనుపమాన సంగీత, సాహిత్య, నాట్య, నాటక కళాసంపద ప్రపంచానికి తెలుసుకాబట్టి ఈ అపురూపమైన సంఘటన చోటుచేసుకున్నది. హైదరాబాదు నగరంలో బషీర్‌బాగ్ చౌరస్తాఉంది. అది చాలా ప్రముఖమైన కూడలి. ఎంతో రద్దీగా ఉండే కూడలి. నారాయణగూడా ఎం.ఎల్.ఎ. క్వార్టర్స్ నుంచి నేరుగా ముందుకు వస్తే, పోలీస్ కంట్రోల్ రూము, ఇంకాస్త ముందు పబ్లిక్ గార్డెన్స్, పక్కనే శాసనసభా భవనం మొదలైన నగర సమాజ సంస్కృతి ప్రధానమైన ఆనవాళ్ళు కనిపించే ప్రాంతమది. బషీర్‌బాగ్ చౌరస్తా కుడివైపున ‘నర్మదా బార్’అనే నవనవ నాగరక మద్యపాన భాగ్యశీలుర వాంఛిత తీర్థస్థలి ఉంది. ఉందనుకుందాం! ఇప్పుడు దాని ప్రత్యేక ప్రస్తావన ఎందుకు? ఇందుకు! 1972 ప్రాంతం కావచ్చు. ప్రముఖ తెలుగు రచయితల ప్రముఖ రచనలు అమెరికాలో లైబ్రరీ కాంగ్రెస్‌కు, మరి ఇంకొక తొమ్మిది విశ్వవిద్యాలయాలకు సరఫరాచేయడానికి, ముందుగా రచయిత/త్రుల పట్టిక రూపొందించటానికీ ఈ నర్మదాబార్‌లో ఒక సమావేశం, త్రిసభ్య సమావేశం జరిగింది. నికరంగా ఏదీ గుర్తులేదు. అమెరికా లైబ్రరీ కాంగ్రెసు భవన సముదాయం విశాల, విస్తీర్ణ ప్రాంగణం ఒక పెద్ద ఊరు అంత కళ్ళు భ్రమింపచేసే సుందర కట్టడాలతో, సమస్త ఆధునిక సమాచార సేకరణ యాంత్రిక పరికరాలతో, పరిసరాలతో విరాజిల్లుతుంటుంది. ఈ మహాసంస్థ స్థానిక కార్యాలయం ఢిల్లీ నగరంలో నెలకొని ఉంది. ఈ కార్యాలయం ఉన్నతాధికారి ఐసెన్ హోవర్ అనే విద్వాంసుడు చక్రధర్ (చక్రి) అనే తెలుగు భాషాసాహిత్య సంబంధి అనుసంధాన ముఖ్య అధికారి. ఇట్లా తక్కిన భారతీయ భాషల ప్రాతినిధ్య సిబ్బంది అక్కడ ఉండి ఉంటుంది. ఈ ఐసెన్ హోవర్ మహాశయుడు, చక్రధర్ హైదరాబాదు వచ్చి ప్రముఖ సమకాలీన తెలుగు రచయితల పట్టిక రూపొందించటానికి సదరు పైన చెప్పిన నర్మదాబార్‌లో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ పట్టిక రూపొందించటానికి అ.రమాపతిరావు (మంజుశ్రీ) అనే నన్ను ఏకైక అధికార రచయితగా ఆహ్వానించారు. వారు మద్య సేవనంలో ఉండగా నేను పైనాపిల్ జ్యూస్ మాత్రమే అంగీకరించి సంప్రదింపుల ద్వారా ఈ పట్టిక రూపొందించాము. 30, 32 రచయిత(త్రుల) పేర్లు పట్టీకరించాము.
లైబ్రరీ కాంగ్రెస్ గూర్చి మళ్లీ ఇంకోసారి మనవి చేస్తాను. అప్పట్లో నేను ఆఫీసు (తెలుగు అకాడమి)వారు పెడుతున్న కష్టాలలో కంఠ దఘ్నంగా ఉన్నాను. అలవాటైతే కష్టమని మద్య రుచిని పరిహరించాను.

- అక్కిరాజు రమాపతిరావు