Others

మనో వికాసానికి మార్గం భక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రవణం, స్మరణం, కీర్తనం, దాస్యం, ఆత్మనివేదనం ఇలాంటి తొమ్మిది రకాల భక్తిమార్గాలు ఉన్నాయ. ఈ మార్గాల్లో ఏ మార్గాన్ని అనుసరించి మనిషి తనలో భక్తి భావాన్ని పెంపొందించుకున్నా ఆ మనిషిలో ఆ భక్తే అతనిలో మానసిక వికాసాన్ని కలిగిస్తుంది. అహంకారం లాంటి దుర్గుణాలను దూరం చేస్తుంది.తననే నాశనం చేసే కోపా న్ని దరిచేరనివ్వకుండా చూస్తుంది. మనిషిని కాల్చేసే మాత్సర్యాన్ని ఆమడ దూరాన పెడుతుంది.
ఎదుటివారిలో కూడా భగవంతుని అంశ ఉందని తెలుసుకొంటారు. సాటి మనుష్యులను భగవంతుని రూపుగా భావిస్తారు. దీనివల్ల వారిలో ఐక్యతాభావం పెరుగుతుంది. సోదరభావం కలుగుతుంది. ఇతరులకు సాయం చేయాలన్న ఆలోచనలు కలుగుతాయి. స్వార్థం విడనాడుతుంది.
భగవంతునికి పూజ చేసి ఆయన సమర్పించిన ఆహారాన్ని ప్రసాదంగా భావిస్తారు కనుక ఆ ప్రసాదాన్ని ఇతరులకు పంచితే భగవంతుడు మెచ్చుకుంటాడన్న భావనలో ఉన్నదానిలో కొంత ఇతరులకు పెట్టడం అలవర్చుకుంటారు.
భగవంతుని పూజ చేయాలన్న సంకల్పంతో శారీరిక శుభ్రతకు ప్రాధాన్యతను ఇస్తారు. పరిసరాల శుభ్రతను కూడా పాటిస్తారు. సాంబ్రాణీలు, మంచి సువాసనలు కలిగిన అగరుబత్తీలు వెలిగించడం వల్ల ఇల్లంతా కూడా మంచి వాసన నిండి ఉంటుంది. కొన్ని రకాల వాసనలు మనిషిని ఉత్తేజితుడిని చేసి మంచిపనులు చేయడానికి ప్రేరణనిస్తాయని శాస్త్రాలు కూడా చెబుతాయి. కనుక ఇటువంటి వాతావరణంలో ఉన్న వ్యక్తి మానసికోల్లాసం కలిగి ఉంటాడు. దానితో ఎన్నో మంచి కార్యాలు చేయగల్గుతాడు. అంతేకాక భక్తుడు పాటించే శుభ్రత వల్ల అతనికి రోగాదులకు దూరం చేయడానికి ఆస్కారం కల్గిస్తుంది. మనసులో కూడా ఎటువంటి కల్మషాలు పెట్టుకోకుండా ఉండడం వల్ల మానసికారోగ్యం కలిగి ఉంటారు. దానివల్ల అనుకొన్న పనులు సాఫీగా చేయగల్గుతారు. మనిషి లోపల, వెలుపల పరిశుభ్రమైన ప్రశాంతమైన వాతావరణాన్ని కల్గి ఉండడం వల్ల మనిషిలో అంతర్లీనంగా, నిగూఢం గా ఉన్న శక్తులు కూడా బహిర్గతం అవుతాయ.
అంతా మనది. అంతానాకే నాకే అన్న స్వార్థాన్ని దరిదాపులకు కూడా రానివ్వరు. అంతా భగవంతుడిది. ఆయన ఆడించినట్టు నేను చేస్తున్నాను అన్నధోరణిలో ఉండి భగవంతుడు మెచ్చుకోవాలన్న ఆలోచనతో ఇతరుల పట్ల సమానత్వాన్ని, మర్యాదను, సానుకూల ధోరణిని కలిగిఉంటారు.
అంతేకాక ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని కలిగి ఉంటారు. భగవంతుడిని కీర్తించాలన్న ధ్యాసతో మహామహులు పాడిన పాటలను పొద్దున, సాయంత్రాలు వింటూ ఉంటారు. గొప్పవారి ప్రవచనాలను వినడం వంటివి చేస్తుంటారు. దానివల్ల కూడా మానసిక వికాసం కలుగుతుంది. మనిషి మంచితనము, మానవత్వంతో నిండి దివ్యత్వానికి దగ్గర అవుతాడు. భక్తి లేనివారు భోగ లాలసతో ప్రకృతిని నాశనమొనరుస్తే భక్తితత్పరుడు ప్రకృతిని కూడా భగవంతునిరూపుగా భావించి ఆరాధిస్తాడు. దానివల్ల నదీనదాలు జీవనదులై సదా నీటిని పుష్కలంగా ప్రాణులకు అందిస్తాయి. స్వచ్ఛమైన గాలిని మనిషికిప్రకృతి అందిస్తుంది. ప్రతి చెట్టును భగవంతుని రూపుగా భావించడం వల్ల ఆ చెట్టులోని ఔషధీగుణాలను ఒక్కోసారి తనకు తెలియకుండాకూడా గ్రహిస్తాడు. జ్ఞాన భక్తి మనిషిలో ఉన్నందువల్ల చెట్టు,పుట్ట, కొండ,కోన ఇలా వేటినైనా ఆరాధించాలనే బుద్ధి వల్ల వాటి వల్ల వచ్చే ప్రయోజనాలు సులభంగా అందుకోగలుగుతాడు.్భగవంతుడిని చూడాలన్న తలంపులో ఓంకారాభ్యాసాన్ని చేసి అమోఘమైన అమూల్యమైన ఆవిష్కరణలు కూడా చేస్తాడు.
ఏది ఏమైనా భక్తి వల్ల మనిషి పురోగతినే సాధిస్తాడు. కనుక ప్రతివారిలోను వారికిష్టమైన దేవీదేవతలు ఆరాధించడం, వారిని ప్రత్యక్షంగా చూడాలన్న ధ్యాస కలిగి ఉండడమూ చాలా మంచివిషయం.

-చివుకుల రామమోహన్