Others

నా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పచ్చని చెట్టును చూసి
మోసపోతే ఎలా?
భూమిని పాతుకుపోయన
చెట్టు వేళ్ళ బాధ వర్ణనాతీతం...

గుప్పెడు గుండె
కాలితనంతో మసక మసకగా రోదిస్తోంది
కళ్ళు మూసినప్పుడు
కనురెప్పల ముల్లులు చేసే గాయాలకు
బాధ కన్నీరై ఉడికిపోతోంది...

‘నా’ అనే అక్షరంలోని ఒంటరితనం
నరాల్లోకి చేరి
జీవితాన్ని మలుపులు మలుపులుగా
శాసిస్తోంది...

చిన్ననాటి నుండే
శిఖరాల్లాంటి పాదముద్రలు తోడు లేవు
ఇప్పుడేమో కన్నపేగ బుసలు కొట్టి
తొడలు చరచడాన్ని చూసి
శరీరం ముక్కలైంది...
ఇకనుండి నీడలు ఉండవు
అయనా పనికిరాని, పనికిమాలిన
బజారు నీడల అవసరం ఏముంది?
పద పద అక్షరమే ఊపిరై సాగాలి
నల్లటి మట్టిలో తోడు ఉండదు
మూతపడిన కళ్లు శూన్యానికి ప్రతీకలు
తీరంపై నిర్మించిన ఆకాశం కుప్పకూలింది
చెల్లాచెదురైన నక్షత్రాలు
సమాజపు సముద్రంలో
మునుగుతాయో తేలుతాయో!

నడవాలి
నడుస్తూ నడుస్తూ
పాదాలకు గుచ్చుకున్న మాటలను
తుడుచుకోవాలి
ఇప్పుడు నుదుటిపై చితాభస్మం
పూసుకొని నడవాలి
వారి పెదవులపై నుండి దొర్లిన
పచ్చి బూతులను మోస్తూ నడవాలి
మర్యాద అశ్లీలతగా మారిన చోట
దృశ్యాలను తెంపుకుని నడవాలి
దీపం చిన్నదే అయతేనేమి?
ఆ వెలుగులో
కోటానుకోట్ల పాలపుంతల
అక్షరాలను దర్శించాలి...

- అఖిలాశ, 7259511956