Others

‘అతి’ కాకుంటే ఆనందమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత ఏడు సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సోషల్ మీడియాలో గడిపిన సమయం సగటున దాదాపు అరవై శాతం పెరిగిందని తాజా సర్వేలో వెల్లడైంది. లండన్‌కు చెందిన పరిశోధనా సంస్థ గ్లోబల్ వెబ్ ఇండెక్స్ ప్రపంచంలోని నాలుగు అతిపెద్ద ఇంటర్నెట్ మార్కెట్ల(దేశాల) నుంచి సేకరించిన డేటాను విశే్లషించింది. ఒక్కో వ్యక్తి సోషల్ మీడియా వెబ్‌సైట్లను, అప్లికేషన్లను చూసేందుకు కేటాయించే సమయం 2012లో తొంభై నిముషాలు కాగా, 2019లో మొదటి మూడు నెలలో 143 నిముషాలకు పెరిగిందని అంచనా వేశారు. సోషల్ మీడియా వాడకంలో ప్రాంతాలు, దేశాల వారీగా చూస్తే భారీ తేడాలు ఉన్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే, లాటిన్ అమెరికా ముందుంది. ఇక్కడ నెటిజన్లు రోజూ తెరలపై గడిపే సమయం సగటున 212 నిముషాలు. అత్యల్ప ప్రాంతీయ సగటు ఉత్తర అమెరికాలో 116 నిముషాలుగా ఉంది. ఇక ప్రజలు సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపే దేశం ఫిలిప్పీన్స్. ఈ దేశంలో రోజుకు సగటున 241 నిముషాలు సోషల్ మీడియా వాడుతున్నారు. జపాన్‌లో సోషల్ మీడియా వాడకం కేవలం 45 నిముషాలు మాత్రమే ఉంది.
భారత్‌లో తగ్గుదల
ఆశ్చర్యకరంగా.. ఇరవై దేశాల్లో ప్రజలు తెరలపై గడిపే సమయంలో మార్పులేదని లేదా తగ్గిందని వెల్లడించింది. 2018తో పోలిస్తే 2019లో సోషల్ మీడియా వినియోగం సగటున మూడు నిముషాలు తగ్గింది. ఆసియాలో సోషల్ మీడియా మార్కెట్ చాలా భిన్నంగా ఉంది. ‘సూపర్ యాప్స్’ పశ్చిమ దేశాలకు భిన్నంగా ఇక్కడ వేర్వేరు భిన్నమైన సోషల్ మీడియా యాప్‌లు మంచి ఆదరణ పొందుతున్నాయి. చాటింగులు, సంభాషణల కోసమే కాకుండా, బిల్లుల చెల్లింపులు, రెస్టరెంట్ల బుకింగులు, ట్యాక్సీ బుకింగులు, దుకాణాల్లో చెల్లింపుల సదుపాయాలు ఉండే యాప్‌ల వాడకం పెరిగిపోయింది. 16 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు యువత అత్యధికంగా సోషల్ మీడియా వినియోగిస్తున్నారు. తెరలపై ఎక్కువ సమయం గడపడం మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపే వ్యక్తులు, తక్కువ సంతోషంగా ఉన్నారని పరిశోధనలు చెబుతున్నాయి. అధిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం కూడా కొన్ని సమస్యలకు దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో అది కుంగుబాటుకు, రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుంది. ప్రజలు ఆన్‌లైన్‌లో ఇంతసేపు గడపాలి అనే కచ్చితమైన కొలమానం ఏమీ లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గత ఏప్రిల్‌లో మొట్టమొదటిసారిగా తెరలపై గడిపే సమయానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఐదేళ్ల లోపు పిల్లలను ఉద్దేశించి ఈ మార్గదర్శకాలను రూపొందించారు. యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా ప్రచురించిన అధ్యయనం ప్రకారం, సోషల్ మీడియా వాడకాన్ని రోజుకు 30 నిముషాలకు పరిమితం చేస్తే మెరుగైన ఫలితాలు కనిపించాయి. ఈ అధ్యయనంలో పాల్గొన్న 143 మంది విద్యార్థుల్లో ఒంటరితనం, కుంగుబాటులో గణనీయమైన తగ్గుదల కనిపించింది. కానీ కొంతమంది నిపుణులు మాత్రం ఈ సమస్య చాలా క్లిష్టమైనదని అంటున్నారు. ఏది ఏమైనా సోషల్ మీడియా చాలా వైవిధ్యమైనది. విభిన్న సైట్లు, విభిన్న ఫీచర్లను అందిస్తాయి. కాబట్టి ఒక్కోదాని ప్రకారం ఒక్కోవిధంగా ఉంటుంది. అన్నింటి ప్రభావం ఒకేలా ఉండదు అని చెబుతున్నారు ఇంటర్నెట్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్న మానసిక నిపుణులు.