Others

కళ్ల కింద క్యారీబ్యాగ్‌లా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దూకుడు సినిమాలో ‘‘నిన్ను హీరో అంటే ఎట్లా నమ్మేవురా, కళ్లకింద అంతంత క్యారీబాగ్‌లు వేసుకొని’’ అన్న బ్రహ్మానందం డైలాగ్‌కి అమాయకంగా యం.ఎస్.నారాయణ ‘‘గ్రాఫిక్స్‌లో తీసేస్తారనుకున్నా’’ అంటాడు. ఆ డైలాగ్స్‌కి జనాలు సినిమా హాలులో పగలబడి నవ్వారు. గ్రాఫిక్స్‌లో తీయచ్చో లేదో తెలీదు కాని ఆపరేషన్ ద్వారా ఈ కంటి కింద క్యారీ బాగ్స్‌ని తప్పక నిర్మూలించగలం. ముఖానికి ముడతలు పడితేనే నచ్చదు, అలాంటిది కంటి కింద ఉబ్బులా కనిపించే ఈ క్యారీబాగ్స్ చాలా అసహ్యంగా కనిపిస్తాయి. ఎంతోమంది ఈ క్యారీబాగ్స్ ఉన్నవారిని పచ్చి తాగుబోతులుగా ఊహించుకుంటూ ఉంటారు. ఓసారి ఒక యాభై ఏళ్ల పెద్దాయన కంటికింద క్యారీబాగ్స్‌తో నా దగ్గరికి వచ్చాడు. అందరూ తనను పచ్చితాగుబోతనుకుంటున్నారని, నిజానికి వారానికో రెండు వారాలకో ఒకసారి తప్ప ఎక్కువగా మధ్యపానం చేయనని చెప్పి బాధపడ్డాడు. వాళ్ళ నాన్నగారికి, మరి తాతగారికి కూడా కంటి కింద ఉబ్బు చిన్నవయసులోనే ఏర్పడిందని అన్నారు. ‘‘అడిగిన ప్రతివారికి చెప్పలేక ఛస్తున్నా. దీనికి ఏదైనా విరుగుడుంటే చెప్పండని’’ అడిగారు. అందానికి ఎంతో విలువనిచ్చే నేటి ఆధునిక సమాజంలో కంటి కింద క్యారీ బాగ్స్‌తో మనల్ని మనం క్యారీ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అందం పోవడంతో పాటు తాగుబోతనే అపవాదు తెచ్చే ఈ క్యారీ బాగ్స్ గురించి తెలుసుకుందాం.
అసలు కంటికింద ఉబ్బులా కనిపించే ఈ క్యారీబాగ్స్
ఎందుకు వస్తాయి?
మన కంటి కింద ఉండే కొవ్వు వయసువల్ల మరియు భూఆకర్షణ శక్తి ప్రభావంవల్ల దాని పరిమితిలోంచి జారి కింద కింద ఉబ్బులా ఏర్పడుతుంది. ఈ జారిన కొవ్వులో అనేక కారణాలవల్ల నీరు నిలిచి ఆ ఉబ్బు చాలా ఎక్కువగా కనిపిస్తుంది.
ఇతర కారణాలు
వయసు ఒక కారణం అయితే, వంశ పారంపర్యంగా ఈ క్యారీబాగ్స్ రావడం మరొక కారణం. వీరిలో చిన్న వయసులోనే ఈ కంటికింద ఉబ్బు కనిపిస్తుంది.
కొవ్వులో నీరు నిలవడం
సరైన మేరకు నిద్ర లేకపోవడం, విపరీతమైన ఒత్తిడి, ఆహార పదార్థాలలో ఎక్కువ శాతం ఉప్పు ఉండడం, విపరీతమైన మద్యపానం, ఆడవారిలో గర్భవతి అయినపుడు ఋతుచక్ర సమయంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా నీరు నిలిచే ప్రమాదం ఉంది.
ఎలర్జీ: కంటి చుట్టూ వచ్చే ఎలర్జీవల్ల కలిగే చికాకు, ఆ చికాకు కారణంగా కంటిని బాగా రుద్దే ప్రయత్నంవల్ల ఈ కంటి కింది ఉబ్బు ఏర్పడి బాగా ఎత్తుగా కనిపిస్తుంది.
వీటికి చికిత్స?
ఈ క్యారీబాగ్స్ ఎంత ఎక్కువగా కనిపిస్తున్నాయి, అలా ఎంతసేపు ఉంటున్నాయి అన్నదాని మీద చికిత్స ఆధారపడి ఉంటుంది.
- పడుకునేప్పుడు తల స్థానం కొంచెం ఎత్తుగా ఉండేలా ఎతె్తైన దిండ్లని ఉపయోగించడం. దానివల్ల భూఆకర్షణ శక్తి ప్రభావం తలపై పడి నీరు నిలవదు.
- ఆహారంలో మార్పులు, ఉప్పు, కాఫీ, పంచదార, వేపుళ్లు మానడం లేక బాగా తగ్గించడం.
పై చెప్పినవన్నీ పాటించాక కూడా తగ్గకపోతే అప్పుడు ఆపరేషన్ చెయ్యవలసి వుంటుంది. ఇది చాలా చిన్న ఆపరేషన్. దీనిని బ్లిఫరోప్లాస్టీ (BHLEPHARO PLASTY) అంటారు.
క్రింది కనుబొమ్మ దగ్గర చిన్నగా కోసి బయటికి వచ్చిన కొవ్వు, మరియు అధికంగా వున్న చర్మాన్ని కోసి తీసేస్తారు. ఈ ఆపరేషన్‌తో కంటి క్రింది ఉబ్బే కాదు, ముడతలు కూడా పోతాయి.
అనుభవం, ఆదర్శం కంటే అందానికే నేటి యువత ఎక్కువ విలువనిస్తుంది. అందానే్న పెట్టుబడిగా పెట్టి విజయాన్ని సాధించాలని అనుకుంటున్నారు. వారందరూ ఒక విషయాన్ని గ్రహించాలి.
అందం మొదటి చూపుకే పరిమితం. ఆ తర్వాత నెగ్గాలి అంటే మాట తీరు, నడుచుకునే తీరు, సమయస్ఫూర్తి, కష్టపడే లక్షణం ఇవన్నీ సరైన మోతాదులో తోడైతేనే విజయం వరిస్తుంది. అది ప్రేమలోనైనా, క్లిష్టమైన పరిస్థితులోనైనా, ఉద్యోగంలోనైనా, ఉద్యమంలోనైనా అందంవల్ల ఆకర్షణ పుడుతుంది. అది కంటికి సంభంధించినది. ఆదర్శాలవల్ల అభిమానం పుడుతుంది. అది మనసుకి సంబంధించినది. ఆకర్షణ ఉండేది నిమిషాలే, అభిమానం ఉండేది యుగాలు. మన కంటికి మరోటి అందంగా కనిపిస్తే ఆకర్షణ దానివైపుకి మారిపోతుంది. కానీ అభిమానం అలా కాదు. అది నిత్యం, ఇదే సత్యం. ఆలోచించండి.

chitram... ఛికిత్స ముందు తరువాత ఇలా ...

-డా. రమేష్ శ్రీరంగం,
సర్జన్, ఫేస్ క్లినిక్స్,
ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్

-డాక్టర్ రమేష్ శ్రీరంగం

సెల్ నెం: 92995 59615 faceclinics@gmail.com

-డాక్టర్ రమేష్ శ్రీరంగం సెల్ నెం: 92995 59615 faceclinics@gmail.com