Others

గడియారం రామకృష్ణశర్మగారి శతజయంతి నిర్వహించాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘శతపత్ర’ రచయితకు శత జయంతి ఏది?’’ శీర్షికన ఆంధ్రభూమి ‘సాహితి’లో పెద్దలు డా.అక్కిరాజు రమాపతిరావుగారు వ్యాసం రాశారు. డా.గడియారం రామకృష్ణశర్మగారి బహుముఖమైన, అసాధారణమైన కృషిని గురించి వివరించారు. ఆంధ్ర (నేటి తెలంగాణ) సారస్వత పరిషత్తు నిర్మాతల్లో శర్మగారు ప్రథమగణ్యులని తెలియజేశారు. చాల సంతోషం. గడియారంవారి శత జయంతి ఏది? అని ప్రశ్నార్ధక శీర్షికపెట్టారు. తెలంగాణ సారస్వత పరిషత్తు గడియారంవారి సేవలను ఏనాడూ విస్మరించలేదు. స్వర్ణోత్సవంలో వారిని వేదిక మీద అధిష్ఠింపజేసి నాటి భారత ప్రధాని పి.వి.నరసింహారావుగారి చేతుల మీదుగా సత్కరించుకుని యధోచితంగా కొంత నగదును కూడా సమర్పించుకుంది. గత సంవత్సరం శర్మగారి శత జయంతిని ఘనంగా జరుపుకున్న సంగతి పత్రికలు ప్రముఖంగా ప్రచురించిన విషయం గుర్తుచేస్తున్నాం. 2018 మార్చి 6న పరిషత్తులో వారి శత జయంత్యుత్సవాలను ప్రారంభించాము. వారి కార్యక్షేత్రమైన మహబూబ్‌నగర్‌లో కూడా శత జయంతి ఉత్సవాన్ని నిర్వహించాము. 2019 మార్చి 6న హైదరాబాద్‌లో ఘనంగా శత జయంతి సమాపనోత్సవం ఏర్పాటుచేశాం. ఆ సందర్భంగా పరిషత్తు చొరవతో ప్రధాన దినపత్రికల్లో రామకృష్ణశర్మగారి సేవలను ప్రస్తావించి వారు తెలంగాణ అభ్యుదయంలో నిర్వహించిన వైతాళిక పాత్రను సవివరంగా పేర్కొంటూ వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ఆరోజు వారి ‘పాంచజన్యము’ కృతిని పునర్ముద్రించి ఆవిష్కరించడం జరిగింది. వ్యవసాయ శాఖామాత్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణ, పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, సాహితీవేత్తలు డా.శ్రీరంగాచార్య, గన్నమరాజు గిరిజామనోహరబాబు మొదలైనవారు పాల్గొన్నారు. కినె్నర ఆర్ట్ థియేటర్స్ మద్దాళి రఘురామ్‌గారు కూడా మార్చి 7న గడియారం రామకృష్ణశర్మగారి శత జయంత్యుత్సవం నిర్వహించారు.
- డా. జె. చెన్నయ్య
ప్రధాన కార్యదర్శి, తెలంగాణ సారస్వత పరిషత్తు