Others

పరిష్వంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మాట వినగానే శకుంతలా దుష్యంతులు గుర్తుకువస్తారు. శకుంతలను దుష్యంతుడు గాంధర్వ వివాహం చేసుకొని కణ్వమహర్షికి తెలియకుండానే రాజ్యానికి వెళ్లిపోతాడు. కణ్వుడు తన థివ్యదృష్టి వల్ల తెలుసుకొని శకుంతలకు ధైర్యం చెప్తాడు. కాని వారిద్దరి మధ్య దూరం పెరుగుతుంది. శకుంతలకు కొడుకు పుట్టి వాడు పెద్దవాడు అవుతున్నా దుష్యంతుని నుంచి పిలుపు రాలేదు. అందుకని కణ్వమహర్షి తన కూతురిని, మనుమడిని తన శిష్యులతో దుష్యంతుని దగ్గరకు పంపిస్తాడు. శకుంతల నిండు రాజ్యసభలో తానేవెరో చెప్తుంది. కానీ దుష్యంతుడు మాత్రం వారి వివాహాన్ని అంగీకరించడు. అపుడు ఆమె నీ కొడుకును పరిష్వంగం చేసుకో అపుడు నీకొడుకు అవునో కాదో తెలుస్తుంది అని చెప్తుంది. అంటే పరిష్వంగంలోని శక్తి అదన్నమాట.
అంతేకాదు దమయంతిని దూరం చేసుకొని నలుడు మారుపేరుతో, మారు రూపుతో దేశదేశాలు తిరిగి చివరకు ఋతుపర్ణ మహారాజు దగ్గర కాలం గడుపుతుండేవాడు. దాన్ని తెలుసుకొన్న దమయంతి బాహుకుని పేరుతో ఉన్న నలుడి గుర్తించాలని తనకు ద్వితీయ వివాహం జరుగుతున్నట్లు ఋతుపర్ణమహారాజుకు చెప్పి పంపిస్తుంది. ఆ వివాహానికి ఋతుపర్ణ రాజు నలుడిని అంటే బాహుకుడిని తన రథసారథిగా చేసుకొని దమయంతి దగ్గరకు వస్తారు. అపుడు బాహుకుని రూపంలో ఉన్న నలుడిని గుర్తించడానికి తన కూతురిని, కొడుకు తన చెలికత్తె ద్వారా వంటచేసు కొంటున్న బాహుకుడి దగ్గరకు అంటే నలుడి దగ్గరకు పంపుతుంది. ఆ పిల్లలను చూడగానే బాహుకుడు చేతులు చాపి వారిని అక్కున చేర్చుకుంటాడు. కంటతడిపెడ్తాడు. అలా తండ్రీ పిల్లల ముఖకవళికలను చూసి దమ యంతి ఆ వంటవాడే తన భర్తఅయన నలుడని గుర్తిస్తుంది. అంటే పిల్లల పరిష్వం గంలోని శక్తి అది అన్నమాటే కదా.
ఇంతటి శక్తి సమన్విత పరిష్వంగం కనుక రాముడు సీతమ్మ క్షేమ వార్త చెప్పిన ఆంజనేయుడికి చేతులు చాపి గాఢ పరిష్వంగాన్ని ఇచ్చాడు. అపుడు రాముని హృదిలో ఆంజనేయుని స్థానమేమిటో తెలిసింది. అందుకే ఆంజనేయుడు కూడా తన హృదయంలో సీతారాములను ప్రతిష్ఠించుకుని ఉండేవాడు. అంతేకాదు రాముడు గర్భవతిగా ఉన్న సీతమ్మ ను అడవుల పాలు చేసి చివరకు తిరిగి లవకుశలను చూసే సమయంలో వారిని చూడగానే ఆయన హృదయంలో అనురాగం పెల్లుబుకి వారిని తన హృదయానికి చేర్చుకోవాలని మీరు ఎవరు పిల్లలు అంటూ చేతులు చాస్తాడు. వారు ఆ అనుభూతితోనే రాముని దగ్గరకు వస్తారు. వారి పరిష్వంగం లోనే రాముడు తన కుమారులుగా లవకుశులను గుర్తించినట్లు కొన్ని రామా యాణాల్లో కనిపిస్తుంది.
ఇద్దరి మనుష్యుల మధ్య మాటల కన్నా ఈ స్పర్శ ఎన్నో అనుభూతులను, ఎన్నో సంగతులను చెబుతుంది. మాట కన్నా అనుభూతి శక్తివంతమైంది కనుకనే మన మహర్షులు తపోసమాధిలో ఉండి అన్ని విషయాలను కేవలం తమ మనోనేత్రంతో దర్శించి వాటి అనుభూతులను అర్థం చేసుకొనేవారు. మాట చెప్పని విషయం ముఖం చెప్తుందనో లేక కళ్లు చెబుతాయనో అంటే అందులోని అంతరార్థం అనుభూతికి సంబంధించిన విషయమే.

- చోడిశెట్టి శ్రీనివాసరావ్