Others

భాద్రపదంలో భాగవత సప్తాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సర్వ వేదాంత సారం హి శ్రీ భాగవతమీస్యతే, తద్రసామృత తృప్తస్య నాస్యత్ర స్యాద్రతి క్వచిత్’’. శ్రీమత్ మహాభాగవతం సకల వేదాంత సారం. భాగవత రసామృతాన్ని పానం చేసిన వారికి మరే ఇతరములు రుచించవు. భాగవతం పురాణాలలో ముఖ్య స్థానాన్ని సంతరించుకుంది.
భాగవత సప్తాహ కార్యక్రమాలు సాధారణంగా భాద్రపద శుక్ల సప్తమి నుండి వారం రోజులు నిర్వహించ బడతాయి. ప్రాచీన ఆర్ష విజ్ఞానానికి, సనాతన సాంప్రదాయాలకు పట్టుకొమ్మయై, వేద సంస్కృతీ సభ్యతలకు ఆలవాలమై, పుణ్యభూమిగా వెలుగొందుతున్న భారతావనికి చరిత్రకు అందనంత పూర్వమైన, ఉజ్జ్వల సాంస్కృతిక, వైదిక, తాత్త్విక, పౌరాణిక, ఐతిహాసిక, చారిత్రక వారసత్వం ఉంది. వ్యాస, వాల్మీక, కాళిదాస, కాణాద, పైల, జైమిని, పరాశర, ఆపస్తంభాది మునులు, రుషులు, యోగులు, కర్మిష్ఠులు, పరివ్రాజకుల, ఆధ్యాత్మికుల వారసత్వాన్ని కొనసాగిస్తూ, దేవతా పూజలతో, ఆధ్యాత్మిక, ఆదిభౌతిక కార్యక్రమాలను, అక్షయ నిధులైన పురాణ ప్రవచానాలను వేదభూమి పరిరక్షిస్తూనే ఉంది. దండకారణ్యంలో సూత మహర్షి, శౌనకాది మహా మునులకు వివరించిన సనాతన పురాణ ప్రవచన సాంప్రదాయం తెలుగునేలపై అనాదిగా ఆచరణలో ఉంది. శ్రీమద్భాగవతం హిందూమత సాంప్రదాయాలలో, సాహిత్యంలో, ఆలోచనా విధానంలో ముఖ్యమైన ప్రభావం కలిగిన పురాణం. అష్టాదశ పురాణాలను ప్రస్తావించే దేవీ భాగవతంలోని శ్లోకంలో భాగవతం ఉప పురాణంగా చెప్పబడింది. భగవంతుని, భగవద్భక్తుల కథలుగాను, భక్తియోగాన్ని చాటి చెపుతున్న ప్రాచీన గాధ. భక్తి, జ్ఞాన, వైరాగ్య, తత్వ, ముక్తిలతో కూడుకున్నదే భాగవతం. శమేక మహర్షి కుమారుడైన శృంగి చేత శాపగ్రస్తుడైన పాండవ మధ్యముడైన అర్జునుని మనమడైన పరీక్షిన్మహరాజు, ఏడు దినములలో మరణించడం జరుగుతుందని తెలిసి, తన రాజ్యవిధులన్నీ పక్కనపెట్టి, ప్రతి జీవి అంతిమ లక్ష్యాన్ని తెలుసుకోగోరిన సందర్భంలో, వేదవ్యాస మహర్షి సుతుడైన శ్రీశుక యోగీంద్రుడు ప్రప్రథమంగా భాగవత పురాణం వినిపించిన నేపథ్యం ఉంది. జీవునియొక్క అంతిమ లక్ష్యం...నిత్యసత్యమైన లీలామానస విగ్రహుడు శ్రీకృష్ణుని గురించి తెలుసు కోవడమేనని శ్రీశుకుడు వివరిస్తాడు. భావతంలో వివిధ భాగాలను స్కంధాలు అంటారు. వివిధ స్కంధాలలో విష్ణువు అవతారాలు, కార్యాలు, భక్తుల గాధలు, తత్వ బోధనలు, ఆరాధనా విధానాలు, ఆధ్యాత్మిక సంబంధ సంవాదాలు, భగవంతుని లీలలు, సవివర వర్ణనలతో కూడి ఉన్నాయి. ద్వాదశ స్కంధాలు కలిగిన భాగవతాన్ని పూర్వం పరీక్షిత్తుకు శ్రీశుక యోగీశ్వరుడు వివరించిన నేపథ్యం ఆధారంగా భాద్రపద మాసపూర్వార్ధంలో సప్తాహ రూపేణ వారం రోజుల పాటు ప్రవచించడం, సాంప్రదాయాచరాణాసక్తులైన భక్తులు క్రమం తప్పకుండా శ్రవణం గావించడం శతాబ్దాలుగా కొనసాగుతున్నది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం క్రమానుగతిన విస్తరిస్తున్న క్రమంలో, భాగవతంలో అప్పటి సిద్ధాంతాల ప్రకారం పలు అంశాలు ఇమిడి ఉన్నాయి. 3వ స్కంధం (11వ అధ్యాయం)లో సమయ విభాగం గురించి, సూక్ష్మకాలం పరమాణు ప్రక్రియలకు పట్టే కాల పరిమాణం, స్థూల కాలం విశ్వం వయస్సుగా వివరించ బడింది. అలాగే 9వ స్కంధంలో కకుద్ముడు అనే రాజు తన కుమార్తె రేవతిని బ్రహ్మ లోకానికి తీసుకొని పోయి, కొద్ది సమయం బ్రహ్మను దర్శించి, తిరిగి భూలోకానికి వచ్చే సరికి వేల ఏళ్ళు గతించిన విషయ ప్రస్తావన ఉంది. 3వ స్కంధంలో గర్భస్థ పిండం పెరిగే ప్రక్రియ వర్ణింప బడింది.

- ఎస్. రామకిష్టయ్య