Others

అందమైన లోగిలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందమైన ఇంటిని మనం చూడగానే పదే పదే చూడాలనిపిస్తుంది. అందుకు కారణం ఆ ఇల్లాలి స్వయంకృషి. ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు పెద్దలు. ఇల్లు ఎలావున్నా పర్వాలేదు వున్నంతలో చక్కగా తీర్చిదిద్దుకోవడంలో వుంది. ఇంటి ఇల్లాలు ఎంతో ఓపికతో ఇల్లు శుభ్రంచేసి చక్కగా వుంచుకుని అందరి ప్రశంసలు పొందడం అదృష్టమేనని చెప్పాలి.
అందమైన ఇల్లు అతివలకు సౌభాగ్యం చేకూరుస్తాయి. సొంత ఇంటి కల నెరవేరినవారు తమతమ ఇళ్లను మరింత అందంగా ముస్తాబు చేసుకోవాలి. ఇల్లు అందంగా వుంచుకోవడంలో మహిళలకు పెట్టింది పేరు. పక్కింటావిడ ఇల్లుచూసి, ఎదురింటావిడ. ఆ వీధిలోని అందమైన భవనాలు చూసి చాలామంది అసూయపడడం మనకు తెలిసినదే.
చిన్న ఇల్లు చింతలు లేని కుటుంబం అంటారు. చక్కగా అందంగా ఆకర్షించేలా వుంచుకుంటే పెద్ద ఇల్లు అయినాసరే ఎంతో చూడముచ్చటగా వుంటాయి. ఇంటిని అందంగా వుంచుకోవడం కూడా ఒక కళే. మన ఇల్లు మన కుటుంబం ఇతరులకు ఆదర్శంగా వుండాలి. అందుకే ఇల్లు కళకళలాడుతూ వుంటే ఆ కుటుంబం ఆనందంగా నిత్యం ఆహ్లాదంగా వుంటారు.
కొందరి ఇల్లుచూస్తే పైకి బావుంటాయి. లోపల చిందరవందర గందరగోళంగా వుంటుంది. ఎందుకంటే ఏ వస్తువు ఎక్కడ వుంచాలో తెలియక గజిబిజిగా తయారుచేస్తారు. ఎక్కడి చెత్త అక్కడే. చిన్న పిల్లలు మారాం చేసేవారు అధికంగా వుంటే అంతే సంగతి ఇల్లు పీకి పందిరి వేస్తారు. అలాంటప్పుడు ఇంటి ఇల్లాలు చొరవ తీసుకుని ఓర్పుతో అందంగా సర్దుకోవాలి.
‘గృహమేకదా స్వర్గసీమ’ అన్నట్లు ఇంటిని అందంగా అలంకరించుకోవడం గృహిణికి అలవాటై వుండాలి. కొందరి ఇల్లుచూస్తే ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా వుంటుంది. మళ్లీమళ్లీ చూడాలనిపించేలా వుంటాయి. ఇంటి ఎదురుగా అందమైన గార్డెన్ సౌకర్యం అద్భుతం అనిపించేలా వుండాలి. ఆ గార్డెన్‌లో రకరకాల పూలమొక్కలు పెంచాలి. అప్పుడు మీ ఇల్లు మరింత సౌభాగ్యంగా వుంటుంది.
కవుల కల్పనలలో అందమైన ఇల్లు మనోహరంగా వర్ణించే రీతిలో ప్రస్తుతం అందమైన భవంతులు నిర్మించుకోవడంలో రకరకాల డిజైన్లు మనకు నెట్‌లో నిత్యం లభ్యమవుతాయి. రంగుల హరివిల్లులా గృహం నిర్మించుకోవచ్చును. ఇల్లాలి కలల పంట ఇల్లు, కుటుంబం మధుర మనోహరం వుండాలి. కళకళలాడే ఇంటి సౌభాగ్యం తెలుగింట సుమనోహరంగా విలసిల్లాలి. అందుకు భార్యాభర్తలు ఇరువురూ సహకరించాలి.

- ఎల్. ప్రపుల్లచంద్ర 88865 74370