వినమరుగైన

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. శ్రద్ధతో వినాయక నిమజ్జనము సేయు
వేళ గంగవెఱ్ఱెత్తుచు వెక్కసముగఁ
ద్రాగియుం దూలుచుంలోను రట్టహాస
ముగను పిచ్చి పాటలు నాట్యములు హరహరఁ
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: హరహరా! శ్రద్ధ్భాక్తులతో వినాయక నిమజ్జనం చేసే సందర్భంలో కొందరు భక్తులమని చెప్పుకుంటూ బాగా మద్యం సేవించి గంగవెఱ్ఱులెత్తినట్టు నాట్యములాడుతున్నారు. ఆ తాగిన మైకంలో ఏదో పిచ్చిపాటలు కూడా పాడుతున్నారు. హరహరా ఇదేమి వింత. భక్తితోను, శుచిశుభ్రతలను పాటిస్తూ భగవంతుని కీర్తనలు చేయాలన్న స్పృహను వీరికి కలిగించు కర్మసాక్షివైన ఓ సూర్యదేవ!
తే.గీ. చెదరిపోనట్టి ధైర్యమ్ము చిరమునిల్పి
స్థైర్య విశ్వాసములు సూపి సబలలనియుఁ
జాటి చెప్పంగ నిలబడు శక్తి నిడుచుఁ
గావుమో గ్రహరాజ!యా దేవతలను
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: ఓ గ్రహరాజా!కర్మసాక్షివైన సూర్యదేవా!చెక్కుచెదరని ధైర్యాన్ని, కడదాకా నిలుపుకుని సుస్థిరత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కల్గియుండి అబలలం కాదు సబలలమని చాటిచెప్పే శక్తియుక్తులను ఆ దేవతలకు ప్రసాదిచిచవయ్య లోకప్రభూ! అన్నిరంగాల్లో సాధికారత చూపే స్ర్తీలు వారిని వారు పూర్తిగా రక్షించుకోలేకపోతున్నారు. పైగా న్యాయం కోరితే చావునుంచి తప్పించుకోలేకపోతున్నారు. వారిని నీవే కాపాడుము ప్రభూ.

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262