Others

కృత్రిమ మేధ జపం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృత్రిమ మేధ (ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్), క్లౌడ్ కంప్యూటింగ్‌పై దేశవ్యాప్తంగా ప్రభుత్వ అధికారులకు, ఐటీ విభాగాల అధిపతులకు మైక్రోసాఫ్ట్ ఇండియా ఓ శిక్షణ కార్యక్రమాన్ని ఇటీవల ముంబయిలో ప్రారంభించింది. ‘గవర్నెన్స్ టెక్ సమ్మిట్-19’ పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం ఐదువేల మంది అధికారులకు శిక్షణ ఇస్తారు. సంవత్సరం పాటు ఈ శిక్షణ కొనసాగనున్నది. సమర్ధవంతమైన పాలన అందించేందుకు కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్ ఎలా ఉపకరిస్తాయో, ఎలా అన్వయించుకోవచ్చో అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. పాలనలో ఆధునిక టెక్నాలజీ పాత్ర గణనీయంగా ఉండగలదని భావిస్తున్నారు. అందుకనుగుణంగా సంస్కరణలు-మార్పులు తీసుకొస్తున్నారు. సమ్మిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్-ఇండియా అధ్యక్షుడు అనంత్ మహేశ్వరి, నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో మరో కార్యక్రమాన్ని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సంస్థతో మైక్రోసాఫ్ట్ నిర్వహించింది. దాదాపు ఇదే ‘కానె్సప్ట్’తో దీన్ని ప్రారంభించారు. అన్ని వర్గాలకు, అన్ని కార్యాలయాలకు ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ ఎంత కీలకమో దీనివల్ల అవగతమవుతుంది. సైబర్ రక్షణ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం సైబర్ సైన్యాన్ని సిద్ధం చేస్తోంది. ఇప్పటికే చాలామంది ‘సైనికులు’ ఇందుకోసం పనిచేస్తున్నారు. వీరి సంఖ్యను ఇంకా పెంచుతున్నామని తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఇటీవల వెల్లడించారు.
ఎప్పటికప్పుడు సరికొత్త సవాళ్ళు ఎదురవుతున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కొని పరిష్కరించేందుకు ఈ సైనికులు విశేషంగా పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. వీరంతా సైబర్ సెక్యూరిటీ కోర్సులు చేశారని, వీరికి లోతైన అవగాహన ఉందని, మరికొంత శిక్షణ అందించి వీరిని రంగంలోకి దింపుతున్నామని ఆయన పేర్కొన్నారు. జెఎన్‌టియు ఇంజినీరింగ్ విద్యార్థులకు సైబర్ సెక్యూరిటీ పాఠ్యాంశం తప్పనిసరి చేశారని, ఆ రకంగా వారి విద్య పూర్తయ్యాక సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన కీలకాంశాలను తెలుసుకుని, సమస్యను పరిష్కరించేందుకు అవకాశముంటుందని చెప్పారు.
సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ‘స్టార్టప్’లకు తెలంగాణ ప్రభుత్వం తరఫున మద్దతు అందిస్తామని కూడా జయేశ్ రంజన్ చెప్పారు. ఇప్పటివరకు రెండు డజన్ల స్టార్టప్ సంస్థలు ప్రభుత్వం నుంచి అదనపు మద్దతును పొందాయని ఆయన తెలిపారు. ఇక ఈ సంవత్సరం నుంచి సిబిఎస్‌ఈ సెలబస్‌గల విద్యాసంస్థల్లో తొమ్మిదవ తరగతి నుంచి కృత్రిమ మేధ (ఏఐ) పాఠ్యాంశాన్ని ప్రవేశపెడుతున్నారు. దీన్ని ఐచ్ఛికాంశంగా అమలుజరపనున్నారు. తొమ్మిదో తరగతిలో ఐచ్ఛికాంశంగా ఏఐని తీసుకుంటే పదవ తరగతిలోనూ దాన్ని తీసుకోవాలి. ఆ రకంగా కృత్రిమ మేధ విశిష్టత- ఆవశ్యకత- ప్రాధాన్యత వంటివి పాఠశాల వయసులోనే విద్యార్థులకు తెలుస్తాయి. మిగతా పాఠశాలల్లోనూ డిజిటల్ తరగతులు కొనసాగుతున్నాయి. కంప్యూటర్ అక్షరాస్యత క్రమంగా పెరుగుతోంది. ఇంటర్నెట్ అందుబాటులోకొచ్చాక విద్యార్థుల్లో ఐటీ పరిజ్ఞానం విస్తృతమవుతోంది.
వన్ ప్లస్...
‘టెక్నాలజీ ప్లస్’ (ఉన్నతీకరించిన సాంకేతిక పరిజ్ఞానం)కు మారుపేరుగా నిలిచిన చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ హైదరాబాద్‌లో తన పరిశోధన అభివృద్ధి (ఆర్ అండ్ డి) కేంద్రాన్ని ఇటీవల ప్రారంభించింది. ఆ రకంగా తన టెక్నాలజీ ప్లస్‌ను ఇక్కడి నుంచే ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఆ సంస్థ సిద్ధమైంది. ఈ పరిశోధన కేంద్రంపై వచ్చే మూడేళ్ళలో వెయ్యి కోట్ల రూపాయలను వెచ్చించేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్టు ఆ సంస్థ వ్యవస్థాపకుడు, సిఈఓ పీట్‌లావ్ పేర్కొన్నారు. ఈ భారీ మొత్తాన్ని కృత్రిమ మేధ, 5జి, ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ పరిశోధనా అంశాలపై ఖర్చుచేయడానికి నిశ్చయించామన్నారు. 5జి ల్యాబ్‌ను వంద కోట్లతో ఏర్పాటుచేయనున్నామని కూడా ఆయన చెప్పారు.
స్మార్ట్ఫోన్ల తయారీ దిగ్గజ సంస్థ వన్‌ప్లస్ 5జి ల్యాబ్‌పై రూ.వంద కోట్లు వెచ్చించి హైదరాబాద్‌లో పరిశోధనలు జరపడం ఓ గొప్ప పరిణామంగా చెప్పుకోవాలి. రానున్న కాలమంతా 5జి టెక్నాలజీకి, ఏఐకి నీరాజనాలు పలకనున్నది. దాన్ని గుర్తించిన వన్‌ప్లస్ భారీఎత్తున ప్రణాళికలు సిద్ధం చేసింది. ముఖ్యంగా పరిశోధన రంగానికి ప్రాముఖ్యతనిచ్చి పెట్టుబడులు పెడుతోంది. ఈ కేంద్రం కేవలం తెలంగాణ, భారతదేశ అవసరాల కోసమే గాక ప్రపంచం అవసరాలను దృష్టిలోపెట్టుకుని పనిచేస్తుంది. ఈ ప్రపంచ స్థాయి పరిశోధనా కేంద్రం పాక్షికంగా ఇప్పటికే పనిచేస్తోంది.
ఈ వన్‌ప్లస్ తొలి అంతర్జాతీయ పరిశోధనా కేంద్రం. పరిశోధన కేంద్రంలో 1,500 మంది నిపుణులు కొత్త ఆవిష్కరణల కోసం పనిచేస్తారు. సరికొత్త సాఫ్ట్‌వేర్ రూపకల్పనకు ప్రాధాన్యతనివ్వనున్నారు. కృత్రిమమేధ, ఐఓటి, 5జి సాఫ్ట్‌వేర్ సరికొత్త రూపంలో దర్శనమివ్వనున్నదని తెలుస్తోంది. వన్‌ప్లస్ స్మార్ట్ఫోన్ల అమ్మకాలు భారత్‌లో భారీగా జరగనున్న దృష్ట్యా విస్తరణకు పూనుకున్నామని ఆ సంస్థ వ్యవస్థాపకుడు తెలిపారు. కెమెరా, కమ్యూనికేషన్స్, నెట్‌వర్కింగ్‌కు సంబంధించిన మూడు పరిశోధన ల్యాబ్‌లు హైదరాబాద్‌లో పనిచేస్తాయని, ఆటోమేషన్ లాబ్ కెమరా మరింత సమర్ధవంతంగా విస్తృతంగా పనిచేసే అంశమై పరిశోధన చేస్తుందని కూడా ఆయన తెలిపారు.
ఈ ఏడాదిలో వన్‌ప్లస్ టీవీలను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, అందుకు అవసరమైన సాంకేతిక సహాయం హైదరాబాద్ ఆర్ అండ్ డి అందించగలదని, అనంతరం 5జి ఫోన్లను తీసుకొస్తామని సంస్థ వ్యవస్థాపకుడు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గూగుల్ సంస్థ తన ‘‘గూగుల్ నెస్ట్‌హబ్’’ పరికరాన్ని కొత్త ఢిల్లీలో ఇటీవల ఆవిష్కరించింది. స్మార్ట్ పరికరాలను నియంత్రించేందుకు, లైట్లు-్ఫ్యన్లను ఆన్-ఆఫ్ చేసేందుకు ఈ ‘నెస్ట్ హబ్’ ఉపకరించనున్నది. గూగుల్ ఫొటోలు, ఇతర గూగుల్ సేవలకు దీన్ని వాడవచ్చు. ఎల్.జి, ఫిలిప్స్, షియామీకి చెందిన పరికరాలను సైతం దీనిద్వారా నియంత్రించవచ్చునని గూగుల్ ప్రతినిధులు చెబుతున్నారు. దీన్ని కోట్ల పరికరాలకు అనుసంధానించ వచ్చునంటున్నారు.
దేశంలో కృత్రిమ మేధ (ఏఐ)కు సంబంధించిన నిపుణుల కొరత వుంది. దీన్ని భర్తీచేయడానికిగాను మద్రాసు ఐఐటీతో కలిసి గువి, వన్‌ఫోర్త్ ల్యాబ్ అనే స్టార్టప్ సంస్థలు ఏఐలో శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. ఆన్‌లైన్‌లో ఈ శిక్షణ ఉండటం గమనార్హం. వచ్చే సంవత్సరం చివరికల్లా లక్ష మందికి ఏఐలో శిక్షణ ఇవ్వాలన్న లక్ష్యంతో ఆ సంస్థలు పనిచేస్తున్నాయి. భవిష్యత్‌లో ఏఐ నిపుణులకు మంచి డిమాండ్ ఉండటమేగాక ఆకర్షణీయమైన వేతనాలు అందనున్నాయని ఆ సంస్థలు చెబుతున్నాయి.
ఇదిలాఉంటే.. రష్యాలోని కజన్ నగరంలో ఇటీవల వివిధ అంశాల్లో జరిగిన ప్రపంచ నైపుణ్య పోటీల్లో భారత్ ఒక స్వర్ణం, ఒక రజతం, రెండు కాంస్య పతకాలనూ సొంతం చేసుకుంది. జల సాంకేతికత విభాగంలో ఎస్.అశ్వత్థనారాయణ స్వర్ణం సాధించారు. దీంతో భారతదేశంలో నైపుణ్యాలకు కొదవలేదని మరోసారి రుజువైంది. కృత్రిమ మేధ (ఏఐ) నైపుణ్యంలోనూ కొదవలేదని కాలమే రుజువుచేస్తోంది.

-వుప్పల నరసింహం 99857 81799