Others

పద్మనాభుని కథలోని మర్మం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తులు ఆచరించాల్సిన వ్రతాలు, నోములు అని పూర్వీకులు ఎన్నింటినో సంప్రదాయంలో చొప్పించారు. వ్రతాలు,నోముల్లాంటివి అయితే అందులో ఆ వ్రతాన్నికానీ , నోమును కానీ ఎవరు ఎందుకు ఏ సమయంలో చేశారో దానివల్ల వారు పొందిన ఫలం ఏమిటో కూడా చెప్తుంటారు.
ఆచారాలు, విధుల్లాంటివాటిలో ఏవిధమైన నిగూఢరహస్యాలు ఉంటాయో అట్లానే ఈ వ్రతాలు నోముల్లో కూడా అంతర్లీనమైన రహస్యార్థాలు ఉంటాయి. వ్రతం చేసేవారు కానీ, నోము నోచుకునేవారు కానీ ఆ నిగూఢమైన అర్థాలను తెలుసుకొని ఆ వ్రతాన్ని ఆచరిస్తే పూర్ణ ఫలాన్ని పొందే అవకాశం ఉంటుంది. అట్లాంటి నిగూఢమైన రహస్యాలున్న వ్రతాల్లో ముఖ్యమైందీ అనంత పద్మనాభ వ్రతం.
అనంతుడన్న పేరులోనే ఎంతో అర్థాలున్నాయి. పరమాత్మ సృష్టించిన ఈ సృష్టిలో ఆయనకు తనమన భేదాలు లేవు. ఎవరి కర్మానుసారంగా ఫలాలు వస్తాయో వాటిని వారికి అందచేస్తూ ఉంటాడు. పుణ్యకార్యాలు చేసినట్లయితే సుఖాలను, పాపకార్యాలను చేసినట్లయితే దుఃఖాన్ని కలిగిస్తుంటాడు.
పరాత్పరుడే ద్వాపరంలో కృష్ణుడిగా జన్మించినపుడు నరుడైన అర్జునుడిని నెపంగా పెట్టుకొని నేను భగవంతుడిని అని చెప్పుతూ మనుజులు ఏవిధంగా జీవించాలో గీతాబోధ చేశాడు. మనుష్యుడు కర్తకర్మక్రియ అన్నీ నేను అని నమ్మి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే వారి యోగక్షేమాలను నేను చూస్తాను అని కూడా హామీ ఇచ్చాడు. ప్రతి పనినీ ఈశ్వరార్పణం చేసి చేయండి. శుభాశుభాలను భగవంతుడే చూసుకొంటాడు అని మన పెద్దలు చెప్పడంలోని ఆంతర్యం కూడా ఇదే.
అట్లానే ఈ అనంత పద్మనాభ వ్రతంలోని కౌండన్యుడు విధివశాత్తుఓ సారి తన భార్య చేతికి ఉన్న తోరాన్ని చూసి తనను వశం చేసుకోవడానికి కట్టుకున్న దారంగా పొరపాటు పడి ఆ తోరాన్ని అగ్నిజ్వాలలకు అర్పిస్తాడు. అప్పట్నుంచి అనేక దారిద్య్రబాధలను అనుభవిస్తాడు.ఎన్నో కష్టనష్టాలనుకూడా అనుభవిస్తాడు.
తిరిగి కాలప్రభావం వల్లనే కౌండిన్యునికి అనంతుడిని చూడాలన్న ధ్యాస కలుగుతుంది. ఆ పరమేశ్వరుడిని అనంతనామధేయుడ్ని చూడాలని అట్లా నడుచుకుంటూ వెళ్లిపోతాడు. దారిలో ఆయనకు రెండు నదులు ఒకదానిలో మరొకటి పారుతూ కనిపిస్తాయి. ఆ పారడం కూడా చెలియలికట్టలోపులే ఉంటున్నట్టుకూడా చూస్తాడు. స్వచ్ఛమైన నీటిని కలిగి ఉన్న ఆ నదుల్లోని నీటిని మాత్రం మనుష్యులుకానీ, పశువులు కానీ తాకకుండడమూ చూస్తాడు. ఆశ్చర్యపోతాడు. అట్లానే మొలలోతు గడ్డిలో నుంచున్న ఎద్దునుచూస్తాడు. ఆ ఎద్దు ఆకలితో అల్లాడిపోతున్నా మెడవంచి ఆ గడ్డిని అందుకోలేకపోవడాన్ని కౌండిన్యుడు గమనిస్తాడు. మరోచోట ఏనుగును, ఎడారిలో విరగకాచిన మామిడిచెట్టును కూడా చూస్తాడు. అనంతుడిని మీలో ఎవరన్నా చూశారా అని అడుగుతూ వెళ్తున్న కౌండిన్యుడు ఈవింత దృశ్యాలను కూడా అడుగుతాడు. ఎద్దు, ఏనుగు, నదులు, మామిడిచెట్టు మొదలైనవి కూడా అనంతుడిని చూడలేదని చెప్తాయి. పైగా నీవు ఎందుకు అనంతుడిని వెదుకుతున్నావు అని అడుగుతాయి.దానికి కౌండిన్యుడు- తన దారిద్య్రావస్థకు కారణమేమిటో అనంతుడిని అడిగి తెలుసుకోవడానికి వెళ్తున్నట్టు వారితో చెప్తాడు. అపుడు ఆ కనబడిన వింత పశువులు, మామిడి చెట్టు, నదులు ఇవి కూడా తమ దురవస్థకు కారణమేమిటో కూడా కనుక్కొని వాటిని దూరం చేసుకోవడానికి ఏం చేయాలో కూడా చెప్పుమని కోరుతాయి.
అట్లా వాటి బాధలకు కారణాన్ని కనుక్కొని వస్తానని వెళ్లిన కౌండిన్యుడు చివరకు అనంతుడిని ప్రసన్నం చేసుకొంటాడు. తన బాధలను కారణాన్ని విని తన తప్పును క్షమించమని అడుగుతాడు. అనంతుని కృపను కౌండన్యుడు పొందుతాడు. ఆ తరువాత తాను చూసిన వింతలను అనంతుడికి చెప్పిన వాటికి కారణాలేమిటని అడిగినపుడు అనంతుడు అసలు విషయాన్ని కౌండిన్యుడికి చెప్తాడు. ఈ అసలు విషయమే కథలోని అంతరార్థంగా గ్రహించాలి. ఏ నోములేక వ్రతంలోనైనా సరే పేరంటాళ్లకు పండు తాంబూలం ఇవ్వమని చెప్తారు. అట్లా ఇవ్వడం వల్ల వీరికి శుభం కలుగుతుంది. అంటే అది ఇతరులకు ఉపయోగపడితే అపుడు ఆ కార్యం వల్ల శుభం జరుగుతుంది. కానీ ఆ పండుతాంబూలాలను ఒకే ఇంట్లో ఉండే తోడికోడళ్లు కానీ, తల్లికూతుర్లు కానీ ఇచ్చుకుంటే ఏమి లాభం జరిగింది. ఎవరికి మంచి జరిగింది. వారిది వారే తిన్నట్టు కదా. అంటే ఇద్దరు అన్నదమ్ములు కూర్చుని ఒకరి కంచంలోని అన్నం మరొకరికి ఇచ్చుకుంటే వారు చేసామనుకొన్న మంచి పని వారిద్దరి మధ్యే ఉంటుంది కానీ మూడవ వారికి ఏమి కలుగదుకదా. అందుకే క్రితం జన్మలో తల్లీకూతుర్లు పండుతాంబూలాలు ఇచ్చి పుచ్చుకోవడం వల్ల ఒక నదిలోనీరు మరొకనదిలోకి పారుతాయి కానీ అవి ఎవరికీ ఉపయోగపడవన్నమాట.
అట్లానే సర్వ విద్యలు వచ్చునన్న గర్వంతో మిడిసిపడుతూ ఆ విద్యల వల్ల ఉపయోగాన్ని తాను మాత్రమే అనుభవిస్తూ, ఆ విద్యలను కనీసం ఎవరికీ నేర్పివ్వక పోవడం వల్ల ఈ జన్మలో విరగకాచిన మామిడి చెట్టు అయినా ఇతరులకు ఉపయోగపడలేకపోయాడు. దీనివల్ల మనకు వచ్చిన విద్య ఐనా సరే ఇతరులకు దాని ఫలాలను అందివ్వాలన్న అంతరార్థం ఇందులో కనబడుతుంది. మొలలోతు గడ్డిలో నుంచున్నా గడ్డితినలేక పోవడానికి కారణం క్రితం జన్మలో ధనవంతుడు అయి ఉండికూడా ఇతరులకు చిల్లిగవ్వను ఇవ్వలేకపోవడంతో ఈ జన్మలో తినడానికి ఎదురుగా ఉన్నా తినలేకపోవడం జరిగింది.ఇలా కౌండిన్యుడు అడిగిన వాటికన్నింటికీ అనంతుడు జవాబులు చెప్తాడు.
అందుకే ఏ పని చేసినా అది చిన్నదైనా, పెద్దదైనా దాని మంచి ఫలాలు నలుగురికీ ఉపయోగపడేలా ఉండాలన్న వివేచనతో చేయాలన్నదే ఈ అనంత పద్మనాభుని కథలోని అంతరార్థం. ఇది తెలుసుకొన్న మనుజులెప్పుడూ సొంతలాభం కొంతమానుకొని పొరుగువారికి తోడుపడమనే పెద్దల మాట ఆచరిస్తారు కదా.

- చరణశ్రీ