Others

ఆర్థిక మాంద్యం ‘ఐ ఫోన్’కు అంటదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్థిక మాంద్యం అంటున్నా.. నూతన ఆవిష్కరణలు ఆగడం లేదు. యాపిల్ సంస్థ సరికొత్త ఐఫోన్-2 సీరీస్‌ను ఇటీవల అమెరికాలో విడుదల చేసింది. అత్యంత శక్తివంతమైన ఫోన్లుగా భావిస్తున్న ఐఫోన్-2, ఐఫోన్-2ప్రొ, ఐఫోన్-2ప్రొ-మ్యాక్స్ వేరియంట్లను ఐఫోన్ అభిమానుల ముందు ఆ సంస్థ సిఈఓ టిమ్‌కుక్ ఆవిష్కరించారు. ఏ-13 బయోనిక్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కలిగి ఉండటం ఈ ఫోన్ల ప్రత్యేకతగా యాపిల్ పేర్కొన్నది. ఇదే సమయంలో 7వ తరం ఐప్యాడ్‌ను సైతం టిమ్‌కుక్ ఆవిష్కరించారు. అంతేగాక సీరిస్-5 యాపిల్ వాచ్ (చేతి గడియారం)ను తీసుకొచ్చారు. ఈ ఉత్పత్తుల కోసం యాపిల్ అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. భారత్‌లో ఐఫోన్-2 రూ.60 వేలకు పైనే అమ్ముడుకానున్నది. వర్తమాన సాంకేతిక సౌకర్యాలు, సౌలభ్యం, డిజైన్ తదితర అంశాలకు ఆకర్షితులైన వారెందరో వీటి కోసం ఎదురుచూస్తుండటం గమనార్హం.
కొసమెరుపు ఏమిటంటే.. వచ్చే నవంబర్ నుంచి ఈ సంస్థ యాపిల్ టీవీ -ప్లస్‌ను ప్రారంభించనున్నది. ఓవర్ ది టాప్ (ఓటీటీ) విభాగంలో సేవలు అందించనున్నది. నెట్ ఫ్లెక్స్, అమెజాన్, ప్రైమ్ డిస్నీలకు పోటీగా యాపిల్ స్ట్రీమింగ్ రంగంలోకి వస్తోంది. మన దేశంలో రిలయన్స్ ‘జియో’ ఓ రకమైన విప్లవాత్మక సేవలను ప్రవేశపెడితే ‘యాపిల్’ మరో విధమైన విప్లవాత్మక అంశాలతో అడుగిడుతోంది.
ఇస్రోకు ‘నాసా’ ప్రశంసలు
భారత్ చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం తమకు ప్రేరణదాయకంగా నిలిచిందని అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ప్రశంసించింది. సౌర వ్యవస్థపై పరిశోధనలు కొనసాగిద్దామంటూ భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో)కు ‘నాసా’ స్నేహహస్తం చాచింది. అమెరికా ప్రభుత్వంలోని ఓ సీనియర్ అధికారి సైతం ‘ఇస్రో’ను అభినందించారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక భారత శాస్తవ్రేత్తల కృషిని శ్లాఘించింది. ఇదంతా చంద్రుడిపై ఆర్బిటర్ లాండర్‌ను గుర్తించక ముందు లభించిన ప్రతిస్పందన. రోవర్ ప్రజ్ఞాన్ నుంచి సంకేతాలు అందే అవకాశాలు మృగ్యమవలేదన్న విషయం తెలియక ముందు లభించినవి ఈ ప్రశంసలు. అనంతరం ఆ ప్రశంసలు ద్విగుణీకృతమయ్యాయి. ఇప్పుడు చందమామపైకి చేరిన నాలుగో దేశంగా భారతదేశ కీర్తి నలుదిశలా తేజోవంతంగా వెలుగుతోంది. అత్యంత తక్కువ ఖర్చుతో ఈ విజయాన్ని సాధించిన దేశంగా భారత్ ప్రశంసలు అందుకుంటోంది. చంద్రునిపై దక్షిణ ధ్రువాన్ని చేరిన తొలి దేశం భారత్ కావడం మహాద్భుతం గాక ఏమవుతుంది?
21వ శతాబ్దపు నగరాలు
21వ శతాబ్దపు నగరాలను రూపొందించాల్సిన అవసరముందని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ముంబయిలో చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ల డాలర్లకు చేరుకోవాలన్న లక్ష్యం చేరుకోవాలంటే అత్యాధునిక నగరాల నిర్మాణం అవశ్యకమని ఆయన అభిప్రాయపడ్డారు. రూ.19వేల కోట్ల విలువైన మూడు మెట్రోలైన్లకు ప్రధాని ముంబయిలో శంకుస్థాపన చేశారు. రానున్న నాలుగైదేళ్ళలో దేశవ్యాప్తంగా రూ.వంద కోట్లతో వౌలిక సదుపాయాలను అభివృద్ధిపరుస్తామని తెలిపారు. నగరాలలో కనెక్టివిటీ, మొబిలిటీ, ప్రొడక్టివిటీ అత్యంత కీలకమని గుర్తుచేశారు. ముంబయిలో 32 అంతస్తుల మెట్రోభవన్‌కు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. గత ఐదేళ్ళలో వౌలిక సదుపాయాల కోసం కేంద్రం లక్ష కోట్లకు పైగా ఖర్చుచేసిందని, రానున్న ఐదేళ్ళలో వంద లక్షల కోట్లు ఖర్చుచేస్తామని వివరించారు. దీంతో నిజంగానే 21వ శతాబ్దపు నగరాల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టయింది.
విద్యార్థులే సాంకేతిక సారథులు
ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, స్మార్ట్ నగరాలు, వౌలిక సదుపాయాలు, రవాణా, పర్యావరణం, మహిళా రక్షణ, డిజిటల్ అక్షరాస్యత.. తదితర సామాజిక రంగాల్లోని సమస్యల పరిష్కారాలకు ఉపకరించే ఆలోచనల్ని (ఐడియాస్), పరిష్కారాల్ని దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ విద్యార్థుల నుంచి గూగుల్ ఆహ్వానిస్తోంది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖతో గూగుల్ ఒక అవగాహనను కుదుర్చుకుంది. ‘‘డిజిటల్ ఇండియా’’ను రూపొందించడంలో అంతర్భాగంగా గూగుల్ ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇంజినీరింగ్ విద్యార్థులను ఆహ్వానిస్తోంది. ఈ బృహత్తర కార్యక్రమంలో మిషన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ పరిజ్ఞానాన్ని విద్యార్థులకు గూగుల్ పరిచయం చేయనున్నది. ప్రాడక్ట్ డిజైన్ లాంటి కీలకాంశాల్లోనూ గూగుల్ మార్గదర్శకత్వం వహించనున్నది. ఈ కార్యక్రమం ద్వారా అనేక నూతన సాంకేతిక ఆవిష్కరణలకు ఊతం లభిస్తుందని, భారతదేశం ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి ఆ ఆవిష్కరణలు దారిచూపుతాయని భావిస్తున్నారు. కఠినమైన సామాజిక సమస్యలను అధిగమించేందుకు మెషిన్ లర్నింగ్, కృత్రిమమేధ పరిజ్ఞానం ఎంతో ఉపకరించగలదని గూగుల్‌కు చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రేపటి పరిష్కారాలకు ఈనాటి యువ ఇంజినీర్ల ప్రతిభను, సాంకేతిక ప్రజ్ఞను, చొరవను వెలికితీసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
జాతీయ కృత్రిమ మేధ వనరులకు చెందిన పోర్టల్‌ను తయారుచేసేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్‌తో కలిసి పనిచేయాలని ఖరగ్‌పూర్ ఐఐటి నిశ్చయించింది. దీనిద్వారా కృత్రిమ మేధ గూర్చి లోతైన అవగాహన ఏర్పరచుకునే అవకాశముందని ఐఐటి ఖరగ్‌పూర్ భావిస్తోంది. సమాజంలో ఇప్పటికే ఏఐకి డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోందని, ఈ ప్లాట్‌ఫాం ద్వారా ఏఐకి చెందిన నిపుణులు ప్రయోజనం పొందగలరని ఆశిస్తున్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ అందించే ఆర్థిక సహకారంతో ప్రాథమిక పురోగతికి పునాదులు పడ్డాయని ఆ విద్యాసంస్థ వివరించింది.
ఉపాధ్యాయులకు ఐటీలో శిక్షణ
ఐటీ అంశాల్లో నైపుణ్యాలపై ఐదువేల మంది తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) హైదరాబాద్ విభాగం సిద్ధమైంది. ఈమేరకు రాష్ట్ర సచివాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సిఐఐ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. టిసిఎస్‌తోపాటు మరికొన్ని ఐటీ సాంకేతిక సంస్థలు ఈ ప్రాజెక్టులో పాలుపంచుకోనున్నాయి. తొలుత హైదరాబాద్ జిల్లానుంచి ఈ శిక్షణా కార్యక్రమం ప్రారంభం కాబోతోంది.
టి-హబ్ ఆదర్శం
స్టార్టప్ సంస్థలకు నిలయమైన టి-హబ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని రిజర్వు బ్యాంకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇటీవల ప్రశంసించింది. చిన్న సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల సమస్యల అధ్యయనం కోసం ఏర్పాటైన ఆ కమిటీ టి-హబ్‌ను సందర్శించాక ఈ అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన స్టార్టప్ విధానం ఇతర రాష్ట్రాలకు అనుసరణీయమని, ఆ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
అధునాతన పరిశోధన కేంద్రం
హైదరాబాద్‌లోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ కేంద్రం (టిఐఎఫ్‌ఆర్)లో బ్రిటన్-్భరత్‌లు సంయుక్తంగా సరికొత్త ఆవిష్కరణల కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నాయి. పారిశ్రామిక, బయోమెడికల్ రంగాల్లో సాంకేతిక పరిజ్ఞాన నూతన ఆవిష్కరణల కోసం ఈ కేంద్రం కృషిచేయనున్నది. బ్రిటన్ నుంచి ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందానికి నాయకత్వం వహించిన మార్క్ థాంప్సన్ ఈ విషయాన్ని వెల్లడించారు. బ్రిటన్-భారత్‌ల మధ్య శాస్తస్రాంకేతిక రంగాల్లో భాగస్వామ్యం పెంచుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆ బృందం హైదరాబాద్‌కు వచ్చి టిఐఎఫ్‌ఆర్‌ను సందర్శించింది. ఏతావతా తేలింది ఏమిటంటే... ఆర్థిక మాంద్యం ఉన్నా సాంకేతిక రంగ ఆలోచనల్లో మాంద్యం మాటేలేదు!

-వుప్పల నరసింహం 99857 81799