Others

బాబోయ్.. కాస్మొటిక్స్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరిలా రియా (పేరు మార్చాం) కూడా పెళ్లి రోజు అప్సరసలా కనిపించాలనుకుంది. కానీ ఆమె జీవితంలో ఆ రోజే ఆమె అంత వికృతంగా కనిపించింది. ఆమె శ్రీలంకలోని కొలంబోలో నివసిస్తోంది. దక్షిణాసియాలో చాలామందిలానే తను కూడా పెళ్లికి ముందు తన చర్మ రంగును కాస్త అందంగా, మెరిసేలా చేసుకోవాలనుకుంది. పెళ్లికి రెండు నెలల ముందు సెలూన్‌కు వెళ్లింది. చర్మం తెల్లగా కావడానికి ఆమెకు ఒక క్రీమ్ ఇచ్చారు సెలూన్‌వారు. ఒక వారం రోజులు వాడగానే ముఖానికి బ్లీచ్ చేసినట్లుగా కనిపించిందట. చర్మం తెల్లగా అవుతుందనుకుందామె. కానీ పోనుపోను అది కాలిపోయినట్లుగా కనిపించింది. తరువాత ఆమె పాడైన చర్మానికి చికిత్స చేయించుకోవడానికి చాలా సమయం, డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. సెలూన్‌లో రియాకు ఇచ్చిన క్రీమ్.. శ్రీలంకలో అధీకృత అనుమతులు ఉన్న ఉత్పత్తులు కాదు.. అవి చట్టవ్యతిరేకమైనవి.. బ్లాక్ మార్కెట్లలో అమ్ముతున్నారు, కొంటున్నారు.. సంవత్సరంగా చికిత్స తీసుకుంటున్నా కూడా రియా మెడపై ఇప్పటికీ ఇంకా నల్లటి చారలు కనిపిస్తున్నాయి.
రియాలా చాలామంది చర్మ రంగును తెల్లబరచుకోవడటానికి చేసే ప్రయత్నం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆసియా, ఆఫ్రికాలో కోట్లాది మంది.. ముఖ్యంగా మహిళలు చర్మం రంగును తెల్లగా చేసుకోవటం కోసం విపరీతమైన చర్యలకు సిద్ధపడుతున్నారు. మార్కెట్ అంచనాల ప్రకారం 2027 నాటికి ఈ కాస్మొటిక్స్ వ్యాపారం రెట్టింపై 890 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. ఆసియా, ఆఫ్రికాల్లో మధ్యతరగతి వర్గాల వారి నుంచే ప్రధానంగా డిమాండ్ ఉంది. సోప్‌లు, క్రీమ్‌లు, స్క్రబ్‌లు, టాబ్లెట్లే కాదు.. చర్మానికి ముదురు రంగునిచ్చే మెలనిన్ పిగ్‌మెంట్ల ఉత్పత్తిని నెమ్మదింపజేసే ఇంజెక్షన్లు కూడా ఈ ఉత్పత్తుల్లో ఉన్నాయి. భారతదేశంలో 61 శాతం మహిళలు, చైనాలో 40 శాతం మంది మహిళలు వీటిని ఉపయోగిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి.
చర్మ సౌందర్య సాధనాల్లో క్రీములు, మాత్రలు, ఇంజెక్షన్లు కూడా ఉన్నాయి. కాస్మొటిక్స్‌కు డిమాండ్ పెరుగుతున్న కొద్దీ సమస్యలు కూడా పెరుగుతున్నాయి.
ఘనాలో తమకు పుట్టే పిల్లలు తెల్లగా పుట్టడానికి మెలనిన్‌ను తగ్గించే ఓ మాత్రను వాడతారట. గర్భిణులు చర్మ రంగును పలుచబరిచే ఆ మాత్రను తీసుకోవద్దని ఘనా అధికారులు గత సంవత్సరం హెచ్చరించారు. ఆ మాత్రలో ఆంటాక్సిడెంట్ గ్లుటాథియోన్ అనే పదార్థం ఉంది. గర్భంలోని పిల్లల చర్మపు రంగును ఈ మాత్రలు కాస్త తెల్లగా చేస్తాయన్న ఆశతో ఆ దేశ మహిళలు ఈ మాత్రను తీసుకుంటున్నారు. ఇటువంటి ఉత్పత్తులపై దక్షిణాఫ్రికాలో కొన్ని కఠినమైన చట్టాలున్నాయి.
శరీరంలో అక్కడక్కడా నల్లమచ్చలు ఉంటే.. చర్మ నిపుణుడి పర్యవేక్షణలో హైడ్రో క్వినోన్ ఆధారిత క్రీములను సురక్షితంగా వాడొచ్చునని బ్రిటీష్ స్కిన్ ఫౌండేషన్ చెబుతోంది. చర్మ రంగును తేలికచేసే కొన్ని క్రీములు ఉపయోగపడవచ్చనని డాక్టర్ చెప్పనిదే వాడితే అవి ప్రమాదకరం కావచ్చునని బ్రిటిష్ స్కిన్ ఫౌండేషన్ అధికార ప్రతినిధి ఆంటన్ అలెక్జాండ్రాఫ్ చెబుతున్నారు. అయితే చర్మపు రంగును తెల్లగా చేసుకోవడానికి గుర్తింపు పొందిన సురక్షితమైన పద్ధతంటూ ఏదీ లేదు అని కూడా ఆయన స్పష్టం చేశారు. దుకాణాల్లో కొనుక్కునే క్రీములు పనిచేస్తాయనేందుకు ఆధారాల్లేవీ లేవు. పైగా అవి ప్రతికూల ప్రభావం చూపవచ్చు. చర్మం అసహజంగా, తెల్లగా కావచ్చు. లేదా చర్మం దాని సహజగుణాలను కోల్పోవచ్చు అని హెచ్చరిస్తున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు.
చర్మ సౌందర్య సాధనాలను చర్మ నిపుణుల పర్యవేక్షణలో వాడాలని పరిశోధకులు సూచిస్తున్నారు. మెలాస్మా వంటి కొన్ని పరిస్థితుల్లో చర్మపు రంగును తేలిక చేసే ఉత్పత్తులను డాక్టర్లు సిఫారసు చేస్తుంటారు. సాధారణంగా పెద్దల్లో ముఖంపై గోధుమరంగు లేదా ఊదారంగు మచ్చలు ఏర్పడుతుంటాయి. ఇది మామూలు చర్మవ్యాధి. ఇది మహిళల్లో, ముఖ్యంగా గర్భధారణ సమయంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో చర్మ నిపుణుడి సాయంతో చర్మపు రంగును పూర్వస్థితికి తీసుకురావచ్చు. అనుమతి ఉన్న కొన్ని క్రీములను డాక్టర్లు ఉపయోగిస్తారు. వీటి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ప్రకృతిలో దొరికే సౌందర్య సాధనాలను, లేపనాలను ఉపయోగించడం వల్ల చర్మానికి ఎటువంటి హాని జరగదని డాక్టర్లు చెబుతున్నారు. వేల సంవత్సరాలుగా పెద్దవాళ్లు రకరకాల నూనెలను చర్మ సంరక్షణకు ఉపయోగిస్తున్నారు. అలాగే ప్రకృతిలో దొరికే రకరకాల మొక్కలు, పండ్లు వంటివాటిని కూడా చర్మ సంరక్షణకు ఉపయోగించడం వల్ల చర్మానికి హాని జరగదు. కాబట్టి పెళ్లనో, మరేదో శుభకార్యమని ఇన్‌స్టెంట్ అందం కోసం రకరకాల కాస్మొటిక్స్ ఉపయోగించడం వల్ల నష్టమే తప్ప లాభమనేది ఉండదు. వీటి బదులు సహజ సిద్ధమైన ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల చర్మానికి మేలు జరిగి అందం కూడా రెట్టింపు అవుతుంది.