Others

ఈనాడే బాబూ.. (నాకు నచ్చిన పాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈనాడే బాబూ నీ పుట్టినరోజు
ఈ ఇంటికే కొత్త వెలుగు వచ్చినరోజు
ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత రాఘవ నిర్మించిన ‘తాత-మనవడు’ చిత్రంలోనిది ఈ పాట. మనవడి (రాజబాబు) బాల్యంలో పుట్టినరోజు సందర్భంగా నానమ్మ (అంజలీదేవి) మనవడిని ఆశీర్వదిస్తూ పాట పాడే సన్నివేశం.
తండ్రి మాటకై కానకు తరలిపోయె రాఘవుడు
అందుకే ఆ మానవుడు అయినాడు దేవుడూ
తల్లిని చెర విడిపింపగ తలపడె ఆ గరుడుడూ
అందుకే ఆ పక్షీంద్రుడు అంతటి మహనీయుడూ
అనే చరణంలో తల్లిదండ్రుల పట్ల కొడుకుల బాధ్యతలను గుర్తుచేస్తూ సరళమైన భాషలో సి.నారాయణరెడ్డిగారు మనస్సులో గుర్తుండిపోయేలా పాటను రచించారు.
కన్నవారి కలలు తెలుసుకోవాలి
ఆ కలల కంట నీరు పెడితె తుడవాలి
తనకుతాను సుఖపడితే తప్పుకాకున్నా
తనవారిని సుఖపెడితే ధన్యత ఓ నాన్నా
బిడ్డలనుండి తల్లిదండ్రులు ఏవిధమైన ఓదార్పును ఆశిస్తుంటారో తెలియజేస్తుంది ఈ చరణం. రమేష్‌నాయుడుగారు తన సంగీత ప్రతిభతో పాటకు జీవంపోశారు. సుశీలమ్మగారు ఎంతో హృద్యంగా ఆలపించిన ఈ పాటను వింటుంటే హృదయాంతరాళాలలోనుండి భావోద్వేగం పెల్లుబికి ఒక విధమైన అనుభూతికి ప్రేక్షకుడు లోనౌతాడు అనడంలో సందేహం లేదు. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వ ప్రతిభతో రూపుదిద్దుకున్న తాత-మనవడు చిత్రంలోని ఈ పాట కుటుంబ సంబంధ బాంధవ్యాలను గుర్తుచేస్తూ హృదయాలను స్పృజిస్తుంది అంటే అతిశయోక్తికాదు. అందుకే ఈ పాట నాకు ఎంతో ఇష్టం.

-పి.సిహెచ్.కోటయ్య, అద్దంకి