Others

సృస్థిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిత్వప్పూల తోటలో పాటల దారి నెంచుకొని
కాల విరామ చిహ్నాల వంటి ఋతువుల కప్పగించాను
జీవ నిధులైన శబ్దాల సౌష్ఠవం
అమృతత్వాన్ని ఆపోశన పట్టిన ఆత్మకే వినిపిస్తుంది..
పచ్చటి ఆకుల్లో జీవితాన్ని అల్లుకున్న పక్షికి
గొంతు దానం చేసిన ఉదయకిరణ
హృదయ వాఙ్మూలాన్ని
నేనురాస్తుంటే
సూర్యుడు బాలుడై నా వర్ణతూలిక మీద వాలిపోతాడు
తరగని నిధుల తవిషి నన్నాదరిస్తునే వుంది
ఇప్పటి నా ఆత్మకు వెలుతురు గంగ అవసరం
అగ్ని శరీరపు మహోదయమంతా
ఆకారం దాల్చిన నా లాలనామయ కోమల చేతనే
వేయి పడగలు విప్పుకున్న వాయుతరంగఖేలకు
నా దోసిళ్ళ ఆవశ్యకత వుండనే వుంది
నులివెచ్చటి మధురిమలో ఒతితగిలి పడుకున్న
నీలి సైరిభాన్నినక్షత్ర ఖజానాగా మారుస్తున్నాను...
ఋతువుల దండయాత్రలో దెబ్బతిన్నవన్నీ
నిర్భగ్న నిశ్చలత్వపు నిస్తుల కళాఖండాలే..
ఏ దీర్ఘ తపస్సు యొక్క పరాకాష్ఠ
ఏమని భాష్యం చెప్పిందో కానీ
అవి రూపురేఖల ద్వారా
నిశ్శబ్దాల వ్యాకరణాన్ని సూత్రబద్ధం చేశాయి
ఈ సృష్టి జీవరాగంతో స్పందిస్తోంది
ఇంకా ఉంది

- సాంధ్య శ్రీ 8106897404