Others

జీవితాన్ని ప్రేమించు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డబ్బును ప్రేమించు కానీ డబ్బుకు దాసోహం కావద్దు. గెలుపుకోసం ప్రయత్నించడంలో తప్పులేదు కానీ దానికోసం అడ్డదారులు తొక్కకు. దానం చెయ్యి కానీ అతిదానం నీ ఆస్తులను హారతి కర్పూరంలో కడిగేటట్లు చేస్తుంది. పొదుపు చెయ్యి కానీ అతిగా పొదుపు నీ వ్యక్తిత్వాన్ని దిగజారుస్తుంది. ఇతరులను నమ్ము కానీ అతిగా నమ్మితే నీ కొంప కొల్లేరు అవుతుంది అని గుర్తుపెట్టుకో.. కొన్ని సందర్భాలలో ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడంలో తప్పులేదు కానీ అతిగా జోక్యం నీకు లేని కష్టాలను కొనితెచ్చిపెడుతుంది అని మరువకు. మంచితనంతో వ్యవహరించడంలో తప్పులేదు, అయితే అతి మంచితనం నీకు మొదటికే మోసం చేస్తుంది అని గుర్తుపెట్టుకో. ఎవరో నీ గురించి మాట్లాడారని, ఏదో అన్నారని బాధపడకు. నీ పనిలో నీవు నిమగ్నం అయితే ఇవేనీ నీ మనస్సును కష్టపెట్టవు. ఎప్పుడూ ఇతరులు చెప్పినది నమ్మకూడదు. నీవు నీ కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తేనే నన్ము. నీ మాటలు కోటలు దాటనివ్వకు. అతి తక్కువగా మాట్లాడటమే నీకు శ్రీరామరక్ష అని తెలుసుకో. ఎక్కువగా పుస్తకాలు చదవడం కంటే ఈ సమాజంలోని మనుషులను చదవడం నేర్చుకో. అప్పుడు నీ బతుకుతెరువుకు ఎలాంటి ఢోకా వుండదు. సాధ్యమైనంత వరకు నీతిగా, నిజాయితీగా బతికేందుకు ప్రయత్నించు. ఎందుకంటే అతి తక్కువ వ్యవధిలో అనంత డబ్బు సంపాదించాలని పక్కదారి పడితే మాత్రం నీకు ఇక్కట్లు తప్పవు. ఏది ఏమైనా ఒక మంచి నడవడికతో, ఉన్నత వ్యక్తిత్వంతో, కఠోర శ్రమే ఆయుధం అన్న నానుడిని ఆధారం చేసుకొని నీ జీవిత రథచక్రాన్ని అత్యంత సమర్థవంతంగా, దిగ్విజయంగా దొర్లిస్తే నీవు ఈ సమాజం, ఈ సమాజంలోని ప్రజలచేత శభాష్ అనిపించుకుంటావు. అలా కాకుండా అక్రమార్గాన వెళ్లి దుర్మార్గులు, దుష్టులతో చేతులు కలిపి వారు నడుస్తున్న చెడుదారిలో నడిచేందుకు ప్రయత్నిస్తే మాత్రం నీ కర్మకు నీవే బాధ్యుడవు అవుతావు అని గుర్తుపెట్టుకో. ఏమైనా చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకునేదానికన్నా ముందే మన చేతుల్ని కాలకుండా చూసుకుంటే చాలు.. మన జీవితంలో మనం అత్యున్నత శిఖరాలు అధిరోహించవచ్చు. తద్వారా మన ఎదుగుదలకు, అభివృద్ధికి ఎలాంటి ఢోకా వుండదు. ఆది అక్షరసత్యం.

-బుగ్గన మధుసూదన్‌రెడ్డి, బేతంచర్ల