మెయిన్ ఫీచర్

నలచరిత్రలో అంతరార్థాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఆదిత్యవర్ణే తపసో ధిజాతో
వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః’’
(సూర్యమండల తేజోరూపిణీ! జగదంబా! నీ తపస్సువల్ల జన్మించిన వనాధిరాజయిన బిల్వవృక్షం నీ సొంత వృక్షం) అని శ్రీసూక్తం. శ్రీదేవి అంటే శ్రీమాతే. శివుడి బిల్వ స్వరూపత్వానికీ, బిల్వప్రియత్వానికీ, వేరే ప్రమాణాలు వెతుక్కోవలసిన పనిలేదు! కనుక, బిల్వవృక్షం అర్థనారీశ్వరాత్మకం. తత్సనామధేయుడు కర్కోటకుడు. భర్తఅయిన నలుడి ద్వారా దమయంతికి గూడా ఇతడే గురువు.
కాగా, మొత్తంమీద తేలిందేమిటంటే, నల దమయంతులనేవారు యోగ్యులైన మానవ దంపతులు. కనుకనే వీరి పరిపూర్ణతాసిద్ధి సరస్పరాధీనం ఈ విషయాన్ని దత్తపురాణం శిల్పసుందరంగా చెప్పింది. ఎలాగంటే, మానవ సృష్టిచేసి, చేసి, అలసిపోయిన బ్రహ్మదేవుడు తన సృష్టిప్రక్రియను స్వయంచాలిత యంత్రక్రియగా మార్చదలచుకున్నాడు. దానికోసం ఆయన తన శరీరాన్ని నిలువునా రెండు చీలికలుగా చీల్చుకున్నాడు. ఆ చీలికలలో కూడి ముక్క పేరు మనువు. (మనస్సే ప్రధానంగాగలవాడు.) ఇతడు పురుషుడు. ఎడమ ముక్క పేరు శతరూప. ఈమె స్ర్తి.(అనేక రూపాలు ధరించగల శక్తిగలది.)
వీరిద్దరూ ఒకే పూర్ణగోళంలోంచీ విడివడిన ఖండాలు గనుక, ఇద్దరూ అపరిపూర్ణులే. అందుకే, ఇద్దరిలోనూ పరిపూర్ణత్వంకోసం తపన వుంది. ఈ తపనే స్ర్తిపురుషుల మధ్యలో ఆకర్షణశక్తిగా పరిణమించింది.
ఏ శక్తిఅయినా సరే, నియంత్రింపబడి, క్రమబద్దీకృతం కాకపోతే వినాశకారిణే అవుతుంది. దాహం ఎక్కువగా వుందిగదా అని చెరువులోకి దూకిన వాడేమవుతాడు? స్ర్తిపురుషుల మధ్యగల ఆకర్షణశక్తి సహజసిద్ధం కదా అని వారిద్దరూ విశృంఖలంగా ప్రవర్తిస్తే, పైన చెప్పిన దాహార్తుడిగతే పడుతుంది.
అందుకే బ్రహ్మదేవుడు ఆ ఆకర్షణశక్తిని ఆధ్యాత్మికశక్తిగా మార్చదలచుకొని, దానికోసమే దాంపత్యమర్యాదనూ, గృహస్థాశ్రమాన్నీ, వ్యవస్థీకరించాడు- అని పురాణబోధ.
చరిత్రలో సంకేతాలు:
ఇలాంటి దాంపత్య వ్యవస్థకు నిజమైన ప్రతీకలు నలదమయంతులు. ఇలాంటి వారిలో అనుకోని ఛిద్రాలు మిగిలిపోయి, అనుకోని యోగవిఘ్నాలు దాపురిస్తే, ఏమిచేయాలి?
వారు ఏ యుగంవారైనాసరే, తమ విఘ్నాలకు మూలకారణమైన శక్తి పేరు ‘‘కలిపురుషుడు’’అని గ్రహించి, ఆ దుష్టశక్తిని దూరంచేసుకోవాలి. ఆ ప్రక్రియను ప్రబోధించేందుకోసమే వ్యాస భగవానుడు నలచరిత్రను భీమధర్మరాజుల వాగ్వద సమయంలో అవతరింప చేశాడు. కలహమే కలికి ప్రథమ రూపం కదా!
కనుక, నిత్యమూ మానసికమైన వాగ్వాదాలలో, అంతరంగ సంఘర్షణలలో, హృదయ కల్లోల పరంపరలో, చిక్కుకొని కొట్టుమిట్టాడే మన కలియుగ మానవులందరికీ ఈ నలచరిత్ర అత్యావశక్యమే.
‘‘ఇది చరిత్ర, చరిత్ర, అంటూనే మీరు చెప్పినవన్నీ అంతరార్థాలే కదా! పదాల నిర్వచనాలే కదా! ఇంతకూ ఈ పేర్లన్నీ ఆయా పాత్రలకు వారి వారి తల్లిదండ్రులు పెట్టిన పేర్లా? లేక వ్యాసుడనే కవి పెట్టిన పేర్లా?’’ అని మీరు ఆలోచిస్తున్నారేమో?
- ఇంకాఉంది

- కుప్పా వేంకటకృష్ణమూర్తి