సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంత శక్తి
జ్ఞానం మూడు రకాలుగా వుంటూ వున్నది. ఒకటి పదార్థశక్తికి సంబంధించిన జ్ఞానం. మరొకటి మానసిక శక్తికి సంబంధించిన జ్ఞానం. మూడవది విశ్వశక్తికి సంబంధించిన జ్ఞానం. ఈ విశ్వశక్తే ప్రతి మానవుని యందూ వున్న దివ్యశక్తి.
పదార్థం ఎన్ని రకాలుగావున్నా, అంతా శక్తే! అణువులతో కూడినదే! అణుగర్భంలోనే అనంతశక్తి నిక్షిప్తమై వుంది.
అదృష్టశక్తి
నెహ్రూ ఒక ఉపన్యాసంలో, వ్యక్తిచేసే పనులతో నిమిత్తంలేకుండా సంఘటనలను జరిపించే అదృష్టశక్తి ఒకటి వుందని అంగీకరించారు. కాస్త ముందుగానో, వెనకగానో ప్రతి వ్యక్తీ ఆమాట అంగీకరించక తప్పదు. సంఘటనలను అదుపుచేయటంలో పురుషశక్తికి కొన్ని పరిమితులున్నాయి. దానిని నీవు అదృష్టం అనవచ్చు. మరొకరు దానినే దైవం అనవచ్చు. పేరేదైతేనేం! మనిషిని మించిన శక్తి ఒకటి రుూ సంఘటనల క్రమాన్ని కంట్రోల్ చేస్తున్నదన్నది యదార్థం. ఆ సంగతి తలుచుకుంటే మనిషిలో అహంతగ్గి వినయం పెరగాలి. ఆశ్చర్యంతో, అద్భుతంతో మనసు చకితం కావాలి.
హృదయ జ్యోతి
దేవాలయంలో నిత్యం దీపం పెడతారు. ఈ దీపం ఎవరికోసం? దేవుని కోసమా? ఆయనకీ ప్రమిదె ఎందుకు? ఆయనే జ్యోతి స్వరూపం. కోటి సూర్యప్రభాభాసమానుడు కదా! ఆయన తేజాలన్నిటికీ అతీతం. ఈ రాతి మందిరాన్ని ప్రకాశమానం చేయటంకోసం కాదు దీపం! నీ హృదయాంతరాళంలో జ్ఞానజ్యోతిని వెలిగించుకో అని నీకు గుర్తుచేస్తుంది ఆ దీపం! గుడి అంటే నాలుగు రాతి గోడలు కాదు. 3దేహో దేవాలయ ప్రోక్తః2- దేహమే దేవాలయం అని చెప్పారు. మరి ఆ గుడిలో దేవుడెవరు? 3జీవో దేవస్సనాతనః2- సనాతనంగా వున్న దైవం జీవుడే!
సాక్ష్యం ఎందుకు?
భగవంతుడు సత్యం. ఆయన మనందరిలో వున్నాడు. కాని మనకు ఆయన కనిపించటల్లేదు. భూమి తిరుగుతోంది కాని మనం పట్టించుకుంటున్నామా? ఆయన వున్నాడని ఋజువులూ, సాక్ష్యాలూ కావాలా? భూమి, చంద్రుడు నక్షత్రాలూ తిరుగుతున్న సంగతిని మనం గ్రహించినట్లే ఆయన ఉనికిని కూడా గ్రహించాలి. ఆయన లౌకికమైన మన మాటలకు అందుతాడా? ఉహూ! పగలు కూడ ఆకాశంలో నక్షత్రాలు లేవా? ఉనవి. కాని కనపడవు. సూర్యుని వెలుగువల్ల వాటిని ‘చీకటి’ ఆవరించింది.
రాత్రిపూట చీకటే వుంటుంది. ఆ చీకట్లో నక్షత్రాలు చక్కగా ప్రకాశిస్తున్నాయి. అలా వెలుతురులో చీకటి. చీకట్లో వెలుతురు వుంటున్నాయి. ఇది సైన్స్ చెప్పే సత్యం. మనిషి చీకటి, వెలుతురు వేరువేరని భావిస్తున్నాడు. అది ఒక భ్రమ.
అంతే కాదు, పగటి వేళ మనకు కనిపించటం లేదని చుక్కలు లేవనగలవా? అలాగే నీకు గోచరించనంత మాత్రాన ఈశ్వరుడు లేనట్లేనా?
సృష్టి వైచిత్య్రం
దేవుడు లేడు అనేవారు గాని, దేవుడున్నాడు అనేవారు గాని నిజంగా ఏ ఋజువూ చూపించలేరు. ఇద్దరూ తమ అనుభవాన్నిబట్టే మాట్లాడాల్సి వుంటుంది. పంచదారను రుచి చూడటానికి వొప్పుకోని వారు ‘తీపి’ లేదని ఎలా అంటారు? పంచదార తీపి అన్న సంగతి దానిని రుచి చూడని వారికెలా తెలుస్తుంది? అణువులో గర్భితంగా వున్న శక్తిని చూస్తే ఆశ్చర్యం కలుగుతూ వుంది. అంతరిక్షంలో వెలిగే నక్షత్ర మండలాన్ని చూస్తే అద్భుతం కలుగుతూ వుంది. సృష్టికర్తను స్మరించకుండా అనంతంగా విస్తరించివున్న రుూ సృష్టి వైచిత్య్రాన్ని గురించి ఎలా అర్థం చేసుకోగలం?
ఆరా దొరకని అనంతుడు
భగవంతుడు నిర్గుణుడు. కాని సత్యం, జ్ఞానం, ఆనందం ఈ గుణాలలో భగవంతుడున్నాడు. ఆయన అందరిలో ఉన్నాడు. అంతటా ఉన్నాడు. కాని ఆయనను ఏ అంతరిక్ష నౌకా ఢీకొనలేదు. ఏ అంతరిక్ష నావికుడూ ఆయన ఆరా తీయలేడు. ఆయన అలాటి వాటికి అందేవాడు కాదు.
‘్భగవంతుడు లేడు’ అనేవారి మాటలు వినకు. నీ ఊహకూ తర్కానికీ ఆయన అందడు. ఆయన ప్రభావాన్ని ధ్యానం చేయటం వల్ల కలిగే ఆయన కృపా వీక్షణాలకు పాత్రుడివి కాగలిగితే చాలు, ధన్యుడివైనట్లే.
అంతటా అదే!
సర్వత్రా పరతత్త్వమనేటటువంటి పరమాణువు వున్నదనేటటువంటి సత్యమును గుర్తించటానికి ఈ సైన్సు వెయ్యి సంవత్సరాలు తీసుకున్నది. కాని అనేక వేల సంవత్సరములకు పూర్వమే బాలుడైన ప్రహ్లాదుడు దీని తత్త్వమును చక్కగా విశదీకరించి ‘ఇందుగలడందు లేడని సందేహము వలదు...’ అని చెప్పాడు.

ఇంకా ఉంది