Others

బోసిపోయిన పల్లె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కడ వెనె్నల వెలుగు తొంగిచూసేది
మువ్వనె్నల జెండా స్వాగతిస్తుంటే
మానవత్వం పలకరించేది...

మట్టివాసన పులకింతలతో
మమకారపు లోగిళ్లూ
నిండుకుండలల్లే తొణికిసలాడేవి

పల్లె వేడుకగా నిలిచేది
పల్లె పలుకులో మురిసిపోయేది
పచ్చదనంతో ఊరంతా తోరణాలే
రంగురంగుల హరివిల్లులే...

పల్లె అంతా నేలని ముద్దాడి
ఆ భూమాత ఒడిలో సేదదీరేది
అక్కడ ఎవరికి ఎవరూ ఏమీకారు
అయినా అందరికీ అందరూ బంధువులే!

మరెందుకో ఇపుడు పల్లె బోసిపోయింది
నవ్వులన్నీ చెదిరిపోయాయి
మాసిపోయిన పల్లెలో మూసుకున్న తలుపులు
గడప గడప ముసుగేసుకొని
మట్టి లోగిళ్లని నలుపు రంగు పూసుకొని
వెక్కిరిస్తున్నాయి

పల్లె అంతా
పట్నం సావాసంతో కలుషితమైంది
కలలన్నీ చేజారిపోయాయి..
మానవత్వం చిగురించడానికి
మట్టివాసన కరువైంది...
కన్నతల్లి జోలపాట హృదయానికి బరువైంది

కరువైన మమతల లోగిళ్లన్ని
ఆకాశానికేసి బిత్తర చూపులు చూస్తున్నాయి..
గూడు వాలే వలస పిట్టల
సమయమెప్పుడా అని ఎదురుచూస్తూ!!

- స్వప్నమేకల, 9052221870