Others

మహానటి (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దగా చదువుకోని కుటుంబం నుంచి రంగుల ప్రపంచంలోకి వచ్చి -నటిగా పనికిరావన్న దర్శకులు, అగ్రనటులు, తోటినటులు, నిర్మాతల నోటితోనే.. నీవే ‘మహానటి’వి అనిపించుకున్న గొప్ప కళాకారిణి సావిత్రి. మహానటి టైటిల్‌తో నిర్మించిన ఆమె జీవిత కథా చిత్రం నాకు చాలా ఇష్టం. ప్రతిభ, పట్టుదలతో ‘నట జీవితంలో’ ఎవరెస్టు శిఖరం ఎక్కిన సావిత్రి.. స్వయంకృతమో, విధివంచితమో జీవిత చరమాంకంలో ఒడిదుడుకులకులోనై మరణించిన తీరు కంటనీరు పెట్టిస్తుంది. ఆమెను ఆరాధ్య నటిగా కొలచినవారికి నిరాశ, ఆవేదన మిగులుస్తుంది. ఆమెపై రకరకాల పుస్తకాలు, మాధ్యమాల్లో అనేక కథనాలు వచ్చాయి. అయితే సినిమా మాధ్యమం కోట్ల రూపాయల వ్యయంతో కూడుకున్నది. ఇప్పటికే ఒక తరంవారు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడటం మానుకున్న స్థితి. ఇప్పటి తరం.. పాతతరం నటి సినిమాకు వస్తారన్న నమ్మకం లేదు. అయినా -రెండు తరాలనూ థియేటర్‌కు రప్పించటం సావిత్రి కథ గొప్పతనం. నట జీవితం, నిజ జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ -ముఖ్యమైన ఘట్టాలను మూడు గంటల కథగా మలచడంలో దర్శకుడు నాగ అశ్విన్ ప్రతిభ అద్భుతమే. మహానటి సావిత్రిగా కీర్తిసురేష్ ఆ పాత్రలో ఒదిగిపోయింది. జెమినీ గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ అసాధారణ నటన ప్రదర్శించాడు. సాధారణ జర్నలిస్టు పాత్రలకు సమంత, విజయ్ దేవరకొండ జీవం పోశారు. రాజేంద్రప్రసాద్ కొన్నిసార్లు హాస్యం, మరికొన్నిసార్లు కాఠిన్యం, చివరిలో కరుణ చూపిన తీరు అభినందనీయం. ఆనాటి తరాన్ని గుర్తు చేస్తూ మిగిలిన పాత్రధారులు అద్భుతమైన పెర్ఫార్మెనే్స ఇచ్చారు. సంభాషణలు, సంగీతం, కళ, ఛాయాగ్రహణం అన్నీ ఒక్కటే -అద్భుత సినీరాజం ఆవిష్కృతమైంది. ఇంత సాహసంగా మహానటి చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు అభినందనీయులు. సావిత్రి అభిమానులుగా చూసిన వారందరికీ సంతృప్తినిచ్చిన సినిమా -మహానటి నాకెంతో ఇష్టం.

-ఎస్‌ఎస్ శాస్ర్తీ, విశాఖపట్నం