Others

సిరిసిరి మువ్వలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు మ్రోగంగా కలహంస నడకల కలికి..’’ భావం బాగుంది కానీ, ఆనాటి ఆ అందెల రవళి ఇప్పుడెక్కడిదీ అనుకుంటున్నారా? అంత నిరాశ అక్కర్లేదు. సవ్వడి కాస్త తగ్గిందని చాలామంది ఒప్పుకుంటున్నారు. కానీ పద మంజీరాల వనె్న మాత్రం తగ్గలేదు, సరికదా సరికొత్త అందాలతో హొయలొలుకుతున్నాయి.
వెండి వెనె్నలను పాదాలకు అలంకరించాలన్న ఆలోచన ఏ యుగం నాటిదోగానీ, అది ఎంత అద్భుతమైనది! మరే ఆభరణం అలంకరించుకోవడంలోనూ కనిపించని ఓ అందమైన శిల్పం, ఈ కాలి మువ్వలు కట్టుకోవడంలో కనిపిస్తుంది. అదీ చెలి సుకుమార పాదాల్ని తూకుతూ చెలికాడే స్వహస్తాలతో కట్టే దృశ్యం చూపరుల్ని సైతం మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇష్టమైన వారికి తొలుతగా ఇచ్చే చిరుకానుకల్లో అందియలదే పైచేయి. పైగా ఉంగరం లేదా చెయిన్ కన్నా ధర తక్కువ కూడా.
పట్టీలు పెట్టుకోవడంలో ఆరోగ్యం కూడా దాగుంది. ఒంటిమీద వెండి అరిగితే మంచిదని పూర్వం పెద్ద కడియాలతో కాళ్ళను బంధించేవారు. కీళ్ళనొప్పులతో బాధపడేవాళ్ళు రాగితో చేసినవి పెట్టుకుంటే నొప్పులు తగ్గుతాయట. ఏదోఎత్నిక్‌వేర్‌లో భాగంగా తప్ప ఇంకా పట్టీలెక్కడివి.. ఎవరు పెడుతున్నారు? చాలామందికి వచ్చే సంశయమే.
అయితే మువ్వల సవ్వడి తగ్గిందేమోకానీ కాలి గజ్జె అలాగే వుంది, యాంక్లెట్ రూపంలో. అవునండీ, మెటల్ చెన్లు, లెదర్ బెల్టులు, పూసల దండల రూపంలో పట్టీ ఆధునికతను సంతరించుకుంది. స్కర్టులు, మినీలు, క్యాప్రీల కింద స్టైల్‌గా మెరుస్తుంది. అదీ ఒక కాలికే, ఎక్కువవగా కుడికాలికే పెట్టడం లేటెస్ట్ ట్రెండ్. ఈ మోడ్రన్ యాంక్లెట్స్ 40 రూపాయల నుంచి 400వరకు ధర పలుకుతున్నాయి. చెక్కతోనూ ప్లాస్టిక్ పూసలతో చేసినవీ వస్తున్నాయి. పోతే, మరీ శబ్దం చేయకుండా వెండి బంగారాల్లో రత్నాలు పొదిగిన గజ్జెలు సరేసరి. అవి అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఉన్నాయ్.. ఉంటాయ్. పాశ్చాత్య దేశాల్లో యువతలో ఆడా మగా తేడా లేకుండా లెదర్ యాంక్లెట్‌లను పెడుతున్నారట.
పొరుగు దేశాల్లో కాలి పట్టీలను ఎలా వినియోగిస్తున్నా, మన దేశంలో మాత్రం యాంక్లెట్‌లతోపాటు చిరుశబ్దంతో కనీ కనిపించని విధంగా, సన్నగా మెరిసే పట్టీలనే ఎక్కువగా మహిళలు ఇష్టపడుతున్నారు. అయితే అన్నీ అన్ని రకాల డ్రెస్‌లమీదికి నచ్చవంటున్నారు జ్యువెలరీవారు. ఏ ఏ రకాలు ఎలాంటివాటిపై నప్పుతాయయో తెలుసుకుందాం.
పద మంజీరాలు
రంగు రంగుల రాళ్ళు, క్రిస్టల్స్‌తో ఆభరణాల్లా మెరుస్తుంటాయి. సంప్రదాయ దుస్తులు వేసుకుని ఒంటినిండా నగలు పెట్టుకున్నప్పుడు వీటి అందం చెక్కనక్కరలేదు నీలి, ఆకుపచ్చ రంగుల్లో సన్నగా ఉండే గొలుసులు పార్టీలకూ బాగుంటాయి.
చెయిన్ యాంక్లెట్స్
నాజూగ్గా వుండే ఈ చెయిన్ పట్టీల్ని చిన్న రాళ్ళతో డిజైన్ చేస్తున్నారు. ఇవి పెట్టుకునేటప్పుడు అదేరకం జ్యువెలరీని ధరించడం మర్చిపోకూడదు. స్కర్ట్స్‌కి చక్కని కాంబినేషన్.
లెటర్ యాంక్లెట్స్
బెల్టులు మాదిరిగానే రకరకాల డిజైన్లలో సన్నగా వుంటాయి. డెనిమ్ క్యాప్రీస్‌కి సూటబుల్.
పూసల పట్టీలు
ఇవి రంగు రంగుల పూసలతో మురిపిస్తుంటాయి. చుడీదార్స్, స్కర్టులు, క్యాప్రీలు అన్నింటిమీదికి నప్పుతాయి.
వెండి మువ్వలు
కాస్త నాజూగ్గా వుండే ఈ రకం అందరికీ అన్ని సందర్భాల్లోనూ బాగుంటాయి. అయితే ఇవి రెండు కాళ్ళకూ తప్పనిసరి. నక్షత్ర ఆకారంలో చెక్కిన రాళ్ళతో పొదిగిన వెండిపట్టీలు ఇటీవల ఎక్కువ క్రేజ్‌ను సంతరించుకున్నాయి. అయితే మరీ శబ్దం చేస్తే కాలేజీల్లోనూ, ఆఫీసుల్లోనూ గజ్జెల కనకమహాలక్ష్మి అని పిలుచుకునే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఘల్లుఘల్లని సవ్వడి చేసే గజ్జెల పట్టీలమీద ఎంత కోరిక వున్నా, చిరుసవ్వడి చేసే సిరిమువ్వలనే ధరించడం మిన్న. అటు అందం ఇటు ఆధునికం రెండూ మీ సొంతం చేసుకోవచ్చు.

-తులసి జ్యోతి దొప్పలపూడి